బిల్‌ గేట్స్ తనను మోసం చేశాడంటున్న భాగస్వామి!

Posted By: Staff

బిల్‌ గేట్స్ తనను మోసం చేశాడంటున్న భాగస్వామి!

ప్రపంచపు అగ్రగామి కుబేరుల్లో ఒకరైన మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌పై ఆ సంస్థ సహ-వ్యవస్థాపకుడు పాల్ అలెన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. మైక్రోసాఫ్ట్ షేర్లను తన వశం చేసుకునేందుకు బిల్ గేట్స్ జిమ్మిక్కులు చేశేవాడని అలెన్ రాసిన పుస్తకంలో పేర్కొన్నారు. బిల్ గేట్స్‌పై తనకున్న ద్వేషాన్ని మొత్తం అలెన్ తన రచనల ద్వారా కనబరిచారు. బుధవారం వింటేజ్ ఫెయిర్ అనే మ్యాగజైన్‌లో ప్రచురితమైన "ఐడియా మ్యాన్" అనే వ్యాసంలో బిల్ గేట్స్ 1982లో కంపెనీ వాటాల విషయంలో తనకు అన్యాయం చేశాడంటూ ఆరోపించారు.

56 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచపు రెండవ అతిపెద్ద ధనవంతుడైన బిల్ గేట్స్ ఓ తెలివైన వ్యక్తి మాత్రమే కాకుండా.. తమ సంస్థ ప్రారంభించిన తొలి రోజుల్లో సంస్థపై నియంత్రణ కోసం స్కీమర్‌గా మారిపోయాడని అలెన్ ఆరోపించారు. అలెన్ రాసిన పుస్తకంలో కంపెనీ ప్రారంభ దశ నుంచి మొత్తం చరిత్రను ప్రస్తావించారు. 1975 ప్రారంభంలో అల్టైర్ మైక్రోకంప్యూటర్‌పై పరీక్షల అనంతరం బేసిక్ ప్రోగ్రామ్‌ అందించిన తర్వాత వారిద్దరూ భాగస్వామ్యంగా ఏర్పడి మైక్రో-సాఫ్ట్ ఏర్పడినట్లు సదరు పుస్తకంలో ప్రచురించబడి ఉంది. ఇలా భాగస్వామ్యంగా ఏర్పడే సమయంలో తాను ఎల్లప్పుడూ 50-50 లాభాలను ఆశించేవాడినని అలెన్ పేర్కొన్నారు.

కానీ బిల్ గేట్స్ మాత్రం మరో ఐడియాతో.. ఈ ప్రోగ్రామింగ్ కోసం తానే ఎక్కువ శ్రమ పడ్డానని చెప్పుకొని.. 60 శాతం వాటాలను తన ఖాతాలోకి వేసుకున్నట్లు అలెన్ తన పుస్తకంలో రాశారు. ఈ విషయంలో అప్పుడే గేట్స్‌తో వాదించాలనుకున్నానని కానీ.. అందుకు తన మనసు అంగీకరించలేదని అలెన్ రాశారు. గేట్స్ 64 శాతం వాటా రావడం పట్ల తాను గాఢంగా ఆలోచించేవాడినని, అగ్రిమెంట్లపై సంతకాలు జరిగి సీల్ వేసేలోపే, వాటిని మార్చేందుకు గేట్‌కు చాలా స్వతంత్రాధికారాలు ఉండేవని అలెన్ తన పుస్తకంలో ప్రచురించారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot