Oppo Reno 4 Pro ధోని ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ సేల్ రేపటి నుంచే!!! ఆఫర్స్ బ్రహ్మాండం

|

భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని సంతకం చేసిన బ్యాక్ ప్యానల్‌తో తయారుచేసిన ఒప్పో రెనో 4 ప్రో గెలాక్సీ బ్లూ ఎడిషన్‌ను ఇటీవల విడుదల చేసారు. ఒప్పో రెనో 4 ప్రో యొక్క కొత్త వేరియంట్ ఫోన్‌ను ధోని ప్రమోట్ చేస్తుండడం మరొక గొప్ప విషయం. ఈ స్మార్ట్‌ఫోన్ కస్టమైజ్డ్ బాక్స్‌ ప్యానల్‌ మీద క్రికెటర్ సంతకంతో పాటు "ఎంఎస్ ధోని" బ్రాండింగ్‌ను కూడా కలిగి ఉంటుంది. ఈ గెలాక్సీ బ్లూ ఎడిషన్‌ను లాంచ్ IPL 2020 టోర్నమెంట్ మధ్యలో రేపటి నుంచి అంటే సెప్టెంబర్ 24 నుండి మొదటి సారి కొనుగోలు చేయడానికి అందుబాటులోకి రానున్నది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

ఒప్పో రెనో 4 ప్రో గెలాక్సీ బ్లూ ఎడిషన్ ధరల వివరాలు

ఒప్పో రెనో 4 ప్రో గెలాక్సీ బ్లూ ఎడిషన్ ధరల వివరాలు

ఇండియాలో ఒప్పో రెనో 4 ప్రో గెలాక్సీ బ్లూ ఎడిషన్‌ యొక్క 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ మోడల్ ను రూ.34,990 ధర వద్ద కొనుగోలు చెయవచ్చు. అంటే ఇది ఒప్పో యొక్క సాధారణ ఒప్పో రెనో 4 ప్రో ధరకు సమానంగా ఉంది. దీనిని సెప్టెంబర్ 24, గురువారం నుండి ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చెయవచ్చు. ఈ ఫోన్ యొక్క లాంచ్ ఆఫర్‌లలో SBI క్రెడిట్ మరియు డెబిట్ కార్డులపై రూ.2,500 తక్షణ తగ్గింపుతో పాటు ఏడు నెలల వరకు పొడిగించిన వారంటీ మరియు ఫోన్ తొమ్మిది నెలల వరకు నో-కాస్ట్ EMI ఎంపికలతో కొనుగోలు చెయవచ్చు.

ఒప్పో రెనో 4 ప్రో గెలాక్సీ బ్లూ ఎడిషన్ స్నాప్‌డ్రాగన్ 720G SoC
 

ఒప్పో రెనో 4 ప్రో గెలాక్సీ బ్లూ ఎడిషన్ స్నాప్‌డ్రాగన్ 720G SoC

ఒప్పో రెనో 4 ప్రో గెలాక్సీ బ్లూ ఎడిషన్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే దీని యొక్క డిస్ప్లే ఫ్రంట్‌లో రెగ్యులర్ మోడల్‌కు సమానంగా ఉంటుంది. అంటే ఇది డ్యూయల్ సిమ్ (నానో) మద్దతుతో పాటు 90HZ రిఫ్రెష్ రేట్ మరియు 180HZ టచ్ శాంప్లింగ్ రేటుతో 6.5-అంగుళాల ఫుల్-HD+ డిస్ప్లేని 1,080x2,400 పిక్సెల్స్ పరిమాణంలో లభిస్తుంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720G SoC చేత రన్ అవుతూ 8GB RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో జత చేయబడి వస్తుంది.

ఒప్పో రెనో 4 ప్రో గెలాక్సీ బ్లూ ఎడిషన్ కెమెరా సెటప్

ఒప్పో రెనో 4 ప్రో గెలాక్సీ బ్లూ ఎడిషన్ కెమెరా సెటప్

ఒప్పో రెనో 4 ప్రో గెలాక్సీ బ్లూ ఎడిషన్ ఫోన్‌ మోడల్ లో ఫోటోలు మరియు వీడియోల కోసం వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో ఎఫ్ / 1.7 లెన్స్ మరియు సోనీ IMX586 సెన్సార్‌తో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ఎఫ్ / 2.2 లెన్స్ మరియు అల్ట్రా-వైడ్ యాంగిల్ సెకండరీ సెన్సార్ తో 8-మెగాపిక్సెల్ కెమెరా, మరియు 2-మెగాపిక్సెల్ మాక్రో షూటర్ మరియు ఎఫ్ / 2.4 లెన్స్‌తో 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ కెమెరాలు జతచేయబడి ఉంటాయి. అలాగే సెల్ఫీల కోసం ముందుభాగంలో ఎఫ్ / 2.4 లెన్స్‌తో 32 మెగాపిక్సెల్ సోనీ IMX616 సెన్సార్‌తో సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

ఒప్పో రెనో 4 ప్రో గెలాక్సీ బ్లూ ఎడిషన్ 65W సూపర్‌వూక్ 2.0 ఫాస్ట్ ఛార్జింగ్‌

ఒప్పో రెనో 4 ప్రో గెలాక్సీ బ్లూ ఎడిషన్ 65W సూపర్‌వూక్ 2.0 ఫాస్ట్ ఛార్జింగ్‌

ఒప్పో రెనో 4 ప్రో గెలాక్సీ బ్లూ ఎడిషన్ ఫోన్‌లోని కనెక్టివిటీ ఎంపికల విషయానికి వస్తే ఇది 4G ఎల్‌టిఇ, వై-ఫై, బ్లూటూత్, జిపిఎస్ / ఎ-జిపిఎస్ మరియు యుఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఈ స్మార్ట్ఫోన్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. ఇది కాకుండా ఇది 65W సూపర్‌వూక్ 2.0 ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతును ఇచ్చే 4,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

Best Mobiles in India

Read more about:
English summary
Oppo Reno 4 Pro Galactic Blue MS Dhoni Edition First Sale Starts Tomorrow in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X