మీ ప్రమేయం లేకుండానే మీ డేటా హ్యాక్ అవుతోంది

|

ప్రపంచవ్యాప్తంగా ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్, సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ లకు యూజర్ల ప్రైవసీ డేటా సవాల్ గా మారుతోంది. డేటా కలెక్షన్ పాలసీలను మరింత మెరుగుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ ప్రైవసీ అడ్వకేట్లు గూగుల్, ఫేస్ బుక్ లపై ఒత్తిడి తీసుకుస్తున్నారు. ఇప్పటికే యూజర్ల ప్రైవసీ డేటా బహిర్గతం కావడం పట్ల ఫేస్ బుక్ భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది.

Over 1k Android apps gain your data even if denied permission

గూగుల్ కూడా ఫేస్ బుక్ తరహాలో తమ యూజర్ల డేటా ప్రైవసీకి సంబంధించి నష్ట నివారణ చర్యలు చేపట్టింది. యూజర్ల డేటాను తమ సర్వర్లలో స్టోర్ చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ రెండు ఆన్ లైన్ దిగ్గజాలు యూజర్ల ప్రైవసీపై స్పెషల్ ఫోకస్ పెట్టాయి. ఎంతలా చర్యలు తీసుకున్నా యూజర్ ప్రైవసీ డేటాను దొంగిలించడం ఆగడం లేదు.

నివేదిక వెలుగులోకి

నివేదిక వెలుగులోకి

ఈ మధ్య డేంజరస్ యాప్స్ గురించి ఓ రిపోర్టు వెలుగులోకి వచ్చింది. గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో లభ్యమయ్యే కొన్ని ఫేక్ యాప్స్ యూజర్ పర్మిషన్ ఇవ్వకపోయినా ఆ యాప్స్ ద్వారా పర్సనల్ డేటా తస్కరిస్తున్నట్టుగా ఈ నివేదిక హెచ్చరిస్తోంది. ఐసీఎస్ఐలోని డైరెక్టర్ ఆఫ్ యూజబల్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ రీసెర్చ్ సెర్జే ఇజెల్మాన్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ లోని ప్రైవసీ కాన్ఫిరెన్స్ లో ఈ అధ్యయాన్ని ప్రదర్శించారు. దీనికి సంబంధించి సెప్టెంబర్ 2018లో గూగుల్, FTCలు తమ పరిశోధకులు హెచ్చరించినట్టు ఆయన గుర్తు చేశారు.

 325 ఆండ్రాయిడ్ యాప్స్

325 ఆండ్రాయిడ్ యాప్స్

వెయ్యికి పైగా ఆండ్రాయిడ్ యాప్స్.. యూజర్ల ప్రైవసీ డేటాను కొట్టేసినట్టు అధ్యయనంలో తేలింది. దాదాపు 1,325 ఆండ్రాయిడ్ యాప్స్ యూజర్ పర్మిషన్ ఇవ్వకపోయినా వారి డివైజ్ లోని డేటాను సేకరించినట్టు గుర్తించింది. అమెరికాలోని అంతర్జాతీయ కంప్యూటర్ సైన్స్ ఇన్సిస్ట్యూట్ (ICSI) పరిశోధక బృందం తమ అధ్యయనంలో ఈ విషయాన్ని గుర్తించినట్టు న్యూస్ పోర్టల్ నివేదించింది.

Shutterfly
 

Shutterfly

డేంజరస్ యాప్స్ లో ఒక యాప్ పేరు Shutterfly ను వారు రివీల్ చేశారు. ఈ యాప్ లో ఫొటోలను ఎడిట్ చేసుకోవచ్చు. చాలామంది యూజర్లు తెలియక తమ ఫొటోలను ఈ యాప్ లో ఎడిట్ చేస్తున్నారు. జీపీఎస్ ద్వారా యూజర్ల ఫోటోల నుంచి డేటాను షేర్ చేస్తూ తమ సొంత సర్వర్లలో స్టోర్ చేస్తున్నట్టు గుర్తించారు. షట్టర్ ఫ్లై ఒక ప్రకటనలో ఫొటో సర్వీసు యాప్స్ చాలా ఉన్నాయని, యూజర్ల డేటాను యూజర్ ఎక్స్ పీరియన్స్ కోసం మాత్రమే డేటాను వినియోగిస్తుంది తప్ప దుర్వినియోగం చేయడం లేదని సమర్థించుకుంది.

500 మిలియన్లకు పైగా డివైజ్ ల్లో

500 మిలియన్లకు పైగా డివైజ్ ల్లో

ప్రైవసీ పాలసీకి అనుగుణంగా ఆండ్రాయిడ్ డెవలపర్ అగ్రిమెంట్ నిబంధనల ప్రకారమే పనిచేస్తున్నామని షట్టర్ ఫ్లై యాప్ స్పష్టం చేసింది. FTC వెబ్ సైట్లో ఈ అధ్యయనాన్ని పబ్లిష్ చేయగా.. 153 యాప్స్ లో శాంసంగ్ హెల్త్, బ్రౌజర్ యాప్స్ ఉన్నట్టు గుర్తించామని, అందులో 500 మిలియన్లకు పైగా డివైజ్ ల్లో ఈ యాప్స్ ఇన్ స్టాల్ చేసినట్టు పరిశోధనలో వెల్లడైంది. రిపోర్టు ప్రకారం.. ఈ అధ్యయానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఆగస్టులో యూజనెక్స్ సెక్యూరిటీ కాన్ఫిరెన్స్ లో వెల్లడించనున్నట్టు సెర్జే ఇజెల్మాన్ తెలిపారు.

Best Mobiles in India

English summary
Over 1k Android apps gain your data even if denied permission

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X