Home
News

Oppo Reno 8 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ల లాంచ్ డేట్, స్పెసిఫికేషన్స్ వివరాలు లీక్ అయ్యాయి!!

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు ఒప్పో తన ఫ్లాగ్‌షిప్ ఒప్పో రెనో 8 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. అయితే లాంచ్ కి రోజుల ముందే కొత్త ఆన్ లైన్ లో విడుదల అయ్యాయి. దీనితో పాటుగా ఈ స్మార్ట్‌ఫోన్‌ల యొక్క లాంచ్ తేదీ కూడా లీక్ అయింది. ఒప్పో రెనో 8 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు మే 23న చైనాలో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ధృవీకరించింది. అయితే ఇండియాలో ఎప్పుడు లాంచ్ చేయనున్నదో వంటి వివరాలను ఇంకా ప్రకటించలేదు. కనీసం చైనాలో లాంచ్ చేయనున్న రోజు అయిన ఇండియా యొక్క యొక్క లాంచ్ వివరాలను ప్రకటిస్తుంది ఏమో చూడాలి. ఒప్పో రెనో 8 సిరీస్‌లో ఒప్పో రెనో 8, రెనో 8 ప్రో మరియు రెనో 8 SE అనే మూడు వేరియంట్‌లు ఉంటాయి. మే 20న క్వాల్‌కామ్ సంస్థ ప్రకటించబోయే సరికొత్త స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ ఈ సిరీస్‌లోని ఫోన్ లలో రావడం గమనార్హం. ఆన్ లైన్ లో లీక్ అయిన స్పెసిఫికేషన్స్ వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఒప్పో రెనో 8 ప్రో స్పెసిఫికేషన్స్

ఒప్పో రెనో 8 ప్రో స్పెసిఫికేషన్స్

ఒప్పో రెనో8 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల యొక్క స్పెసిఫికేషన్‌ల వివరాలు గత లీక్‌లు మరియు పుకార్లు చాలా వివరాలను విడుదల చేసాయి. ఈ లీక్ల సమాచారం ప్రకారం ఒప్పో రెనో 8 ప్రో మోడల్ 120Hz రిఫ్రెష్ రేట్‌ మద్దతుతో 6.7-అంగుళాల ఫుల్ HD+ OLED స్క్రీన్‌ను కలిగి ఉన్న డిస్‌ప్లేతో వస్తుందని భావిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8100-Max ప్రాసెసర్‌తో లభించే అవకాశం ఉంది. అలాగే ఇది 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటుగా 4,500mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి అందించబడుతుంది. ఈ బ్రాండ్ గ్రీన్, రోమింగ్ గ్రే మరియు డార్క్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఒప్పో రెనో 8 స్పెసిఫికేషన్స్

ఒప్పో రెనో 8 స్పెసిఫికేషన్స్

ఒప్పో రెనో8 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లలోని రెనో 8 ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.62-అంగుళాల ఫుల్ HD+ E4 OLED డిస్‌ప్లేతో వస్తుందని భావిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెనరేషన్ 1 ప్రాసెసర్‌తో అందించబడుతుంది. ఈ ప్రాసెసర్‌తో మార్కెట్ లో లాంచ్ కాబోతున్న ఫోన్ లలో మొదటిది ఇదే కావచ్చు. ఈ మోడల్‌ కూడా 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,500mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి అందించబడుతుంది. ఈ ఒప్పో రెనో 8 ఫోన్ డ్రంక్, ఎన్‌కౌంటర్ బ్లూ మరియు నైట్ టూర్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో రావచ్చు.

 ఒప్పో రెనో 8 SE స్పెసిఫికేషన్స్

ఒప్పో రెనో 8 SE స్పెసిఫికేషన్స్

ఒప్పో రెనో 8 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లలో లభించే మరొక ఫోన్ రెనో 8 SE యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది 6.43-అంగుళాల ఫుల్ HD+ OLED డిస్‌ప్లేను 90Hz రిఫ్రెష్ రేట్ మద్దతుతో కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 1300 చిప్‌సెట్‌ను కలిగి ఉండి ఇతర రెండు మోడళ్ల మాదిరిగానే 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,500mAh బ్యాటరీ మద్దతుతో ప్యాక్ చేయబడి లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్లైట్లీ డ్రంక్, క్లియర్ స్కై బ్లూ మరియు నైట్ టూర్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Oppo Reno 8 Series Smartphones Launch Date and Specifications Details Leaked: Here are Full Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X