3,500 మందికి కొత్త ఉద్యోగాలు: ఒరాకిల్ ఇండియా

Posted By: Staff

3,500 మందికి కొత్త ఉద్యోగాలు: ఒరాకిల్ ఇండియా

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది మే కల్లా భారత్‌లో 3,500 మందికి కొత్తగా ఉద్యోగాలివ్వనున్నట్లు సాఫ్ట్‌వేర్ దిగ్గజం, ఒరాకిల్ కార్పొ గురువారం తెలిపింది. దేశీయ, గ్లోబల్ క్లయింట్లకు సేవలందించేందుకు సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, మిడిల్‌వేర్, అప్లికేషన్స్ వంటి వ్యాపారాల్లో ఈ ఉద్యోగాలివ్వనున్నట్లు పేర్కొంది. ట్విట్టర్, ఫేస్‌బుక్, లింక్‌ఇడిన్, యూట్యూబ్, ఒరాకిల్ హెచ్‌ఆర్ బ్లాగ్‌ల ద్వారా ఈ ఉద్యోగ నియామకాలకు ప్రచారం కల్పిస్తామని వివరించింది. ఒరాకిల్‌కు హైదరాబాద్, బెంగళూరుల్లో డెవలప్‌మెంట్ సెంటర్లున్నాయి. ప్రస్తుతం భారత్‌లో ఈ కంపెనీ ఉద్యోగుల సంఖ్య 21, 000.

కొత్త ఉద్యోగులను పనిలోకి తీసుకొవడం అనేది కంపెనీ చర్యలలో ఒక భాగంగా పేర్కోన్నారు. ఆసియా ఫసిఫిక్ రీజియన్ మొత్తానికి కలిపి త్వరలో రిక్యూర్ మెండ్ డ్రైవ్‌ని పెట్టనున్నట్లు తెలిపారు. ఆసియా రీజియన్‌లో ఉన్న బిజినెస్ అభివృద్దికి అదనంగా మ్యాన్ పవర్ అవసరం అవడంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నామని ఒరాకిల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ మాధూర్ స్పష్టం చేశారు. బెంగుళూరులో ఉన్న డెవలప్ మెంట్ సెంటర్లో కొర్ అప్లికేషన్ టూల్స్‌, సర్వర్, ఫ్లాట్ ఫామ్ టెక్నాలజీలను డెవలప్ చేస్తుండగా, హైదరాబాద్ సెంటర్లో ఈ-బిజినెస్ అప్లికేషన్స్‌ని రూపొందిస్తున్నామన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot