హైదరాబాద్ సాగర్ రోడ్డు యాక్సిడెంట్‌లో సాప్ట్‌వేర్ ఇంజనీర్ మృతి

Posted By: Staff

హైదరాబాద్ సాగర్ రోడ్డు యాక్సిడెంట్‌లో సాప్ట్‌వేర్ ఇంజనీర్ మృతి

హైదరాబాద్: హైదరాబాద్‌కు సెలవులలో ఎంజాయ్ చేద్దామని ఆస్ట్రేలియా నుండి వచ్చిన 25 సంవత్సరాల సాప్ట్‌వేర్ ఇంజనీర్ సోమవారం రాత్రి మన్నేగూడసమీపంలో సాగర్ రోడ్డు వద్ద డివైడర్ ఢీకొని మరణించాడు. వనస్దలిపురం పోలీసుల ప్రకారం రవికిరణ్, పి ధీరజ్ రెడ్డి ఇద్దరూ పల్సర్ బండి(AP 29M 9938) మీద హైదరాబద్ నుండి ఇబ్రహిం పట్నం వెళుతుండగా ఈ సంఘటన సంభవించింది.

అర్దరాత్రి 12.30 నిమిషాలకు ఇద్దరూ బండి మీద వేగంతో మన్నేగూడ అవుటర్ రింగ్ రోడ్డు(సాగర్ రోడ్డు) వద్ద ఆకస్మాత్తుగా డివైడర్‌ని ఢీకోనడంతో తలకు ఇద్దరికి పెద్ద గాయాలు అవ్వడంతో ఇద్దరు మరణించడం జరిగిందని వనస్దలిపురం ఇన్పక్టర్ బి రవీందర్ రెడ్డి తెలిపారు. రవికిరణ్ ఆలకపురి కాలనీ‌లో నివసిస్తున్నాడు. ధీరజ్ రెడ్డి వివేకానంద కాలనీ లో నివసిస్తున్నాడు. ఇతను ఒక ప్రయివేటు ఉద్యోగి. ఇది మాత్రమే కాదు పల్సర్ బండి రవికిరణ్ నడుపుతుండగా అతని వెనుకవైపు ధీరజ్ రెడ్డి కూర్చోని ఉన్నాడు. ఈ సంఘటనతో వారివురి కుటుంబాలలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting