Oppo స్మార్ట్‌ఫోన్ల ధరలు భారీగా పెరిగాయి!! కొత్త ధరలు ఇవే...
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ఒప్పో ఇండియా యొక్క మార్కెట్లో విడుదల చేసిన కొన్ని స్మార్ట్‌ఫోన్ల యొక్క ధరలను పెంచింది. ఈ కంపెనీ బడ్జెట్ మరియు మిడ్-రేంజ్ పోర్ట్‌ఫోలియో విభాగంలో విడుదల చేసిన హ్యాండ్‌సెట్‌లు - ఒప్పో A11K, ఒప్పో A53, ఒప్పో A15, మరియు ఒప్పో F19 వంటి ఫోన్ల యొక్క ధరల మీద రూ.1,000 వరకు పెంచింది. ఈ చైనా కంపెనీ ఏ కారణంతో ఈ ధరల పెరుగుదలను ప్రకటించింది అనే దానికి సంబంధించి ఎటువంటి ప్రకటనను విడుదల చేయకపోయినప్పటికి ప్రస్తుతం మార్కెట్లో కొనసాగుతున్న చిప్‌సెట్ల సంక్షోభాల ఫలితంగా ఒప్పో సంస్థ ధరల పెరుగుదలను ప్రకటించింది అని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి.

ఒప్పో F19s ఫోన్ యొక్క 6GB ర్యామ్ వేరియంట్ ఇంతకు ముందు రూ.17,990 ధర వద్ద లభించేది. అయితే ఇప్పుడు దర పెరుగుదల తరువాత రూ.18,990 రిటైల్ ధరకు పెరిగింది. అలాగే రూ.8,990 ధర వద్ద లభించే ఒప్పో A11K ఇప్పుడు ధరల పెంపు తరువాత రూ.8,990 వద్ద లభిస్తుంది. అయితే ఇటీవల దాని ధరల మీద రూ.500 పెంపు తరువాత దాని ధర రూ.8,490 నుంచి పెరిగింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ మళ్లీ ధరల పెరుగుదలను అందుకొని రూ.8,990 ధరకు చేరుకున్నది.

సాధారణంగా ఇంతకుముందు రూ.9,490 ధర వద్ద లభించే ఒప్పో A15 2GB ర్యామ్ వేరియంట్ ఫోన్ కొత్తగా రూ.500 ధరల పెరుగుదలను అందుకున్న తరువాత ఇప్పుడు రూ.9,500 ధర వద్ద లభించనున్నది. ఇది అమెజాన్‌లో దాని అసలు ధర వద్ద జాబితా చేయబడింది. అదేవిధంగా రూ. 9,990 ధర వద్ద లభించే 3GB వేరియంట్ మీద రూ.1000 పెంపు అందుకున్న తరువాత ఇప్పుడు రూ.10,990 ధరను అందుకున్నది. అయితే ఇది ఇప్పుడు అమెజాన్‌లో ఈ ఫోన్ రూ.500 తక్కువ ధర వద్ద రూ.10,490 అందుబాటులో ఉంది.

ఒప్పో సంస్థ అందించే బ్రాండెడ్ ఫోన్ లలో ఒకటైన ఒప్పో A15s సాధారణంగా రూ.11,490 ధర వద్ద లభించే ఈ హ్యాండ్‌సెట్ ఇప్పుడు రూ.1,000 పెంపు తర్వాత అమెజాన్ లో రూ.12,490 ధర వద్ద పొందవచ్చు. అలాగే ఒప్పో A53s 5G యొక్క 8GB వేరియంట్‌ను కంపెనీ రూ.16,990 ధర వద్ద ప్రారంభించినప్పటికి ఇప్పుడు ఈ ఫోన్ మీద రూ.1000 ధరల పెరుగుదలను అందుకున్నది. ఇప్పుడు దీనిని ఫ్లిప్‌కార్ట్‌లో 17,990 రూపాయల ధర వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. రియల్‌మి, వివో, షియోమి వంటి స్మార్ట్‌ఫోన్ సంస్థలు కూడా తమ లైనప్‌లలో కొన్ని స్మార్ట్‌ఫోన్‌ల ధరలను పెంచారు.


Click it and Unblock the Notifications








