చాట్ సర్వీస్ ‘గుగూల్ టాక్’ ఆగిపోయింది?

అవును ప్రముఖ ఛాటింగ్ సర్వీస్ గుగూల్ టాక్(Google Talk) ఐదు గంటల పాటు ప్రధాన అంతరాయాన్ని ఎదుర్కొంది. గురువారం సాయంత్రం 4:10 నిమిషాలకు ఏర్పడిన అంతరాయం సుధీర్ఘంగా రాత్రి 8:55 వరకు కొనసాగింది. అంతరాయం తరువాత సర్వీస్ కార్యకలపాలు పున:ప్రారంభమయ్యాయి. సమస్యకు గల కారణాలను గుగూల్ ప్రకటించలేదు. అంతరాయం నేపధ్యంలో వేలాదిమంది మంది యూజర్లు ఆసౌకర్యానికి గురయ్యారు.
గుగూల్ సెర్చ్‌లో.. క్యాలిక్యులేషన్ టూల్!
నెటిజనులకు గుగూల్ సెర్చ్ ఒక వరం. ఈ సెర్చ్‌ఇంజన్ సౌలభ్యతతో కావల్సిన వెబ్‌పేజీలను శోధించటంతో పాటు అనేక రకాలైన సమాచారాన్ని రాబట్టగలుగుతున్నాం. తాజాగా గుగూల్ 34బటన్లతో కూడిన వాస్తవిక శాస్త్రీయ క్యాలిక్యులేషన్ టూల్‌ను ‘గుగూల్ సెర్చ్’లో పొందుపరిచింది. ఈ ఫీచర్ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంది. ఈ టూల్‌ను ఉపయోగించుకోవాలనుకునే వారు సెర్చ్‌బాక్స్‌లో క్యాలిక్యులేటర్ (calculator) అని టైప్ చేస్తే చాలు. 34బటన్లతో కూడి క్యాలుకులేషన్ టూల్ మీ వైబ్‌పేజీ పై ప్రత్యక్షమవుతుంది. ఈ గణన యంత్రం ప్రత్యేకతను పరిశీలిస్తే సాధారణ లెక్కలతో పాటు సైన్, కొసైన్, స్పర్శరేఖ, సంవర్గమానం, పై, పవర్, స్క్వేర్ రూట్, సహజ సంవర్గమానం వంటి కష్టతరమైన గణిత ఫంక్షన్లను సమర్థవంతంగా లెక్కగడుతుంది.


Click it and Unblock the Notifications








