కొత్త 4K UHDటీవీలను ప్రారంభించిన పానాసోనిక్! ధర ఎక్కువే

|

పానాసోనిక్ భారతదేశంలో 14 కొత్త 4K అల్ట్రాHD టివిలను విడుదల చేసింది. ఇందులో 75-అంగుళాల 4K UHD టివి కూడా ఉంది. ఈ కొత్త పానాసోనిక్ 4K టీవీలు 50,400రూపాయల నుంచి 2,76,900రూపాయల వరకు లభిస్తాయి. సంస్థ యొక్క 4K టివి సిరీస్‌ను పానాసోనిక్ బ్రాండ్ షాపులు మరియు భారతదేశంలోని ఇతర ప్రముఖ అవుట్‌లెట్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.

 

కొత్త 4K UHDటీవీలను ప్రారంభించిన పానాసోనిక్! ధర ఎక్కువే

కొత్తగా ప్రారంభించిన 4K టివి శ్రేణి IPS ప్యానెల్, 4 K డిమ్మింగ్, డాల్బీ అట్మోస్ సౌండ్, గూగుల్ అసిస్టెంట్ / అలెక్సా సపోర్ట్ వంటి మరిన్ని ఫీచర్లను అందిస్తుంది. 75- అంగుళాల 4K అల్ట్రా హెచ్‌డి టివి గురించి మరింత తెలుసుకోవడానికి చదవండి.

 4K టీవీ ఫీచర్స్:

4K టీవీ ఫీచర్స్:

పానాసోనిక్ యొక్క తాజా 4K టీవీలు "జపనీస్ డిజైన్" తో పాటు "సూపర్ బ్రైట్" ఐపిఎస్ ప్యానెల్‌తో పాటు 3840 x 2160 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో వస్తాయి. పానాసోనిక్ 75- అంగుళాల టీవీ హెచ్‌డిఆర్ 10, హెచ్‌డిఆర్ 10+, డాల్బీ విజన్ మరియు హెక్సా క్రోమా డ్రైవ్ ప్రో ఫీచర్లకు మద్దతు ఇస్తుంది. ఇది వైడ్ కలర్ స్పెక్ట్రంతో జత చేసిన స్టూడియో కలర్ హెచ్‌సిఎక్స్ 2 ప్రాసెసర్‌తో ప్యాక్ చేయబడి ఉంటుంది. ఈ టీవీలో పైన రెండు 10W ఫైరింగ్ స్పీకర్లు ఉన్నాయి. ఇది మొత్తం 20W అవుట్పుట్ సౌండ్ ను అందిస్తుంది. 4K టీవీ డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్‌కు కూడా మద్దతు ఇస్తుంది.

కనెక్టవిటీలు:
 

కనెక్టవిటీలు:

పానాసోనిక్ యొక్క ఈ స్మార్ట్ టీవీ వాయిస్ ఆదేశాల ద్వారా ఆన్ చేయడం,ఆఫ్ చేయడం,వీడియోను పాస్ చేయడం మరియు ప్లే చేయడం వంటి నియంత్రణకు మద్దతు ఇస్తుంది.అంతే కాకుండా ఇది అలెక్సా మరియు గూగుల్ అసిస్టెంట్‌ వంటి వాటికి కూడా మద్దతు ఇస్తుంది. అంతేకాకుండా సంస్థ యొక్క బ్లూటూత్ ఆడియో లింక్ బ్లూటూత్ ద్వారా వైర్‌లెస్ ఆడియో స్పీకర్‌ను కనెక్ట్ చేయడానికి కూడా సహాయపడుతుంది. ఈ టీవీలో యుఎస్‌బి 3.0, 2.0 పోర్ట్‌లు, వై-ఫై, లాన్ పోర్ట్, కామన్ ఇంటర్‌ఫేస్, డిజిటల్ ఆడియో అవుట్‌పుట్ ఉన్నాయి. ఈ స్మార్ట్ టీవీలో ‘మై హోమ్ 3.0' ఫీచర్ కూడా ఉంది. ఇందులో మీరు అమెజాన్ ప్రైమ్, యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్ వంటివే కాకుండా మరిన్ని వీడియో స్ట్రీమింగ్ సేవలను కూడా యాక్సెస్ చేయవచ్చు.

ధరలు:

ధరలు:

పానాసోనిక్ ఇప్పుడు పానాసోనిక్ OLED TV శ్రేణిని కూడా అందిస్తుంది. ఇందులో 55-అంగుళాల FZ950 మరియు 65-అంగుళాల FZ1000 టీవీలు ఉన్నాయి. వీటి ధరలు వరుసగా 2, 99,900రూపాయలు మరియు 4, 49,900రూపాయలు.

పానాసోనిక్ ఇండియా బిజినెస్ హెడ్:

పానాసోనిక్ ఇండియా బిజినెస్ హెడ్:

టీవీ ప్రారంభోత్సవంలో పానాసోనిక్ ఇండియా బిజినెస్ హెడ్ శరత్ నాయర్ మాట్లాడుతూ 100 సంవత్సరాలకు పైగా వారసత్వం గల పానాసోనిక్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా వినియోగదారుల జీవితాలను సుసంపన్నం చేస్తోంది. ఇప్పుడు ఈ కొత్త శ్రేణి 4K టీవీల పరిచయం వినియోగదారులను పానాసోనిక్ వరల్డ్ ఆఫ్ టెక్నికల్ ఆధిపత్యంలో మునిగిపోయేలా ప్రేరేపించడానికి మరియు వారి యొక్క వీక్షణ అనుభవాన్ని పెంచడానికి ఒక అడుగు ముందుకు వేసింది. ఈ కొత్త సిరీస్ అధునాతన పిక్చర్ నాణ్యతను నిర్ధారించే అనేక ప్రీమియం లక్షణాలతో వస్తుంది. గత సంవత్సరం టీవీ విభాగంలో మొత్తం వృద్ధికి 4k సెగ్మెంట్ గణనీయంగా దోహదపడింది. అంతేకాకుండా ఇలాంటి పురోగతితో రాబోయే మూడేళ్లలో మార్కెట్ వాటాను గణనీయంగా పెంచాలని చూస్తున్నాము అని ప్రెస్ మీట్ లో తెలిపారు.

Most Read Articles
Best Mobiles in India

English summary
panasonic launches 14 new 4k ultra hd tvs in india

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X