ఒప్పో సింగిల్‌గానే వస్తుందట!
ఇండియాలో సొంతగా సింగిల్ బ్రాండ్ రిటైల్ దుకాణాలు ఏర్పాటు చేసేందుకు ఒప్పో సిద్ఢంగా ఉంది.
ఇండియాలో విపరీతమైన ఆదరణ పొందిన చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఒప్పో..తన కస్టమర్ బ్యాంకును మరింత పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇండియాలో ఒకే బ్రాండ్ రిటైల్ దుకాణాలను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఇండియాలో ఒప్పో సొంత స్టోర్లను ఏర్పాటు చేసుకునేందుకు భారత ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో ఒప్పో స్టోర్లను ఏర్పాటు చేసుకునేందుకు రెడీగా ఉంది.

ఒప్పో మొబైల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అభ్యర్థనను భారత ప్రభుత్వం మంగళవారంను ఆమోదించింది. ఈ విషయాన్ని ఇండస్ట్రియల్ పాలసీ, విదేశీ పెట్టుబడుల ఫెసిటిటేషన్ పోర్టల్ విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. ఒప్పో కోసం సింగిల్-బ్రాండ్ రిటైల్ ట్రేడింగ్ మొత్తానికి ఆమోదం తెలిపినట్లు ప్రకటించింది.
ప్రపంచంలోనే నెంబర్ 2 స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో...క్లియరెన్సును పొందిన మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ గా ఒప్పో సత్తా చాటింది. ఇప్పుడు కంపెనీ ఆఫ్ లైన్ మార్కెట్లో అమ్మకాలు విస్తరిస్తున్నాయి. రాబోయే రోజుల్లో పాన్ ఇండియాలో న్యూ స్టోర్స్ ఏర్పాటు కానున్నాయి. ఇండియాలో ఒప్పో సొంత స్టోర్లను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ఉంది. ఈ నిర్ణయాన్ని ఆపిల్ వంటి బ్రాండ్లు స్వాగతిస్తున్నాయి.అయితే షియోమీ మరియు వివో కూడా ఈ ఆటలో పోటీపడనున్నాయి.
భారత ప్రభుత్వం నిబంధనలకు కట్టుబడి లోకల్ సోర్సింగుకే అధిక ప్రాధన్యత ఇవ్వనున్నారు. ఇండియాలో ఒకే బ్రాండ్ రిటైల్ మార్గం ద్వారా విదేశీ కంపెనీలు తమ ప్రొడక్టులను నేరుగా విక్రయించడానికి ప్రభుత్వం అనుమతించినప్పటికీ...కంపెనీలు స్థానికంగా 30శాతం ప్రొడక్ట్ చేసి ఉండాలనే నిబంధన ఉంది.
గత ఏడాది స్థానిక సోర్సింగ్ నుంచి విదేశీ వ్యాపారులకు మూడు సంవత్సరాలు మినహాయింపు ఇచ్చారు. ఈ మార్గదర్శకాలను పాక్షికంగా సడలించారు. మరిన్నివిదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కానీ ఈ మినహాంపుపై ఆపిల్ కంపెనీ ఇచ్చిన అభ్యర్థను ప్రభుత్వం తిరస్కరించింది.
ఇండియాలో ఒప్పో ఒక అసెంబ్లింగ్ యూనిట్ గా ఉంది. కానీ స్థానికంగా ఒప్పోకు సంబంధించి ఎలాంటి సోర్స్ లేదు. బిజినెస్ స్టాండర్డ్ ప్రకారం, ఒప్పో అసెంబ్లీ యూనిట్ కెపాసిటి పెంచడానికి ఒక ప్లాన్తోపాటు మొబైల్ తయారీ యూనిట్ ఏర్పాటు కూడా చేయనుంది. ఇండియాలో ఇతర మార్కెట్లలో ఫోన్లను విక్రయించాలన్న లక్ష్యంతో ఒప్పో ముందుకు అడుగులు వేస్తోంది.
సెల్ఫీ-సెంట్రిక్ స్మార్ట్‌ఫోన్లకు ఒప్పో పాపులర్ ఫోన్ అని చెప్పొచ్చు. భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 8 శాతం వాటాను కలిగి ఉంది. అయితే ఇండియాలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ అనేది చాలా పోటీని ఎదుర్కొంటుంది. అయితే భవిష్యత్తులో ఒప్పో కంపెనీతోపాటు, చైనీస్ యాజమాన్యం రిటైల్ దుకాణాలు, హ్యాండ్సెట్ తయారీదారు కంపెనీలను ఏర్పాటు చేసుకోవడం అనేది బెట్టర్ ఆప్షన్గా చెప్పొచ్చు.


Click it and Unblock the Notifications








