బికారి పాకిస్తాన్‌కు 3 టమోటాలు పంపండి, ఆడుకుంటున్న నెటిజన్లు

పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌పై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఉగ్రదాడి ద్వారా 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మరణానికి కారణమైన పాకిస్తాన్‌కు తగిన బుద్ది చెప్పేందుకు భార

|

పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌పై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఉగ్రదాడి ద్వారా 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మరణానికి కారణమైన పాకిస్తాన్‌కు తగిన బుద్ది చెప్పేందుకు భారత్‌ ఇప్పటికే పలు చర్యలు ప్రారంభించింది.ఇందులో భాగంగా పాకిస్తాన్‌ని ఆర్థికంగా దెబ్బ తీయడానికి భారత్ నిర్ణయించుకుంది. మొదటగా ఎగుమతల సుంకం భారీగా పెంచేసి తీవ్ర కష్టాల్లోకి నెట్టేసింది. ఇదే క్రమంలో భారత ప్రభుత్వానికి అండగా వ్యాపారులు సైతం ఇదే బాటలో నడుస్తున్నారు. ఇక్కడి నుంచి పాకిస్థాన్‌కు వెళ్లాల్సిన టమోటాల ఎగుమతులను నిలిపివేశారు.నష్టం వచ్చిన పర్వాలేదు.. ఇక్కడి ప్రజలకే ఉచితంగా పంపిణీ చేస్తాం.. కానీ పాకిస్తాన్‌కు మాత్రం పంపేది లేదని స్పష్టం చేశారు. వ్యాపారులు తీసుకున్న నిర్ణయం తర్వాత భారత్ పాక్ బోర్డర్‌లో పెద్ద ఎత్తున టమాటా లారీలు నిలిచిపోయాయి.

బికారి పాకిస్తాన్‌కు 3 టమోటాలు పంపండి, ఆడుకుంటున్న నెటిజన్లు

ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌కు టమాటాలు ఎగుమతి చేయని భారత్ మీద ఏకంగా ఆటం బాంబ్ వేయాలంటూ ఓ పాకిస్తాన్‌ టీవీ జర్నలిస్ట్ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది.

పాకిస్తాన్‌ సీ42 అనే చానల్‌కు చెందిన జర్నలిస్ట్‌

పాకిస్తాన్‌ సీ42 అనే చానల్‌కు చెందిన జర్నలిస్ట్‌

ఈ వీడియోలో పాకిస్తాన్‌ సీ42 అనే చానల్‌కు చెందిన జర్నలిస్ట్‌ ఒకరు మాట్లాడుతూ.. ‘మా దేశానికి ఇండియా టమాటాలు పంపించకపోవడం నీచమైన నిర్ణయం. ఆ టమాటాలను మోదీ, రాహుల్ గాంధీ ముఖం మీద కొడతాం. టమాటాలను ఆపి మనల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇందుకు ఆటంబాంబుతో సమాధానం ఇవ్వాల్సిన సమయం వచ్చింది' అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

వీడియో వైరల్

వీడియో వైరల్

టమోటాలు లేకుండా పాకిస్థాన్ బతకలేదనుకుంటోందని ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. ఈ వీడియో వైరల్ అయింది. సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోన్న ఈ వీడియోను నెటిజన్లు తీవ్రంగా ట్రోల్‌ చేస్తున్నారు. నెటిజన్లు అతనిపై విపరీతమైన జోకులు వేస్తూ నవ్వుకుంటున్నారు

బికారి పాకిస్తాన్‌కు 3కిలోల టమాటాలు

బికారి పాకిస్తాన్‌కు 3కిలోల టమాటాలు

మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందించాడంటూ కొందరు.. ‘భారత్‌ను ఆటం బాంబు నుంచి కాపాడేందుకు ఆ బికారి పాకిస్తాన్‌కు 3కిలోల టమాటాలు పంపించండిరా బాబూ' అని మరి కొందరు ట్వీట్ చేస్తున్నారు

పుల్వామా ఉగ్ర దాడి

పుల్వామా ఉగ్ర దాడి

పుల్వామా ఉగ్ర దాడి అనంతరం పాకిస్తాన్‌ మీద ఒత్తిడి పెంచే క్రమంలో భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాకిస్తాన్‌ నుంచి దిగుమతి అయ్యే వస్తువుల మీద ట్యాక్స్‌ను 200శాతానికి పెంచింది. దీంతో దిగుమతులు తగ్గిపోయాయి. మరోవైపు భారత రైతులు కూడా తమ ఉత్పత్తులను పాక్‌కు ఎగుమతి చేయకుడదని నిర్ణయం తీసుకున్నారు.

పాకిస్తాన్  ఉగ్రవాద శిబిరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్  మెరుపుదాడులు

పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మెరుపుదాడులు

ఇదిలా ఉండగా పుల్వామా ఉగ్రదాడి కి ప్రతీకారం గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్, పాకిస్తాన్ లోని టెర్రరిస్ట్ క్యాంపు ల పై  మెరుపుదాడులు చేసినట్టు సమాచారం

Best Mobiles in India

English summary
Pakistani Journo Threatens ‘Tamatar Ka Jawab Atom Bomb Se’, Indians On The Internet Blast Him

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X