Oppo Reno 3 Pro స్మార్ట్‌ఫోన్ మీద రూ.2,000 భారీ ధర తగ్గింపు...
ఈ ఏడాది మార్చి నెలలో విడుదల అయిన ఒప్పో రెనో 3 ప్రో ఫోన్ యొక్క ధర మీద భారతదేశంలో మరోక సారి ధర తగ్గింపును అందుకున్నది. క్వాడ్ రియర్ కెమెరా సెటప్ తో మిడ్-రేంజ్ విభాగంలో లభించే ఈ స్మార్ట్‌ఫోన్ మీద ధర తగ్గింపును అందుకోవడం ఇది మూడవసారి. ఏప్రిల్‌లో దేశంలో GST సవరణ తరువాత స్మార్ట్‌ఫోన్‌ల యొక్క ధరలను పెంచింది కానీ కంపెనీ త్వరలో ధరల తగ్గింపులను ప్రకటించింది. కాకపోతే ఈ సారి ఏకంగా అన్ని వేరియంట్ల మీద రూ.2000 వరకు ధరను తగ్గించింది.

ఒప్పో రెనో 3 ప్రో తగ్గింపు ధరల వివరాలు
ఒప్పో రెనో 3 ప్రో స్మార్ట్‌ఫోన్ మీద రూ.2,000 తాజా ధర తగ్గింపు తరువాత 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌కు పరిమితం చేయబడింది. అంటే ఇది రూ.25,990 ప్రారంభ ధర లభిస్తుంది. కొత్త ధర ఇప్పటికే అమెజాన్ జాబితాలో ప్రతిబింబిస్తుంది. అయితే ఆన్ లైన్ లో 256GB స్టోరేజ్ ఆప్షన్ యొక్క ధర ఇంకా రూ.29,990 ను కలిగి ఉంది. ఇది స్కై వైట్, మిడ్నైట్ బ్లాక్ మరియు అరోరల్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

ఒప్పో రెనో 3ప్రో కొత్త సాఫ్ట్‌వేర్ 2020 అప్ డేట్
జూలై నెలలో జూలై 2020 ప్యాచ్‌తో ఫోన్ సాధారణ నెలవారీ ఆండ్రాయిడ్ అప్ డేట్ ను కొత్తగా పొందింది. ఒప్పో రెనో 3 ప్రో హ్యాండ్‌సెట్ కోసం కొత్త అప్ డేట్ లో సాఫ్ట్‌వేర్ వెర్షన్ CPH2035_11_A.19 కూడా ప్రస్తుతం అందుబాటులో ఉంది. కొత్త సాఫ్ట్‌వేర్ కలర్‌ఓఎస్ 7.1 వెర్షన్ ఆధారంగా సరికొత్త ఆండ్రాయిడ్ 10 OSలో ఫోన్ రన్ అవుతుంది.

ఒప్పో రెనో 3ప్రో అమోలెడ్ డిస్‌ప్లే స్పెసిఫికేషన్స్
ఒప్పో రెనో 3ప్రో స్మార్ట్‌ఫోన్ 6.4 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను 2400 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో కలిగి ఉంటుంది. ఇది బ్లాక్, బ్లూ మరియు పర్పుల్ వంటి మూడు కలర్ ఆప్షన్ లలో ఈ హ్యాండ్‌సెట్‌ను కంపెనీ అందిస్తుందని భావిస్తున్నారు. ఇది 2.8GHz క్లాక్ వేగంతో మరియు క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 SoC తో ప్యాక్ చేయబడి వస్తుంది. ఒప్పో సంస్థ దీనిని 8 జిబి ర్యామ్ / 128జిబి స్టోరేజ్ మరియు 8 జిబి ర్యామ్/ 256 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ లలో అందిస్తుంది.

ఒప్పో రెనో 3ప్రో 64MP కెమెరా సెటప్
ఆండ్రాయిడ్ 10 ఆధారిత కలర్‌ఓఎస్ 7.1తో రన్ అవుతున్నట్లు దీనిని డిజైన్ చేసారు. ఇమేజింగ్ కోసం దీని యొక్క వెనుక వైపు క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉన్నది. ఇందులో మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ షూటర్ మరియు 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ రెండవ కెమెరాతో జతచేయబడుతుంది.అలాగే 13 మెగాపిక్సెల్ మాక్రో మరియు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాలు కూడా ఇందులో ఉన్నట్లు సమాచారం. ముందు భాగంలో డ్యూయల్ సెల్ఫీ కెమెరాలను కలిగి ఉన్నాయి. ఇందులో 44 మెగాపిక్సెల్ కెమెరా మరియు 2-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాలు జతచేయబడి ఉన్నాయి.

ఒప్పో రెనో 3ప్రో 45W సూపర్ VOOC ఫ్లాష్ ఛార్జింగ్ బ్యాటరీ
ఒప్పో రెనో 3ప్రో స్మార్ట్ ఫోన్ 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 45W సూపర్ VOOC ఫ్లాష్ ఛార్జింగ్ టెక్నాలజీ మద్దతుతో రానున్నది. ఈ ఫోన్ వైర్‌లెస్ రివర్స్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది.


Click it and Unblock the Notifications