Home
News

Oppo Reno 12 సిరీస్ లాంచ్ తేదీ విడుదలైంది! ధర,స్పెసిఫికేషన్ల వివరాలు 

Oppo సంస్థ చైనాలో తన రెనో 12 సిరీస్ లాంచ్‌ను అధికారికంగా ధృవీకరించింది. ఈ సిరీస్ లో దేశంలో Oppo Reno 12 మరియు Reno 12 Pro యొక్క అధికారిక విడుదల తేదీని నిర్ధారించడానికి స్మార్ట్‌ఫోన్ తయారీదారు ఇటీవల చైనీస్ సోషల్ మీడియాలో Weibo లో పోస్ట్ చేసారు.

ఒకసారి, గుర్తుచేసుకుంటే, Oppo Reno 11 సిరీస్ నవంబర్ 2023 లో చైనాలో లాంచ్ చేయబడింది. మరియు జనవరిలో భారతదేశానికి వచ్చింది. అయితే, ఇప్పుడు Oppo దాని అధికారిక Weibo హ్యాండిల్‌లో రెనో 12 సిరీస్ లాంచ్‌ను ధృవీకరించింది. అంటే, ఇండియా లాంచ్ కూడా త్వరలోనే ఉంటుందని అంచనా వేయవచ్చు.

Oppo Reno 12 Series Launch Date Confirmed

Oppo Reno 12 సిరీస్ లాంచ్ తేదీ, డిజైన్ వివరాలు
చైనాలో ఈ Oppo Reno 12 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల లాంచ్ తేదీ మే 23న స్థానిక సమయం సాయంత్రం 04:00 గంటలకు లేదా IST మధ్యాహ్నం 01:30 గంటలకు సెట్ చేయబడింది. ఈ సిరీస్ లైనప్ లో ఒప్పో రెనో 12 మరియు రెనో 12 ప్రో కూడా ఉన్నాయి.

ప్రస్తుతానికి, ఒప్పో రెనో 12 సిరీస్ స్పెసిఫికేషన్‌లను ఇంకా విడుదల చేయలేదు. అయితే, అధికారిక Weibo పోస్ట్ మరియు అనేక లీక్ ల ప్రకారం రెనో 12 మరియు రెనో 12 ప్రో రెండింటి రూపకల్పన మరియు కెమెరా లేఅవుట్‌ను వెల్లడిస్తుంది.

ఈ రెనో 12 పర్పుల్ కలర్‌వేలో చూపబడింది, ఈ ఒప్పో రెనో 12 ప్రో సిల్వర్ షేడ్‌ లో వస్తుంది. ఈ రెనో 12 స్మార్ట్‌ఫోన్‌లు రెండూ నిగనిగలాడే ఫినిషింగ్ మరియు ఎగువ ఎడమ మూలలో ట్రిపుల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉన్నట్లు కనిపిస్తాయి. ఒప్పో రెనో 12 మరియు 12 ప్రోలు ప్రధాన, అల్ట్రావైడ్ మరియు టెలిఫోటో కెమెరాను కలిగి ఉంటాయని భావిస్తున్నారు.

ఒప్పో రెనో 12, రెనో 12 ప్రో అంచనా స్పెసిఫికేషన్‌లు
ఈ సిరీస్ యొక్క వెనిలా రెనో 12 ఇటీవల ప్రకటించిన మీడియా టెక్ డైమెన్సిటీ 8250 SoC ప్రాసెసర్ తో మొదటి స్మార్ట్‌ఫోన్‌గా ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు. మరోవైపు, ఒప్పో రెనో 12 ప్రో మీడియాటెక్ డైమెన్సిటీ 9200 "స్టార్ స్పీడ్ ఎడిషన్" చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని అంచనా ఉంది.

ఈ చిప్‌లతో పాటు, ఒప్పో రెనో 12 120Hz రిఫ్రెష్ రేట్ మరియు FHD+ రిజల్యూషన్‌తో వంగిన OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అయినప్పటికీ రెనో 12 ప్రో దానిని 1.5K కర్వ్ OLED స్క్రీన్‌ తో వస్తుందని భావిస్తున్నారు.

Oppo Reno 12 సిరీస్ కూడా 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. పుకార్ల ప్రకారం, Oppo Reno 12 ప్రో, 50 MP సోనీ IMX890 ప్రైమరీ సెన్సార్, 8 MP అల్ట్రావైడ్ లెన్స్ మరియు 2x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50 MP టెలిఫోటో యూనిట్‌ను కలిగి ఉంటుంది.

ఇంకా ఖచ్చితమైన సమాచారం లేనప్పటికీ, వెనిలా రెనో 12 , 32 MP టెలిఫోటో యూనిట్‌కి డౌన్‌గ్రేడ్ అవుతుందని మేము భావిస్తున్నాము. మిగతా, రెండు రెనో 12 ఫోన్‌లు 50 MP సెల్ఫీ కెమెరాను ఉపయోగించగలవు. త్వరలో లాంచ్ కాబోయే ఈ Oppo Reno 12 సిరీస్‌కి సంబంధించిన అన్ని తాజా సమాచారం కోసం మా ఛానల్ ను ఫాలో అవ్వండి.

More from GizBot

Best Mobiles in India

English summary
Oppo Reno 12 Series Launch Date Confirmed For May 23. Expected Specifications And Price Details Here.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X