Home
News

ఒప్పో రెనో 5 & 5ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ల ధరలు & ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూడండి!!!

ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఒప్పో ఎప్పటినుంచో విడుదల చేయాలి అని చూస్తున్న 5G స్మార్ట్ ఫోన్లు ఒప్పో రెనో 5 5G మరియు రెనో 5 ప్రో 5G రెండు కొత్త ఫోన్లను ఇటీవల విడుదల చేసింది. దీని యొక్క పేరుకు తగ్గట్టుగా ఈ రెండు ఫోన్లు 5G కనెక్టివిటీ మద్దతుతో రావడంతో పాటుగా అధిక పనితీరు కోసం ఆక్టా-కోర్ ప్రాసెసర్‌లతో వస్తున్నాయి. ఈ ఒప్పో సిరీస్‌లోని రెనో 5 ప్రో + 5G యొక్క మరో ఫోన్ టీజర్ ను కూడా సంస్థ విడుదల చేసింది. ఈ కొత్త ఫోన్ల ధరలు మరియు స్పెసిఫికేషన్స్ వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఒప్పో రెనో 5 5G సిరీస్ ధరల వివరాలు

ఒప్పో రెనో 5 5G సిరీస్ ధరల వివరాలు

ఒప్పో రెనో 5 5G ఫోన్ ను రెండు విభిన్న వేరియంట్‌లలో విడుదల చేసింది. ఇందులో 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్‌ ధర CNY2,699 (సుమారు రూ.30,400) కాగా 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ టాప్-ఎండ్ మోడల్ వేరియంట్‌ ధర CNY2,999 (సుమారు రూ.33,700). అలాగే మరోవైపు ఒప్పో రెనో 5 ప్రో 5G యొక్క 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY3,399 (సుమారు రూ.38,200) మరియు 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY3,799 (సుమారు రూ. 42,700). ఈ రెండు ఫోన్లను అరోరా బ్లూ, స్టార్రి నైట్ మరియు మూన్లైట్ నైట్ వంటి మూడు కలర్ ఎంపికలలో విడుదల చేసారు.

 

ఒప్పో రెనో 5 5G 90HZ రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే స్పెసిఫికేషన్స్

ఒప్పో రెనో 5 5G 90HZ రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే స్పెసిఫికేషన్స్

ఒప్పో రెనో 5 5G స్మార్ట్ ఫోన్ 6.43-అంగుళాల ఫుల్ హెచ్‌డి + డిస్‌ప్లేను 90HZ రిఫ్రెష్ రేట్ మరియు 91.7 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారంగా కలర్‌ OS11.1 పై రన్ అవుతుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 765G SoC తో రన్ అవుతూ 12GB వరకు ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో జతచేయబడి వస్తుంది.

ఒప్పో రెనో 5 5G క్వాడ్-కెమెరా సెటప్ ఫీచర్స్

ఒప్పో రెనో 5 5G క్వాడ్-కెమెరా సెటప్ ఫీచర్స్

ఈ ఫోన్ వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో 64MP లెన్స్ తో ప్రైమరీ సెన్సార్ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ తో సెకండరీ కెమెరా, 2MP మాక్రో షూటర్ మరియు 2MP పోర్ట్రెయిట్ షూటర్‌తో రెండు సెన్సార్ కెమెరాలు జత చేయబడి ఉంటాయి. అలాగే వీడియో కాలింగ్ మరియు సెల్ఫీల కోసం ముందు భాగంలో 32MP లెన్స్ తో సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ 65W ఫాస్ట్ ఛార్జింగ్ యొక్క మద్దతుతో 4,300mAh బ్యాటరీతో చేయబడి వస్తుంది.

ఒప్పో రెనో 5 ప్రో 5G ఆండ్రాయిడ్ 11 స్పెసిఫికేషన్స్

ఒప్పో రెనో 5 ప్రో 5G ఆండ్రాయిడ్ 11 స్పెసిఫికేషన్స్

ఒప్పో రెనో 5 ప్రో 5G స్మార్ట్ ఫోన్ 90HZ రిఫ్రెష్ రేట్‌ మద్దతును కలిగి ఉండే 6.55-అంగుళాల ఫుల్ హెచ్‌డి + డిస్‌ప్లేను కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 ఆధారంగా కలర్ ఓఎస్ 11.1 పై రన్ అవుతుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 1000+ SoC చేత శక్తిని అందించే ఈ ఫోన్ 12GB వరకు ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో జతచేయబడి ఉంటుంది. కెమెరా విషయానికొస్తే ఒప్పో రెనో 5 5G వలె ఒకే కెమెరా సెటప్ ను కలిగి ఉంటాయి. కానీ ఇది అదే 65W ఫాస్ట్ ఛార్జింగ్‌ మద్దతుతో 4,350mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

Best Mobiles in India

English summary
Oppo Reno 5 & 5 Pro 5G Smartphones Released: Specifications, India price, India Launch Date and more
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X