ఆస్కార్ వోటింగ్‌కి ఎలక్ట్రానిక్ పరికరాలు..!

Posted By: Super

ఆస్కార్ వోటింగ్‌కి ఎలక్ట్రానిక్ పరికరాలు..!

 

ఆస్కార్ అవార్డ్స్‌ని అందించే 'ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్' బుధవారం మరో కంపెనీ భాగస్వామ్యంతో వచ్చే సంవత్సరం నిర్వహించనున్న 85వ అకాడమీ అవార్డుల కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్స్‌ని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకోని ది మోషన్ పిక్చర్ అకాడమీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్స్‌ని రూపొందించేందుకు గాను 'ఎవిరివన్ కౌంట్స్ లిమిటెడ్' అనేకంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది.

ప్రస్తుతం జరుగుతున్న ఆస్కార్ ఓటింగ్ పేపర్ బ్యాలెట్స్ లేదా ఈమెయిల్స్ ద్వారా జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే. ఈ విషయంపై అకాడమీ ఛీప్ ఆపరేటింగ్ ఆఫీసర్ 'రిక్ రాబర్ట్సన్' మాట్లాడుతూ అకాడమీ వారు తీసుకున్న మొదటి స్టెప్ ఈ 'ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్'. దీని ద్వారా సురక్షితమైన, నమ్మకమైన ఓటింగ్‌ను ప్రజలు ఆశించవచ్చు. ఇక ఈ సంవత్సరం జరుగుతున్న 84వ అకాడమీ అవార్డ్స్ ఫిబ్రవరి 26 నుండి ప్రారంభం కానున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot