Oppo నుంచి కొత్త ఫోన్లు.. ట్రిపుల్ కెమెరా, 5000mAh బ్యాటరీ సహా కీలక ఫీచర్లు..!
ఒప్పో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఒప్పో రెనో 11 సిరీస్ (Oppo Reno 11)లో.. రెనో 11, రెనో 11 ప్రో స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. ఈ ఫోన్లు భారత్‌లో జనవరి 12న విడుదల కానున్నాయి. అయితే విడుదలకు ముందే ఈ ఫోన్లకు సంబంధించిన కొన్ని ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్ వేదికగా లీక్ అయ్యాయి.
ఒప్పో రెనో 11 స్పెసిఫికేషన్లు : టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ తన X వేదికగా రెనో 11 ఫోన్ స్పెసిఫికేషన్లను లీక్ చేశారు. ఈ ఫోన్ 6.7 అంగుళాల FHD+ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 120Hz రీఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డెమెన్సిటీ 7050 చిప్‌సెట్‌తో పనిచేస్తుందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత కలర్ OS పైన పనిచేస్తుంది.

ఒప్పో రెనో 11 కెమెరా వివరాలు : కెమెరా విభాగం విషయానికి వస్తే ఈ స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరాను కలిగి ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) ఫీచర్‌తో 50MP సోనీ LYT600 ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. 32MP IMX709 టెలీఫోటో లెన్స్ మరియు 8MP IMX355 సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ముందువైపు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
ఒప్పో రెనో 11 బ్యాటరీ మరియు ఛార్జింగ్ : ఒప్పో రెనో స్మార్ట్‌ఫోన్ 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మరియు ఈ హ్యాండ్‌సెట్ వైవ్ గ్రీన్ మరియు రాకీ గ్రే రంగుల్లో లభిస్తుందని సమాచారం. అయితే ఈ వివరాలపై అధిక ప్రకటన రావాల్సి ఉంది.

ఒప్పో రెనో 11 ప్రో స్పెసిఫికేషన్లు..! : మరో టిప్‌స్టర్ ఇషాన్ అగర్వాల్ ఆధారంగా ఒప్పో రెనో 11 ప్రో స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 లేదా స్నాప్ డ్రాగన్ 8+ జెన్ ప్రొసెసర్ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు 80W సూపర్‌వోక్ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంటుంది.
ఒప్పో రెనో 11 సిరీస్ ధర! : ఒప్పో రెనో 11 స్మార్ట్‌ఫోన్ ధర రూ.28000 లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అదే హైఎండ్ మోడల్ ఒప్పో రెనో 11 ప్రో ధర రూ.35000గా ఉండే అవకాశం ఉంది. ఈ ఒప్పో కొత్త ఫోన్ ఇదే సెగ్మెంట్‌లో ఉండే వివో V29e, శాంసంగ్ గెలాక్సీ A34 స్మార్ట్‌ఫోన్లకు పోటీనిచ్చే అవకాశం ఉంది. ఈ స్పెసిఫికేషన్లు, ధరలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








