టెస్టింగ్ టైమ్‌లోనే రికార్డులు నమోదు చేస్తున్న గూగుల్ ప్లస్

Posted By: Staff

10 million people have joined Google+

ప్రపంచంలో అత్యంత పవర్‌పుల్ సెర్చ్ ఇంజన్ గెయింట్ అయిన గూగుల్ తన త్రైమాసిక లాభాలను ప్రకటించిన విషయం తెలిసిందే. గూగుల్ ప్రతి సంవత్సరం తన లాభాలను 32 శాతం పెంచుకుంటుందని, అంటే 9 బిలియన్ డాలర్ల లాభాన్ని పోందినట్లు వెల్లిడించారు. ఈ సందర్బంలో సిఈవో మాట్లాడుతూ గూగుల్ ప్లస్ అభివృద్ది రేటు ఊహించిన దానికంటే కూడా చాలా ఎక్కువగా ఉందని అన్నారు. గూగుల్ ప్లస్ పేజి వస్తుందని ప్రకటించిన రెండు వారాలలోపే సుమారుగా 10 మిలియన్ జనాభా గూగుల్ ప్లస్‌లో చేరడం జరిగిందని తెలియజేశారు.

గూగుల్ కొత్తగా ప్రవేశపెట్టనున్న ఈ సోషల్ నెట్‌వర్క్ వెబ్‌సైట్ లో రోజుకి సుమారుగా 1బిలియన్ ఐటమ్స్ అందులో ఉన్న కస్టమర్స్ షేర్ చేసుకుంటున్నారని తెలియజేశారు. గూగుల్ ప్లస్ పేజి ఇలా అనతి కాలంలో అభివృధ్ది చెందడం పట్ల చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఇక గూగుల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్, గూగుల్ బ్రౌజర్ క్రోమ్ పట్ల కూడా కస్టమర్స్ చూపిస్తున్నటువంటి ఆదరాభిమానులు తమకు చాలా సంతోషాన్ని కలగచేసేయాని అన్నారు. ప్రపంచం మొత్తం మీద 160 మిలియన్ యూజర్లు గూగుల్ క్రోమ్‌ని వాడుతుంటే ప్రతి రోజు సుమారుగా 550,000 ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్ యాక్టివేట్ అవుతున్నాయని అన్నారు.

అంతేకాకుండా గూగుల్ అందించే సర్వీసులు కస్టమర్స్ రోజుకీ రెండు సార్లు వాడే విధంగా ఉండాలనేది మా అభిప్రాయం అని అన్నారు. రోజుకి రెండు సార్లు వాడే సర్వీసు అంటే మన టూత్ బ్రెష్ లాగా అన్నమాట. జూన్ చివరి వారంలో గూగుల్ సోషల్ నెట్ వర్క్ వెబ్‌సైట్‌ గూగుల్ ప్లస్‌ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ కూడా మీరు గూగుల్ ప్లస్‌ని తెలుసుకోనట్లైతే దాని గురించిన సమాచారం తెలుసుకోండి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting