ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో ‘OPPO F5’

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ ‘ఒప్పో’ (OPPO), భారత్‌లో తన మార్కెట్ పరిధిని మరింత విస్తరించుకునే ప్రయత్నం చేస్తోంది.

|

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ 'ఒప్పో’ (OPPO), భారత్‌లో తన మార్కెట్ పరిధిని మరింత విస్తరించుకునే ప్రయత్నం చేస్తోంది.

OPPO to step up the selfie game with the new AI Powered Selfie Expert smartphone

ఈ బ్రాండ్ నుంచి త్వరలో OPPO F5 పేరుతో సరికొత్త ఫోన్‌ లాంచ్ కాబోతోంది. నవంబర్ 2న మార్కెట్లో విడుదల కాబోతోన్న ఈ సెల్ఫీ సెంట్రిక్ స్మార్ట్‌ఫోన్‌కు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో పాటు 18:9 కారక నిష్పత్తి స్ర్కీన్‌లు ప్రధాన హైలైట్‌గా నిలువనున్నాయి.

6 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ Bezel-less డిస్‌ప్లే

6 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ Bezel-less డిస్‌ప్లే

ఒప్పో ఎఫ్5 స్మార్ట్‌ఫోన్, 6 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ బీజిల్-లెస్ (ఎడ్జ్ టు ఎడ్జ్) డిస్‌ప్లేతో రాబోతోంది. స్ర్కీన్ రిసల్యూషన్ వచ్చేసరికి 2160 x 1080 పిక్సల్స్. బీజిల్-లెస్ డిజైన్ కారణంగా డిస్‌ప్లే సైజు పెద్దదిగా అనిపిస్తుంది. లక్ ఇంకా ఫీల్ పరంగా చాలా కాంపాక్ట్‌గా కనిపించే ఈ స్మార్ట్‌ఫోన్‌ను సింగిల్ హ్యాండ్‌తో ఆపరేట్ చేయవచ్చట.

18:9 కారక నిష్పత్తి స్ర్కీన్‌తో వస్తోన్న ఈ పెద్దతెర స్మార్ట్‌ఫోన్‌లో గేమింగ్, వెబ్ బ్రౌజింగ్, రీడింగ్ ఇంకా వీడియో వ్యూవింగ్ ఎక్స్‌పీరియన్స్‌లు మైండ్ బ్లోయింగ్‌గా ఉంటాయని ఒప్పో చెబుతోంది. ఈ ఫోన్‌తో విప్లవాత్మక ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సెల్ఫీ-క్యాప్చుర్ టెక్నాలజీని కూడా ఒప్పో పరిచయం చేయబోతోంది.

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో పనిచేసే బ్యూటిఫై టెక్నాలజీ..
 

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో పనిచేసే బ్యూటిఫై టెక్నాలజీ..

ఒప్పో ఎఫ్5 స్మార్ట్‌ఫోన్ ఫ్రంట్ కెమెరా ద్వారా విప్లవాత్మక ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని యూజర్లు ఆస్వాదించగలుగుతారు. ముఖ్యంగా సెల్ఫీ షాట్‌లను చిత్రీకరించుకునే సమయంలో ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్ వర్క్ అవుతుంది.

ఫోన్‌ ఫ్రంట్ కెమెరాలో లోడ్ చేసిన అప్‌డేటెడ్ బ్యూటిఫై టెక్నాలజీ, మెరుగైన సెల్ఫీలను ఉత్పత్తి చేసే క్రమంలో AI అల్గోరిథంలను ఉపయోగించుకుంటుంది. దీంతో ఫైనల్ అవుట్ పుట్ మరింత క్వాలిటీతో లభిస్తుంది.

పేలిన జియో ఫోన్ ఫోన్, కంపెనీ దిమ్మతిరిగే సమాధానం !పేలిన జియో ఫోన్ ఫోన్, కంపెనీ దిమ్మతిరిగే సమాధానం !

మైమరిపించే మల్టీమీడియా ఎక్స్‌పీరియన్స్

మైమరిపించే మల్టీమీడియా ఎక్స్‌పీరియన్స్

నిన్న మొన్నటి వరకు మనం గమనించినట్లయితే స్మార్ట్‌ఫోన్ల విభాగంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని కేవలం సాఫ్ట్‌వేర్ యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరిచేందుకే మాత్రమే మొబైల్ తయారీ కంపెనీలు ఉపయోగించుకునేవి. ఈ విషయంలో మరో అడుగు ముందుకు వేసిన ఒప్పో తన ఎఫ్5 స్మార్ట్‌ఫోన్ ద్వారా ఏకంగా కెమెరాలోకే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చేసింది. ఇక ఈ ఫోన్‌కు సంబంధించి మల్టీ మీడియా విభాగాన్ని పరిశీలించినట్లయితే 6 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ స్ర్కీన్ మైమరిపించే మల్టీమీడియా ఎక్స్‌పీరియన్స్‌ను ఆఫర్ చేస్తుందని ఒప్పో చెబుతోంది.

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ సాక్, 6జీబి ర్యామ్, 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ సాక్, 6జీబి ర్యామ్, 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్

ఒప్పో ఎఫ్5 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే, ఈ ఫోన్ Qualcomm Snapdragon 660 SoC పై రన్ అవుతుంది. మొత్తం రెండు వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. అందులో మొదటి వేరియంట్ వచ్చేసరికి 4జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌తోనూ, రెండవ వేరియంట్ వచ్చేసరికి 6జీబి ర్యామ్ + 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌తోనూ లభిస్తుంది.

సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే ఆండ్రాయిడ్ 7 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం పై ఫోన్ బూట్ అవుతుంది. 4,000 mAh బ్యాటరీ యూనిట్‌ను ఫోన్‌లో లోడ్ చేసినట్లు తెలుస్తోంది. గోల్డ్, రెడ్ ఇంకా బ్లాక్ కలర్ వేరియంట్ లలో ఈ ఫోన్ లభించే అవకాశం ఉంది.

Best Mobiles in India

English summary
OPPO to step up the selfie game with the new AI Powered Selfie Expert smartphone. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X