హైవేలపై వెళ్లేవారికి ఛార్జీల మోత, ఇకపై క్యాష్ ఇవ్వకండి

By Gizbot Bureau
|

హైవేపై రయ్యిన దూసుకెళ్లే వాహనాదారులకు ఇది నిజంగా షాకింగ్ న్యూసేనని చెప్పవచ్చు. ఇకపై టోల్ ప్లాజాల దగ్గర ఛార్జీల మోత మోగనుంది. ఇందులో భాగంగానే టోల్ గేట్ల దగ్గర రద్దీని భారీగా తగ్గించడానికి, వాహనదారులందరినీ ఎలక్ట్రానిక్ పద్ధతుల్లోకి తీసుకురావడానికి కేంద్రం కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకునేందుకు సిద్ధమవుతోంది.

 
Paying by cash? Pay up ‘penalty’ at toll plazas

టోల్ గేట్ల దగ్గర టోల్ చెల్లింపును నగదుతో జరిపితే 10-20 శాతం అదనంగా వసూలు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది జాతీయ రహదారుల నిర్వహణా సంస్థ (ఎన్‌హెచ్ఏఐ). జనాలను ఫాస్టాగ్ వంటి ఎలక్ట్రానిక్ టోలింగ్ వైపునకు నడిపించేందుకు త్వరలో దీనిపై ప్రకటన వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

FASTagsకు రాయితీలు లేవు

FASTagsకు రాయితీలు లేవు

ప్రస్తుతానికి ఎలక్ట్రానిక్ టోల్ గేట్స్ దగ్గర ఫాస్టాగ్‌ను వినియోగిస్తున్నవారికి పది శాతం వరకూ రాయితీని ఇస్తున్నారు. అయినా దీనిని వినియోగించుకుంటున్న వాళ్ల 10 శాతం లోపే ఉందని హైవే అథారిటీ ఓ నిర్ధారణకు వచ్చింది. అందుకే నగదుతో టోల్ చెల్లింపు విధానానికి దశలవారీగా పుల్ స్టాప్ పెట్టాలని భావిస్తోంది. ఈ-టోలింగ్ పేమెంట్స్ వైపు వాహనదారులను ఆకర్షించేందుకు ప్రభుత్వం నగదు చెల్లింపులపై అదనపు ఛార్జీలు విధించాలని భావిస్తోంది.

టోల్ ఒప్పందాల కారణంగా

టోల్ ఒప్పందాల కారణంగా

నగదు చెల్లింపుల వల్ల ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడడం, విపరీతమైన కాలుష్యానికి కారణమవుతోందని ఇంతకాలానికి గుర్తించారు. టోల్ ఒప్పందాల కారణంగా ఇప్పటికిప్పుడు రద్దీ రూట్లలో కూడా అదనపు గేట్లను పెట్టడానికి కూడా వీలు లేదు కాబట్టి బలవంతంగానైనా ఎలక్ట్రానిక్ టోల్ పద్ధతిని పెట్టాలని చూస్తున్నారు. ఇది అమల్లోకి వస్తే, ఇప్పుడున్న డిస్కౌంట్ పద్ధతికి చెక్ చెప్పాలని అనుకుంటున్నారు. ఇందులో భాగంగా నగదు రూపంలో చెల్లించే ఫీజుపై అదనంగా 10 నుంచి 20 శాతం వరకు సర్ ఛార్జ్ విధించనున్నారు.

ఐదేళ్లుగా ఫాస్టాగ్
 

ఐదేళ్లుగా ఫాస్టాగ్

జాతీయ రహదారుల నిర్వాహణా సంస్థ 2014లో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడి)ని ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి ఈ ఫాస్టాగ్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇందులో సర్వీస్ ప్రొవడైర్ ఇచ్చే ఓ స్టిక్కర్‌ను కార్ పై అంటించుకోవాల్సి ఉంటుంది. సదరు కార్డ్‌లో ఆన్ లైన్ ద్వారా డబ్బును లోడ్ చేసుకోవచ్చు. ఆ స్టిక్కర్ టోల్ గేట్ దగ్గరుండే ఆటోమేటిక్ మెషీన్ల దగ్గరికి వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా మన ఖాతా నుంచి డబ్బును డిడక్ట్ చేస్తారు. మనషుల ప్రమేయం ఏమీ ఉండదు కాబట్టి వాహనాలు ఈ ప్రత్యేక గేట్ నుంచి వేగంగా వెళ్లిపోవచ్చు.

డిస్కౌంట్ ఆఫర్

డిస్కౌంట్ ఆఫర్

డిజిటల్ పేమెంట్స్ చేసిన ప్రయాణదారుడికి బేస్ రేట్ కింద నేషనల్ హైవేస్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. కాగా టోల్ ప్లాజాల దగ్గర రద్దీనిబట్టి నగదు రూపంలో చెల్లించే ఫీజులపై సర్ ఛార్జీ విధించే అవకాశం ఉంది. రద్దీ తక్కువగా ఉన్న సమయాల్లో మాత్రం అదనపు ఛార్జీలు విధించకపోవచ్చు. ఈ కొత్త టోల్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు NHAI ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 2014లోనే FASTags పేమెంట్స్ విధానాన్ని NHAI ప్రవేశపెట్టింది.

RFID టెక్నాలజీ ద్వారా FASTags

RFID టెక్నాలజీ ద్వారా FASTags

RFID టెక్నాలజీ ద్వారా FASTags నేరుగా పేమెంట్స్ చేసుకోవచ్చు. ప్రీపెయిడ్ లేదా సేవింగ్స్ అకౌంట్లకు అనుసంధానం చేయడం ద్వారా వాహనాదారులు ఈజీగా టోల్ ఫీ చెల్లించవచ్చు. దీనిద్వారా వాహనాదారులు టోల్ ప్లాజా దగ్గర ఆగాల్సిన అవసరం లేకుండానే చెల్లింపులు జరిగిపోతాయి. నగదు చెల్లింపుల కారణంగా టోల్ ప్లాజాల దగ్గర భారీగా రద్దీ ఏర్పడటమే కాకుండా పర్యావరణం పరంగా కాలుష్యానికి దారితీస్తోందని అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా NHAI టోల్ ప్లాజాల్లో ఎలక్ట్రానిక్ సిస్టమ్ ద్వారా 30 శాతం చెల్లింపులు జరుగుతున్నాయి. నగదు చెల్లింపులను 10శాతం కంటే తక్కువగా ఉండేలా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ఇక క్యాష్ కౌంటర్లు కొన్నే

ఇక క్యాష్ కౌంటర్లు కొన్నే

నగదు తీసుకుని టోల్ టికెట్లు ఇచ్చే కౌంటర్లను తగ్గించడం వల్ల తప్పనిసరిగా వాహనదారులు ఫాస్టాగ్‌కు మారతారని ఎన్ హెచ్ ఏ ఐ భావిస్తోంది. ప్రస్తుతం ఈ నిర్వాహణ సంస్థ చూసుకుంటున్న 400 టోల్ గేట్లలో కేవలం 30 శాతం మాత్రమే ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో టోల్ తీసుకుంటున్నారు. దీన్ని 90 శాతానికి పెంచి నగదు లావాదేవీలను 10 శాతానికి పరిమితం చేయాలనే లక్ష్యంగా సాగుతున్నారు.

Best Mobiles in India

English summary
Paying by cash? Pay up ‘penalty’ at toll plazas

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X