పట్ని కంప్యూటర్స్ Q1 నికర లాభం రూ 162.28 కోట్లు

Posted By: Super

పట్ని కంప్యూటర్స్ Q1 నికర లాభం రూ 162.28 కోట్లు

మిడ్‌ సైజ్‌ కంప్యూటర్‌ సంస్థ పత్ని కంప్యూటర్‌ సిస్టమ్స్‌ మార్చి 31, 2011తో ముగిసిన మొదటి త్రైమాసానికి ఏకీకృత నికర లాభంలో 3.33 శాతం వృద్ధితో రూ.162.28 కోట్లు ఆదాయాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంలో రూ.157.04 కోట్లు ఆదాయాన్ని నమోదు చేసినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. గత తెైమాసికంలో కంపెనీ తమ అంచనాల మేరకు పనితీరును ప్రదర్శించిందని.. కస్టమర్లకు.... వాటాదారులకు ఇదే విధంగా సేవలందజేస్తామని పత్రి సీఈవో జేయ్‌కుమార్‌ చెప్పారు.

జనవరి - మార్చి త్రైమాసికంలో గరిష్ఠ ఆదాయం రూ.891.69 కోట్లు కాగా.. అంతకు ముందు ఏడాది రూ.812.10 కోట్లు. స్వల్ప కాలానికి ఫలితాలు అటు ఇటు ఉన్నా.. దీర్ఘ కాలంలో అన్ని సర్దుకుంటాయని ఆయన చెప్పారు. 25-30 మిలియన్‌ డాలర్ల ఆర్డర్లు దక్కాయని సీఈవో చెప్పారు. పత్ని కంప్యూటర్‌తో గత త్రైమాసికంలో ఐ-గేట్‌ టేకోవర్‌ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot