ఒప్పో రెనో 6 సిరీస్ లాంచ్ డేట్, స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి!! మీరు ఓ లుక్ వేయండి

|

ఒప్పో రెనో 6 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను ఈ నెల అంటే మే 27 న చైనాలో ప్రారంభించనున్నట్లు కంపెనీ తన యొక్క స్థానిక సోషల్ మీడియా సైట్లలో ధృవీకరించింది. ఈ సిరీస్‌లో వనిల్లా ఒప్పో రెనో 6, ఒప్పో రెనో 6 ప్రో మరియు చాలా ఖరీదైన ఒప్పో రెనో 6 ప్రో + వంటి మూడు మోడళ్లు ఉండే అవకాశం ఉంది. ఈ మూడు మోడళ్లను ధృవీకరణ సైట్లలో గుర్తించబడడమే కాకుండా ఇప్పటికే వీటి యొక్క ఫోటోలు ఆన్‌లైన్‌లో కూడా విస్తృతంగా లీక్ అయ్యాయి. ఒప్పో రెనో 6 ప్రో మీడియాటెక్ డైమెన్సిటీ 1200 SoC చేత మరియు ఒప్పో రెనో 6 ప్రో + స్నాప్‌డ్రాగన్ 870 SoC చిప్ సెట్ లను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ల యొక్క ఫీచర్స్ మరియు స్పెసిఫికేషన్స్ వంటి వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

ఒప్పో రెనో 6 సిరీస్ లాంచ్ డేట్

ఒప్పో రెనో 6 సిరీస్ లాంచ్ డేట్

ఒప్పో రెనో 6 సిరీస్ మే 27 న చైనాలో లాంచ్ అవుతుందని కంపెనీ ఆన్‌లైన్‌లో వీబో సోషల్ మీడియా సైట్లలో ధృవీకరించింది. ఈ సిరీస్ ఎన్ని మోడల్స్ లను కలిగిఉంటుందో అని పోస్ట్ వెల్లడించలేదు. దీనితో పాటుగా ఫోన్‌ల గురించి ఎటువంటి వివరాలను కూడా ఇవ్వలేదు. అయినప్పటికీ ఇది నీటి నిరోధక సామర్థ్యాలను కలిగి ఉన్నట్లు సూచిస్తుంది. ఒప్పో రెనో 6 సుమారు CNY 2,500 (సుమారు రూ. 28,600) ధర వద్ద ప్రారంభమవుతుందని టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ఇటీవల వెల్లడించింది.

ఒప్పో రెనో 6 సిరీస్ స్పెసిఫికేషన్స్
 

ఒప్పో రెనో 6 సిరీస్ స్పెసిఫికేషన్స్

ఒప్పో రెనో 6, ఒప్పో రెనో 6 ప్రో, ఒప్పో రెనో 6 ప్రో + అనే మూడు హ్యాండ్‌సెట్‌ల యొక్క స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఇవి 90HZ స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌ను మరియు 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటాయని భావిస్తున్నారు. అదనంగా అవి Android 11- ఆధారిత ColorOS తో రన్ అయ్యే అవకాశం ఉంది. ఒప్పో రెనో 6 కొత్తగా ప్రకటించిన మీడియాటెక్ డైమెన్సిటీ 900 SoC చేత శక్తిని పొందుతుందని పుకారు ఉంది. గత లీక్‌లు ఒప్పో రెనో 6 ప్రో మీడియాటెక్ డైమెన్సిటీ 1200 SoC చేత శక్తినివ్వవచ్చని సూచిస్తున్నాయి. అయితే ఒప్పో రెనో 6 ప్రో+ మాత్రం స్నాప్‌డ్రాగన్ 870 SoC చేత శక్తినివ్వవచ్చు అని భావిస్తున్నారు.

TENAA

TENAA ఆన్‌లైన్‌లో ఒప్పో రెనో 6 ప్రో మోడల్ నెంబర్ ను PEPM00 తో జాబితా చేయబడ్డారు. ఈ ఫోన్ 6.55-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉండి 160x73.1x7.6mm కొలతల పరిమాణంలో వస్తుంది. అంతేకాకుండా ఇది 2,200mAh డ్యూయల్ సెల్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తున్నట్లు టెనాలో జాబితా చేయబడింది. చివరిగా ఒప్పో రెనో 6 ప్రో + PENM00 ఫోన్ మోడల్ నంబర్ తో TENAA లో జాబితా చేయబడింది. ఈ మోడల్ ఇదే విధమైన 6.55-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉండి 2,200 mAh డ్యూయల్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఒప్పో రెనో 6 ప్రో + 160.8x72.5x7.99 మిమీ కొలుతలతో వస్తుందని అంచనా. 2,200mAh యొక్క డ్యూయల్-సెల్ బ్యాటరీ అంటే ఫోన్లు మొత్తం సామర్థ్యంలో 4,500mAh బ్యాటరీతో 188 గ్రాముల బరువుతో ప్యాక్ చేయబడి వస్తాయి.

Best Mobiles in India

English summary
Oppo Reno 6 Series Launch Date Revelled: Expected India Price, Specs, India Launch Date and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X