ఈ సెప్టంబర్‌లో మరో షాకింగ్ న్యూస్!

టెక్ ప్రపంచానికి ఈ సెప్టంబర్ మరపురానిది. నోకియా, మోటరోలా, ఆపిల్ వంటి దిగ్గజ సంస్థలు తమ తమ కొత్త ఉత్పత్తులను ఈ నెలలోనే ఆవిష్కరించాయి. తాజాగా ఈ జాబితాలోకి ఎల్‌జీ వచ్చి చేరింది. ఈ కొరియన్ టెక్ దిగ్గజం ప్రముఖ చిప్ మేకర్ క్వాల్క్ మ్‌తో జతకట్టి సెప్టంబర్ 19న న్యూయార్క్‌లో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. అయితే, నిర్వహించబోయే కార్యక్రమానికి సంబంధించి పూర్వాపరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది. ఈ అంశానికి సంబంధించి వ్యక్తమవుతున్న పుకార్ల మేరకు ఎల్‌జీ సెప్టంబర్ 19న నిర్వహించబోయే కార్యక్రమంలో తరువాతి తరం స్మార్ట్‌ఫోన్ ‘ఆప్టిమస్ జీ’ని విడుదల చేసే అవకాశముందని విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. గత కొంత కాలంగా ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లను ఎల్‌జీ కొద్దికొద్దిగా లీక్ చేస్తుండటంతో ఈ వాదనలకు మరింత బలం చేకూరింది.
ఎల్‌జీ ఆప్టిమస్ జీ ఫీచర్లు(అంచనా):
4.7 అంగుళాల ఐపీఎస్ ట్రూ హైడెఫినిషన్ డిస్‌ప్లే(రిసల్యూషన్ సామర్ధ్యం 1280 x 780పిక్సల్స్),
2జీబి ర్యామ్,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.5గిగాహెర్జ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రో ప్రాసెసర్,
ఎల్‌టీఈ కనెక్టువిటీ,
ఆండ్రాయిడ్ 4.0.4 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,
ఆప్టిమస్ యూజర్ ఇంటర్‌ఫేస్ 3.0.


Click it and Unblock the Notifications