ఒరాకిల్ కంపెనీ ప్రెసిడెంట్‌గా భారతీయుడు

Posted By:

ప్రముఖ అంతర్జాతీయ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఒరాకిల్ కొత్త అధ్యక్షునిగా థామస్ కురియన్ (48) నియమితులయ్యారు. కేరళకు చెందిన థామస్ కురియన్‌ను ఒరాకిల్ కంపెనీ సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ విభాగానికి ప్రెసిడెంట్‌గా నియమిస్తూ ఆ సంస్త చైర్మన్ లారీ ఎల్లీసన్ ఉత్తర్వులు జారీ చేసారు.

ఒరాకిల్ కంపెనీ ప్రెసిడెంట్‌గా భారతీయుడు

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

కురియన్ 1996లో నుంచి ఆ కంపెనీలో ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ వైస్‌ప్రెసిడెంట్‌గా విధులు ప్రారంభించారు. 2009లో కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా కురియన్ బాధ్యతలు తీసుకున్న తరువాత సాఫ్ట్ వేర్ విభాగపు వార్షిక అమ్మకాలు 18.9 బిలియన్ డాలర్ల నుంచి 29.2 బిలియన్ డాలర్లకు ఎగబాకాయి.

కురియన్ కుటుంబం కొట్టాయం జిల్లా పాంపడికి చెందనది కాగా ఆయన విద్యాభ్యాసం బెంగళూరు ఆపై అమెరికాలో సాగింది. స్టాన్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ విద్యను పూర్తి చేసిన కురియన్ పలు కంపెనీల బోర్డుల్లో సలహాదారుగా సేవలందించారు.English summary
Oracle names Thomas Kurian president. Read more in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting