Home
News

Oppo Reno 12 సిరీస్ గ్లోబల్ వేరియంట్ ధర లీక్ అయింది! స్పెసిఫికేషన్లు

Oppo సంస్థ చైనా మార్కెట్లో Oppo Reno 12 సిరీస్‌ను ఇటీవల ప్రారంభించిన తర్వాత, ఇప్పుడు రాబోయే వారాల్లో ఈ సిరీస్ ను ప్రపంచవ్యాప్తంగా కూడా లాంచ్ చేయబడుతుందని బ్రాండ్ ఇప్పుడు ధృవీకరించింది. ఈ పరికరాల గ్లోబల్ మోడల్ స్పెసిఫికేషన్‌లు ఇంకా ధృవీకరించబడనప్పటికీ, రెనో 12 5G మరియు రెనో 12 ప్రో 5G రెండూ ఇటీవల ప్రకటించిన డైమెన్సిటీ 7300 SoC ప్రాసెసర్ ని కలిగి ఉంటాయని నివేదికలు పేర్కొన్నాయి. దానితో పాటు, ప్రముఖ టిప్‌స్టర్ పరాస్ గుగ్లానీ గ్లోబల్ రెనో 12 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల రంగు ఎంపికలు, స్టోరేజ్ కాన్ఫిగరేషన్ మరియు ధర వివరాలను వెల్లడించారు.

గుగ్లానీ ద్వారా X లో చేసిన ట్వీట్ ప్రకారం, Oppo Reno 12 5G గ్లోబల్ మోడల్ బ్లాక్ బ్రౌన్ మరియు ఆస్ట్రో సిల్వర్‌ రంగులలో వస్తుంది. అయితే, రెనో 12 ప్రో 5G నెబ్యులా సిల్వర్ మరియు నెబ్యులా బ్లాక్ రంగులలో లభిస్తుంది. రెనో 12 ఫోన్ 12GB RAM మరియు 256GB స్టోరేజీతో అందుబాటులో ఉంటుంది, అయితే ప్రో మోడల్ 12GB RAM మరియు 512GB వరకు స్టోరేజీ తో వస్తుంది.

Oppo Reno 12 Series Price Specifications And Variants Details

ఇక ధర విషయానికి వస్తే, యూరోజోన్‌లో రెనో 12 5G ధర € 457.83 కాగా, రెనో 12 ప్రో 5G ధర € 549.40 అని ఈ ట్వీట్ సమాచారం పేర్కొంది.

ఇప్పటివరకు వచ్చిన నివేదికలను పరిశీలిస్తే, ఈ గ్లోబల్ రెనో 12 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు డైమెన్సిటీ 7050 చిప్‌సెట్ యొక్క సక్సెసర్ అయిన కొత్త డైమెన్సిటీ 7300 SoCని కలిగి ఉన్నాయని పుకారు వచ్చింది.అంటే ఇవి దాదాపు 20% తగ్గిన విద్యుత్ వినియోగంతో పనితీరులో 20% మెరుగుదలను అందిస్తుంది.

ఇక కెమెరా స్పెసిఫికేషన్ల విషయానికొస్తే, లీక్ అయిన వివరాల సమాచారం ప్రకారం. రెనో 12 ప్రో 50 MP LYT-600 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుందని నివేదిక పేర్కొంది. అయితే రెనో 12 5G గ్లోబల్ మోడల్ 50MP + 8MP + 2MP కెమెరా సెటప్‌తో వస్తుంది, ఇందులో టెలిఫోటో కెమెరా ఉండదు. రెనో 11 5G గ్లోబల్ మోడల్‌లో 32MP టెలిఫోటో కెమెరా ఉన్నందున, బ్రాండ్ నాసిరకం కెమెరా హార్డ్‌వేర్‌తో వచ్చే అవకాశం లేదు. అంటే,అదే రకమైన కెమెరా లేదా ఇంకా మెరుగైన కెమెరా వస్తుందని భావించవచ్చు.

ఈ ఫోన్లు ఒప్పో యొక్క 80W సూపర్ ఊక్ ఫాస్ట్ ఛార్జింగ్‌ మద్దతుతో 5,000mAh బ్యాటరీలను ప్యాక్ చేసింది. ఇవి 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 6, బ్లూటూత్ 5.4, బీడౌ, GPS, GLONASS, గెలీలియో, QZSS మరియు USB టైప్-సి కనెక్టివిటీకి కూడా మద్దతు ఇస్తాయి. రెండు ఫోన్‌లు కూడా డస్ట్ మరియు స్ప్లాష్ రెసిస్టెన్స్ మరియు ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ల కోసం IP65 రేటింగ్‌తో వస్తాయి.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
Oppo Reno 12 Series Price,Specifications And Variants Details Leaked Ahead Of The Global launch
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X