Home
News

‘సెల్’గోల.. హద్దులు మీరుతున్న యువత?

By Prashanth
Cellphone Distrubing Public


కమ్యూనికేషన్ అవసరాల కోసం సాంకేతికతను వినియోగించుకుంటున్న పలువురు యువత ప్రాధమిక విలువలను మరచి విచక్షణ లేకుండా వ్యవహరిస్తున్నారు. మితిమీరిన సెల్ ఫోన్ వినియోగం ప్రత్యక్షంగా పలు సమస్యలకు కారణమవుతోంది. కమ్యూనికేషన్ వ్యవస్థను మరింత చేరువ చేసిన ఈ సమాచార సాధనం నైతిక విలువలను విస్మరింపచేస్తుంది!. బస్సుల్లో, రైళ్లలో, రోడ్లపై.. ఇలా ఎక్కడ పడితే అక్కడ పక్కనున్న వారి ఇబ్బందుల్ని పట్టించుకోకుండా కొందరు సెల్‌ఫోన్‌లో అదే పనిగా మాట్లాడేస్తుంటారు.

ఆఫీసుల్లో, సమావేశాల్లో, బహిరంగస్థలాల్లో ఇతరులు విసుక్కొనేలా కొందరు సెల్‌లో బిగ్గరగా మాట్లాడుతుంటారు. పక్కవాళ్లు ఏమనుకుంటారన్న ఇంగితం లేకుండా పెద్ద సౌండ్‌తో కొందరు మొబైల్‌లో పాటలు వింటుంటారు. పాటలు వినాలన్న ఆసక్తి ఉన్న వారు ‘ఇయర్ ఫోన్లు’ పెట్టుకుంటే ఇతరులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.

ప్రయాణాల్లో, బహిరంగ స్థలాల్లో మొబైల్‌ను సైలెంట్ మోడ్‌లో లేదా వైబ్రేషన్‌లో గానీ ఉంచుకోవడం ఉత్తమం. కొందరు అబ్బాయిలు, అమ్మాయిలైతే బస్సు ఎక్కిన దగ్గర నుంచి దిగేవరకూ అలా మొబైల్‌లో మాట్లాడుతునే ఉంటారు. బస్సు దిగాక రోడ్డు దాటుతున్నపుడు కూడా చెవికి ‘సెల్’ అతుక్కుపోవాల్సిందే.

కొందరు డ్రైవ్ చేస్తూ సెల్ మాట్లాడేస్తుంటారు. ఇలాంటి వారిని చూసి ఏ ప్రమాదం జరుగుతుందోనని మిగతా వారు ఆందోళన పడుతుంటారు. ప్రయాణంలో ఉన్నపుడు ఫోన్ రింగ్ అయితే సాధ్యమైన మేరకు కాల్ కట్ చేయాలి. ఆఫీసుల్లో ఉన్నపుడు అదే పనిగా మొబైల్‌లో మాట్లాడుతుంటే పని మీద శ్రద్ధ తగ్గే ప్రమాదం ఉంది. సెల్‌ఫోన్లను అదేపనిగా వినియోగిస్తే రేడియేషన్ ప్రభావంతో శారీరకంగా అనేక సమస్యలు తప్పవని వైద్యనిపుణులు హెచ్చరిస్తునే ఉన్నారు.

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X