ట్విట్టర్‌లో పవన్ కళ్యాణ్

Posted By:

 ట్విట్టర్‌లో పవన్ కళ్యాణ్

టాలీవుడ్ అగ్రహీరో, జనసేన పార్టీ అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్విట్టర్‌లో తన అకౌంట్‌ను ప్రారంభించారు. తొలి ట్వీట్‌గా తన అభిమానులకు ‘న్యూ ఇయర్ విషస్' తెలిపారు. పవన్ అలా అకౌంట్ ప్రారంభించారా లేదో ఆయన ట్విట్టర్ ఖాతాను అభిమానులు విపరీతంగా షేర్ చేసుకోవటం ప్రారంభించారు.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

ట్విట్టర్‌లో పవన్‌ను అనుసరించే వారి సంఖ్య నిమిష నిమిషానికి పెరుగుతోంది. తొలి గంటలనే పవన్ ట్విట్టర్ అకౌంట్‌కు 5 వేలమంది ఫాలోవర్స్ లభించారు. తాజాగా ఆ సంఖ్య 75,000 మార్క్‌‍ను దాటింది. నిన్న మొన్నటి వరకు పవన్ కళ్యాణ్‌తో ముచ్చటించే అవకాశం దొరకకు నిరుత్సాహపడుతున్న ఆయన అభిమానులు ఈ ట్విట్టర్ ద్వారా తమ అభిమాన హీరోతో బోలెడన్ని ముచ్చట్లు పంచుకోవచ్చు. రోజులు గడిచే కొద్ది పవన్ ఎంత మంది ఫాలోవర్స్‌ను సొంతం చేసకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

బాలీవుడ్‌లో అమితాబ్, కోలివుడ్‌లో రజినీకాంత్‌లకు ట్విట్టర్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే.

English summary
Pawan Kalyan joins Twitter. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot