డెబిట్ ,క్రెడిట్ కార్డులు మూలకి ..కన్ను కొడితే వస్తువు ఇంటికి

Written By:

ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ వినూత్న టెక్నాలజీకి తెరలేపింది. ఇప్పటిదాకా మనం చెల్లిస్తున్న ఆన్‌లైన్ పేమెంట్‌లకు అది సరికొత్త చెల్లింపు విధానాన్ని ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. దీనికోసం పేటెంట్‌ను కూడా పొందింది. ఇక నుంచి డెబిట్ కార్డులకు, క్రెడిట్ కార్డులకు రాంరాం చెప్పి కన్ను కొట్టడం ద్వారా మీరు కోరుకున్న వస్తువును పొందవచ్చు. షాకింగ్ లా ఉంది కదా..అయితే న్యూస్ చదివితే ఇంకా షాక్ అవుతారు.

Read more :అమెజాన్‌లో మారణాయుధాలు: ఘాతుకానికి ఒడిగడుతున్న పిల్లలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1

ఇప్పటిదాకా ఏదైనా వస్తువు కొనాలంటే ఏవరైనా ఏం చేస్తారు..వారి డెబిట్ కార్డు అలాగే క్రెడిట్ కార్డు వివరాలను ఇచ్చి వన్‌టైమ్ పాస్ట‌వర్డ్‌ను టైప్ చేయాల్సి ఉండేది. అదీ కాకుంటే క్యాష్ అన్ డెలివరీ ఆప్సన్ ఉండేది.

2

అయితే ఇప్పుడు అమెజాన్ ఈ వ్యవహారాలకు చెక్ పెట్టి సెల్‌ఫోన్ ముందు నచ్చిన వస్తువును ఎంపిక చేసుకుని ఓ సారి కన్ను కొడితే ఆటోమేటిగ్గా మీ బ్యాంకు నుండి డబ్బులు వాళ్లకి చేరి వస్తువు మీ ఇంటికి వస్తుంది.

3

ఈ విధానంలో ఎటువంటి సందేహాలకు తావు లేకుండా దీన్ని త్వరలోనే కష్టమర్లకు అందుబాటులోకి తీసుకువస్తామని అమెజాన్ చెబుతోంది. మరి అది సాధ్యమయ్యే పనేనా అంటే అవుననే అంటోంది అమెజాన్.

4

అయితే ఇందుకోసం మీరు తొలుత ఒక్కసారి సెల్ఫీలను , ఆపై బ్యాంకు వివరాలను అమెజాన్ సైట్‌కు అందించాలని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.

5

మనం కొనుగోలు చేసే వస్తువులను ఎంపిక చేసుకున్నాక చెల్లింపు జరపడానికి సెల్ఫీ తీసుకోవాలి. దీన్ని వాళ్ల రికార్డుల్లో ఉన్న మన ఫొటోతో సరిపోల్చుకొని తదుపరి మరో సెల్ఫీ అడుగుతుంది. నిజంగా మనమే కొంటున్నామని నిర్ధారించుకోవడానికి కుడి కన్నుగీటమని అడుగుతుంది.

6

కన్నుకొట్టేస్తే.. మనం అంతకుముందే వారికిచ్చిన కార్డు వివరాల ఆధారంగా కొనుగోలు చేసిన వస్తువులకు చెల్లింపు జరిగిపోతుంది. ఆయా కార్డులపై బిల్లింగ్ జరుగుతుంది. వస్తువులు మనకు డెలివరీ అవుతాయి.

7

అయితే కన్ను కొట్టడం మాత్రమే కాదు. తలను మీకు మాత్రమే తెలిసినట్టుగా ఓ ప్రత్యేకమైన దిశలో తిప్పడం అలాగే ఓ విధంగా నవ్వడం ఇంకా మీకు నచ్చిన విధంగా వెక్కిరించడం లాంటివి కూడా పాస్ వర్డ్ గా పెట్టుకోవచ్చు.

8

కాగా గతంలో మాస్టర్ కార్డ్ సెల్ఫీతో చెల్లింపులను పరిచయం చేస్తూ సెల్ఫీ పే ను అభివృద్ధి చేసినప్పటికీ అందులో మోసాలు జరిగే అవకాశం ఉండటంతో పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు కూడా. ఎవరైనా మన ఫొటోను మన సెల్‌ఫోన్ కెమెరా ముందుంచి ఫొటో తీసి కొనుగోలు చేస్తే మనం మోసపోయే అవకాశం ఉందని గుర్తించి దాన్ని డెవలప్ చేసి ముందుకు తీసుకువస్తోంది.

9

యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ల చౌర్యం, దుర్వినియోగం అనే సమస్యలే ఉండవని, ఇదో సురక్షిత చెల్లింపు విధానమని అమెజాన్ చెబుతోంది. సమీప భవిష్యత్తులో అమెజాన్‌లో ఈ సౌకర్యం కొనుగోలుదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

10

ఇందుకోసం ముందుగా మీరు చేయాల్సింది. మీ మొబైల్‌లో అమెజాన్ సైట్లోకి వెళ్లి కొనాల్సిన వస్తువులను ఎంపిక చేసుకోవాలి.

11

ఎంపిక చేసుకున్న తరువాత సెల్ఫీ కోసం ఒక బాక్స్ వస్తుంది. మన ముఖం అందులో వచ్చేలా సెల్ఫీ దిగాలి. ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ ద్వారా అమెజాన్ వద్దనున్న రికార్డుల్లోని మన ఫోటోతో దీన్ని పోల్చిచూస్తుంది.

12

ఇతరులు మన మొబైల్ ద్వారా మన ఫోటోను కెమెరా ముందు పెట్టి దుర్వినియోగం చేయకుండా... అక్కడ మీకు ‘దయచేసి కుడికన్ను కొట్టండి' అని అడుగుతుంది. కన్నుకొడితే...కొనుగోలు చేస్తున్నది అసలైన వ్యక్తేనని గుర్తించి చెల్లింపును ఆథరైజ్ చేస్తుంది.

13

చెల్లింపు జరిగిపోయాక... మన ఆర్డర్‌ను ధ్రువీకరిస్తూ... కృతజ్ఞతలు తెలిపే సందేశం వస్తుంది. మీ వస్తువు మీ ఇంటికి భద్రంగా చేరుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Pay with a WINK! Amazon patents system that uses selfies and blinking to pay online
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot