పాన్ -ఆధార్ లింకింగ్ కొత్త డెడ్ లైన్ ? ఎప్పుడో తెలుసుకోండి.
అనుకున్నట్లుగానే మార్చి 31 ఆధార్ పాన్ లింక్ డెడ్‌లైన్ వెళ్ళిపోయింది కానీ ప్రజల కోరిక మీకు పాన్ ఆధార్ లింకింగ్ డెడ్ లైన్ ను ఇంకో ఆరు నెలలు పొడిగించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంటే సెప్టెంబ
అనుకున్నట్లుగానే మార్చి 31 ఆధార్ పాన్ లింక్ డెడ్‌లైన్ వెళ్ళిపోయింది కానీ ప్రజల కోరిక మేరకు, పాన్ ఆధార్ లింకింగ్ డెడ్ లైన్ ను ఇంకో ఆరు నెలలు పొడిగించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

అంటే సెప్టెంబర్ 30 ,2019 లోపు మీరు పాన్ ,ఆధార్ ను లింక్ చేయాల్సి ఉంటుంది.మరి ఈ గడువును వాడుకొని పాన్,ఆధార్ కార్డులను ఎలా లింక్ చేయాలో తెలుసుకోండి. ప్రాసెస్ ఎలాగో ఓ సారి చూద్దాం.

పాన్‌తో ఆధార్ ఎలా లింక్
గూగుల్ నుంచి incometaxindiaefiling.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
అందులో'Linking Aadhaar' అనే లింక్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే మరో పేజీ ఓపెన్ అవుతుంది.
మీ పేరు, పుట్టిన తేదీ లాంటి వివరాలు మీ ఆధార్ కార్డుపై ఉన్నట్టుగా ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.
'Link Aadhaar' పైన క్లిక్ చేస్తే మీ పాన్ కార్డుతో ఆధార్ నెంబర్ లింక్ అవుతుంది.

పాన్-ఆధార్ లింక్ చేశారో లేదో తెలుసుకోవడం ఎలా ?
గతంలో పాన్-ఆధార్ లింక్ చేశారో లేదో తెలుసుకోవాలనుకుంటే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. మీ దగ్గర మీ పర్మనెంట్ అకౌంట్ నెంబర్, ఆధార్ నెంబర్ ఉంటే చాలు. www.incometaxindiaefiling.gov.in ఈ లింక్ క్లిక్ చేస్తే మీకు పాన్-ఆధార్ లింక్ అయిందో లేదో తెలిపే పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీ పాన్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే స్టేటస్ తెలిసిపోతుంది. ఒకవేళ లింక్ చేయకపోతే వెంటనే లింక్ చేయండి.

ఎస్సెమ్మెస్ ద్వారా..
మీరు ఎస్సెమ్మెస్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే UIDPAN <12 digit Aadhaar number> <10 digit Permament Account Number> టైప్ చేసి 567678 or 56161కి ఎస్సెమ్మెస్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు.

తప్పులను సరిదిద్దుకోవడం ఎలా ?
అధికారిక వెబ్‌సైట్ https://www.tin-nsdl.com/index.html ఓపెన్ చేయండి.
అక్కడ కనిపించే Paperless PAN application ట్యాబ్ క్లిక్ చేయండి.
అప్లికేషన్ టైప్‌లో changes or correction in existing PAN సెలెక్ట్ చేయండి. కేటగిరీలో Individual క్లిక్ చేయండి.
ఆ తర్వాత మీ పేరు, తండ్రిపేరు, పుట్టిన తేదీ, ఇమెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్, పాన్ నెంబర్ ఎంటర్ చేయండి.
మీ ఆన్‌లైన్ అప్లికేషన్‌కు టోకెన్ నెంబర్ వస్తుంది.
టెంపరరీ టోకెన్ నెంబర్‌తో లాగిన్ చేసి మీ పూర్తి వివరాలను సరిగ్గా ఎంటర్ చేయండి.
ఆ తర్వాత అడ్రస్ ప్రూఫ్, ఐడీ ప్రూఫ్, పాత పాన్ కార్డ్ డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి.
ఆన్‌లైన్ ద్వారా పేమెంట్ పూర్తి చేయాలి.
పేమెంట్ చేసిన తర్వాత ఇ-సైన్ ప్రక్రియ పూర్తి చేయాలి.
ఇ-సైన్ పూర్తైన తర్వాత మీ పాన్ కరెక్షన్ దరఖాస్తు అప్‌లోడ్ అవుతుంది.


Click it and Unblock the Notifications