$3,000 పెంచిన పేపాల్ ఎకౌంట్ లావాదేవీలు

Posted By: Super

$3,000 పెంచిన పేపాల్ ఎకౌంట్ లావాదేవీలు

వన్ ఇండియా పాఠకుల కోసం పేపాల్ ఎకౌంట్ గురించి సమాచారం. పేపాల్ అంటే ఏమిటి. సాధారణంగా ఇంటర్నెట్లో ఏదైనా వస్తువు కొంటె డబ్బు చెల్లించడానికి క్రెడిట్ కార్డు‌తో పాటు మీకు paypal ఆప్షన్ కూడా కనబడుతుంది. క్రెడిట్ కార్డు ఉండగా మల్లి paypal ఎందుకు అనే సందేహం వస్తుంది. కాబట్టి దీని గురించి యూజర్స్‌కు వివరంగా తెలియజేస్తాను. సాధారణంగా క్రెడిట్ కార్డు అయితే మీరు లావాదేవీలు చేసినప్పుడు మీ కార్డు details అన్నీ మీకు కొన్న మర్చెంట్‌కు తెలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఇంటర్నెట్లో వస్తువును కొంటున్నారు కాబట్టి అదే paypal విధానంలో ఐతే మీకు వస్తువుని అమ్మే విక్రయదారునికి మద్య paypal ఉండి మీ లావాదేవి లు సురక్షితంగా జరిగేలా చూస్తుంది. అందుకే పేపాల్ ఎకౌంట్‌ని వినియోగించడం జరుగుతుంది. అసలు పేపాల్ ఎకౌంట్‌కి ఏమేమి కావాలంటే బ్యాంక్ ఎకౌంట్, పాన్ కార్డ్, ఎన్‌ఈఎఫ్టి కొడ్ ఉంటే సరిపోతుంది.

గత కొన్ని సంవత్సరాలుగా ఇండియాలో ఈ పేపాల్ ఎకౌంట్ లీగల్ ఇష్యూలను ఎదుర్కొంటుంది. ఆ కారణంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేపాల్ ఎకౌంట్‌కి ప్రతి ఒక్క లావాదేవీకి ఇండియన్ యూజర్స్‌కి కేవలం $500 మాత్రమే కేటాయించడం జరిగింది. ప్లగ్గడ్.ఇన్ అనే వెబ్ సైట్ అందించిన సమాచారం ప్రకారం ఇండియాలో ఉన్న పేపాల్ యూజర్స్ యొక్క లావాదేవీలు ఇప్పుడు $3000 వరకు పెంచారని తెలియజేయడం జరుగుతుంది.

దీంతో ఇండియాలో ఎవరైతే యూజర్స్ ఈ పేపాల్ ఎకౌంట్‌ని వినియోగిస్తున్నారో వారు కొత్తగా ప్రవేశపెట్టిన ఈ సర్వీస్‌ని సద్వినియోగ పరుచుకొవాల్సిందిగా కొరడం జరిగింది. విదేశాల నుండి ఎవరైతే గూడ్స్‌ని సొంతం చేసుకుంటున్నారో వారికి ఈ కొత్త పేపాల్ విధానం సంతృప్తికరంగా ఉందని అంటున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot