పాక్‌లో సెల్‌ఫోన్స్ బంద్?

Posted By: Staff

పాక్‌లో సెల్‌ఫోన్స్ బంద్?

ఇస్లామాబాద్: ఉగ్రవాదుల దాడుల భయం నేపధ్యంలో ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికులను పరిగణలోకి తీసుకున్న పాకిస్థాన్ ప్రభుత్వం రంజాన్‌కు ముందు రోజైన ఆదివారం నాలుగు ప్రధాన నగరాల్లో సెల్ ఫోన్ సేవలను నిలిపివేయాలని స్థానిక టెలికాం ఆపరేటర్లకు ఆదేశాలు జారీ చేసింది. దింతో ఆయా ప్రాంతాల్లోని సెల్‌ఫోన్‌లు మూగబోయాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రంజాన్ శుభాకాంక్షలు చెప్పుకుందామని ఆశగా సెల్‌ఫోన్లు చూసుకున్న వారికి నిరుత్సాహాన్ని మిగిల్చింది.

లాహోర్, ముల్తాన్, కరాచీ, క్వెట్టా నగర వాసులకు ఈ పరిస్థితి తలెత్తింది. మళ్లీ సోమవారం ఉదయాన్నే సెల్ ఫోన్ లు పనిచేసినప్పటికి, ఉదయం 8గంటల నుంచి 10గంటల వరకు సిగ్నల్స్ కట్ అయ్యాయి. స్థానికుల నిరసనలతో మళ్లీ ఉదయం పది తర్వాత సిగ్నళ్లు అందుబాటులోకి వచ్చాయనిలాహోర్ నగరానికి చెందిన కొంత మంది తెలిపారు. అయితే, సెల్‌ఫోన్లను ఉపయోగించుకుని బాంబు దాడులకు తీవ్రవాద మూకలు ప్రయత్నిస్తాయన్న.. ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు ఈ చర్య తీసుకున్నట్లు పాకిస్థాన్ హోంమంత్రి రెహ్మాన్ మాలిక్ చెప్పారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot