10 నిమిషాల్లో ఎబోలా గుట్టు రట్టు

Posted By:

10 నిమిషాల్లో ఎబోలా గుట్టు రట్టు

ఎబోలో, డెంగ్యు, ఎల్లో ఫీవర్ వంటి ప్రాణాంతక వ్యాధులను కేవలం 10 నిమిషాల్లో కనుక్కోగలిగే సరికొత్త పేపర్ స్ట్రిప్‌ను మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటి) పరిశోధకులు వృద్థి చేసారు. ఇప్పటి వరకు ఎబోలా వ్యాధిని కొనుగొనేందుకు వ్యాధిగ్రస్తునికి సంబంధించి రక్త నమూనాలను ప్రయోగశాలలకు తరిలించి అడ్వాన్సుడ్ మెడికల్ టెక్నాలజీ సాయంతో వైరస్ ను నిర్థారించేవారు.

10 నిమిషాల్లో ఎబోలా గుట్టు రట్టు

ఎంఐటీ శాస్త్రవేత్తలు తాజాగా వృద్థి చేసిన ఈ పేపర్ స్ట్రిప్, లాటరల్ ఫ్లో టెక్నాలజీ పై పనిచేస్తుంది. ఈ టెక్నాలజీని ఇప్పటికే గర్భ పరీక్షలు, స్ట్రెప్ త్రోట్ ఇంకా ఇతర బాక్టీరియల్ అంటువ్యాధులను నిర్థారించేందుకు ఉపయోగిస్తున్నారు. ఈ పేపర్ స్ట్రిప్ ఎబోలా, డెంగ్యు, ఎల్లో ఫీవర్ వంటి ప్రాణాంతక వ్యాధులను గుర్తించేందుకు రెడ్, ఆరెండ్ ఇంకా గ్రీన్ సూక్ష్మకణాలను వ్యాధులను గుర్తించే ప్రతిరోధకాలకు (యాంటీబాడీస్‌కు) లింక్ చేసారు.

10 నిమిషాల్లో ఎబోలా గుట్టు రట్టు

రోగికి చెందిన రక్త సీరం స్ట్రిప్ పై ప్రవహించనపుడు ఏవైనా వైరల్ ప్రోటీన్లు స్ట్రైప్ పై ఏర్పాటు చేసిన యాంటీబాడీస్‌కు మ్యాచ్ అయినట్లయితే సూక్ష్మకణాలు మన కంటికి కనిపించేంతలా మెరుస్తాయి. కలర్ బ్లైండ్ ఉన్నవారు సెల్ ఫోన్ కెమెరా సహాయంతో ఈ కలర్ లను గుర్తించవచ్చని పరిశోధకులు తెలిపారు.

10 నిమిషాల్లో ప్రాణాంతకు ఎబోలాను గుర్తించగలిగే ఈ పేపర్ స్ట్రిప్‌కు యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డిఏ) ఆమోద ముద్ర వేయవల్సి ఉంది.

English summary
Paper strip can detect Ebola in 10 minutes. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot