పాస్‌వర్డ్ భద్రత ఇలా..!
మీ ఆన్ లైన్ అకౌంట్ లకు సంబంధించి పాస్ వర్డ్ భద్రత ఎంతగానో ముఖ్యం... చాలా మంది తమ పేరునే పాస్‌వర్డ్‌గా వాడుతుంటారు. ఇది సురక్షితం కాదంటున్నారు నిపుణులు. కేవలం Lowercase అక్షరాలతో పెట్టుకున్న మీ పాస్‌వర్డ్ తెలుసుకోడానికి హ్యాకర్లకు 10 నిమిషాలే పడుతుందట.

అదే పాస్‌వర్డ్‌ని Uppercase అక్షరాల్లో పెడితే కనుక్కోవడానికి 10 గంటలు పడుతుందని చెబుతున్నారు. అంకెల్ని, గుర్తుల్ని కూడా పాస్‌వర్డ్‌లో పెడితే తెలుసుకోవడానికి హ్యాకర్ కంప్యూటర్‌కి సుమారు 18 రోజులు పడుతుందట. డైలీ మెయిల్ నివేదిక ప్రకారం సుమారు 50 శాతం మంది నెటిజెన్లు ఒకే రకమైన పాస్‌వర్డ్‌లు వాడుతున్నారు. చాలామంది 123456, Password, 12345678, qwerty, abc123లనే వాడుతున్నారని తెలుసా? నిపుణుల సలహా ఏంటంటే పాస్‌వర్డ్ కచ్చితంగా 9 అంకెల కంటే తక్కువ ఉండకూడదు. అక్షరాలతో పాటు నెంబర్లు, గుర్తుల్ని జత చేయాలి. అప్పుడు పాస్‌వర్డ్‌ని బ్రేక్ చేయడానికి హ్యాకర్‌కి కొన్ని వందల సంవత్సరాలు పడుతుందట.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








