జియోకి రాందేవ్ బాబా షాక్,మార్కెట్లోకి పతంజలి సిమ్‌కార్డ్స్,రూ.144కే అన్‌లిమిటెడ్

దేశంలో అత్యంత నమ్మకమైన కన్జ్యూమర్‌ గూడ్స్‌ బ్రాండ్‌గా పేరులోకి వచ్చిన రాందేవ్‌ బాబా పతంజలి బ్రాండు టెలికాం మార్కెట్‌లోకి అడుగుపెట్టింది.

|

టెలికాం మార్కెట్లో రోజురోజుకు పోటీ పెరగిపోతోంది. ఇప్పటిదాకా నాలుగు దిగ్గజాల మధ్యనే పోరు నడుస్తోంది. ఎయిర్‌టెల్, బిఎస్ఎన్ఎల్, జియో, వొడాఫోన్, ఐడియా లాంటి దిగ్గజాల మధ్య హోరా హోరీ పోరు నడుస్తున్న నేపథ్యంలో వీరి మధ్యకు యోగా గురు రాందేవ్ బాబా వచ్చారు. రిలయన్స్‌ జియోకు గట్టి పోటీ వచ్చేసింది. దేశంలో అత్యంత నమ్మకమైన కన్జ్యూమర్‌ గూడ్స్‌ బ్రాండ్‌గా పేరులోకి వచ్చిన రాందేవ్‌ బాబా పతంజలి బ్రాండు టెలికాం మార్కెట్‌లోకి అడుగుపెట్టింది.

90 రోజుల సరికొత్త ప్లాన్‌‌తో దూసుకొచ్చిన వొడాఫోన్90 రోజుల సరికొత్త ప్లాన్‌‌తో దూసుకొచ్చిన వొడాఫోన్

స్వదేశీ సమృద్ధి సిమ్‌ కార్డులను..

స్వదేశీ సమృద్ధి సిమ్‌ కార్డులను..

టెలికాం దిగ్గజాలకు షాక్ ఇస్తూ స్వదేశీ సమృద్ధి సిమ్‌ కార్డులను రాందేవ్‌ బాబా లాంచ్‌ చేశారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ భాగస్వామ్యంలో ఈ సిమ్‌ కార్డులను ప్రవేశపెట్టారు. 

తొలుత ఈ సిమ్‌ కార్డులను

తొలుత ఈ సిమ్‌ కార్డులను

తొలుత ఈ సిమ్‌ కార్డులను పతంజలి ఉద్యోగులకు, ఆఫీసు బేరర్లకు మాత్రమే అందుబాటులోకి తీసుకొస్తున్నామని రాందేవ్‌ బాబా చెప్పారు.

రిలయన్స్‌ జియో కూడా..

రిలయన్స్‌ జియో కూడా..

రిలయన్స్‌ జియో కూడా తొలుత తన జియో సిమ్‌ కార్డును లాంచ్‌ చేసినప్పుడు, ఉద్యోగులకే మొదట ఆ సిమ్ కార్డులను అందజేసింది. అనంతరం కమర్షియల్‌గా మార్కెట్‌లోకి లాంచ్‌ అయి సంచలనం సృష్టించింది.

పతంజలి లాంచ్‌ చేసిన ఈ సేవలు

పతంజలి లాంచ్‌ చేసిన ఈ సేవలు

ప్రస్తుతం పతంజలి లాంచ్‌ చేసిన ఈ సేవలు పూర్తిగా మార్కెట్‌లోకి వచ్చిన అనంతరం, ఈ కార్డులతో పతంజలి ఉత్పత్తులపై 10 శాతం డిస్కౌంట్‌ పొందనున్నారు.

 రూ. 144 రీఛార్జ్‌తో

రూ. 144 రీఛార్జ్‌తో

కేవలం రూ. 144 రీఛార్జ్‌తో దేశవ్యాప్తంగా అపరిమిత కాల్స్‌ చేసుకునే సౌకర్యం, 2జీబీ డేటా ప్యాక్‌, 100 ఎస్‌ఎంఎస్‌లను కంపెనీ ఆఫర్‌ చేయనుంది.వాటితో పాటు ప్రజలకు ఈ సిమ్‌ కార్డులపై వైద్య, ప్రమాద, జీవిత బీమాలను పతంజలి అందించనుంది.

రాందేవ్‌ బాబా మాట్లాడుతూ

రాందేవ్‌ బాబా మాట్లాడుతూ

ఈ సందర్భంగా రాందేవ్‌ బాబా మాట్లాడుతూ ఈ సిమ్ కార్డులను బీఎస్‌ఎన్‌ఎల్‌ ‘స్వదేశీ నెట్‌వర్క్‌' గా అభివర్ణించారు. పతంజలి, బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇరు కంపెనీల ఉద్దేశ్యం కూడా దేశ సంక్షేమమేనని పేర్కొన్నారు.

ఐదు లక్షల కౌంటర్లలో

ఐదు లక్షల కౌంటర్లలో

బీఎస్‌ఎన్‌ఎల్‌కున్న ఐదు లక్షల కౌంటర్లలో, పతంజలి స్వదేశీ సమృద్ధి కార్డులు ప్రజలకు త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. 

భాగస్వామ్యంపై

భాగస్వామ్యంపై

పతంజలితో భాగస్వామ్యం ఏర్పరచుకోవడంపై బీఎస్‌ఎన్‌ఎల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ సునిల్‌ గార్గ్‌ ఆనందం వ్యక్తం చేశారు.

పతంజలి ఉత్పత్తులలో 10 శాతం డిస్కౌంట్

పతంజలి ఉత్పత్తులలో 10 శాతం డిస్కౌంట్

సిమ్ కార్డు పూర్తి స్తాయిలో వినియోగం కిందకు వస్తే ఈ కార్డు తీసుకున్న వారికి పతంజలి ఉత్పత్తులలో 10 శాతం డిస్కౌంట్  అందుకుంటారని ANI రిపోర్ట్ చేసింది.

రూ.2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు ప్రయోజనాలు

రూ.2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు ప్రయోజనాలు

దీంతో పాటు health, accidental and life insurances లాంటి ప్రయోజనాలు కూడా అందుకుంటారని ANI తెలిపింది. అలాగే రూ.2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు ప్రయోజనాలు పొందుతారని రిపోర్ట్ తెలిపింది.

5 లక్షల కౌంటర్లను ఏర్పాటు చేసి

5 లక్షల కౌంటర్లను ఏర్పాటు చేసి

దేశంలో 5 లక్షల కౌంటర్లను ఏర్పాటు చేసి అక్కడి వారందరికీ Patanjali swadeshi-samradhi cardలను అందిస్తామని రామ్ దేవ్ బాబా తెలిపారు. కాగా ఈ వార్తతో పతంజలి షేర్లు పుంజుకున్నాయి.

Best Mobiles in India

English summary
Baba Ramdev launched Swadeshi Samriddhi SIM cards, in alliance with Bharat Sanchar Nigam Limited (BSNL). More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X