24 గంటల్లో 20లక్షల బుకింగ్‌లు..ఐఫోన్5 రికార్డ్!

Posted By: Staff

24 గంటల్లో 20లక్షల బుకింగ్‌లు..ఐఫోన్5 రికార్డ్!

 

 

ఐఫోన్5 ముందస్తు బుకింగ్‌లకు సంబంధించి ఆరంభమైన 24 గంటల్లోనే 2 మిలియన్ యూనిట్‌లకు ప్రీఆర్డర్ లభించినట్లు ఆపిల్ వర్గాలు సోమవారం ప్రకటించాయి. ఐఫోన్5కు డిమాండ్ అధికంగా ఉన్న నేపధ్యంలో ముందస్తుగా బుక్ చేసుకున్నవారిలో అత్యధిక శాతం మందికి సెప్టంబర్ 21న డివైజ్ డెలివరీ చేయగలమని మిగిలిన వారికి అక్టోబర్ నాటికి అందించగలమని ఆపిల్ వర్గాలు వెల్లడించాయి. ఐఫోన్5 ముందు రోజు బుకింగ్‌లు, ఐఫోన్4ఎస్ మొదటి రోజు బుకింగ్‌లు (1 మిలియన్) రికార్డును అధిగమించటం పట్ల  ఆపిల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఫిలిప్ స్కిల్లర్ హర్షం వ్యక్తం చేశారు.

సెప్టంబర్ 21న విడుదల కాబోతున్న ఆపిల్ ఐఫోన్ 5 అమ్మకాల పై దిమ్మతిరిగే అంచనాలు చెక్కర్లు కొడుతున్నాయి.  ఐఫోన్ 5 మొదటి నెలలో కోటి యూనిట్లు అమ్ముడుపోవడం ఖాయమని ప్రముఖ రిసెర్చ్ సంస్థ ఆర్‌బీసీ క్యాపిటల్ మార్కెట్స్ ఓ నివేదికలో పేర్కొంది. ఈ నెలాఖరు నాటికి ఐఫోన్5 ప్రపంచవ్యాప్తంగా 31 దేశాల్లో లభ్యం కానుంది. ఐఫోన్5కు మునుపటి వర్షన్ అయిన ఐఫోన్ 4ఎస్ విడుదలైన వారం రోజల్లో 7 మార్కెట్లకు గాను 4 మిలియన్ అమ్మకాల మార్క్‌ను నమోదు చేసిందని ఆర్‌బీసీ క్యాపిటల్ మార్కెట్ ఈ సందర్భంగా గుర్తుచేసింది.

ప్రస్తుత మార్కెట్లో లభ్యమవుతున్న ఆపిల్ ఐఫోన్ పాత వర్షన్‌లైన ఐఫోన్4 ఇంకా ఐఫోన్ 4ఎస్‌లు అమ్మకాలను పరిశీలిస్తే.. ఈ ఏడాది రెండో త్రైమాసికానికి గాను 26 మిలియన్ యూనిట్లుగా ఉన్నాయి. ఈ ఏడాది చివరి త్రైమాసికం నాటికి 100 దేశాల్లో ఐఫోన్ 5 లభ్యంకానుండటంతో అమ్మకాలు మరింత ఆశాజనకంగా ఉండొచ్చని ఆపిల్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot