పేటీఎమ్ యూజర్లు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

By Gizbot Bureau
|

భారతదేశపు ప్రముఖ డిజిటల్ చెల్లింపు ప్లాట్‌ ఫారం పేటీఎం తమ వినియోగదారుల కోసం సరికొత్త చెల్లింపు విధానాన్ని ప్రవేసపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఇతర డిజిటల్ వాల్లెట్లకు సవాల్ విసురుతూ దూసుకుపోతున్న ఈ దిగ్గజ యాప్ ని అందరూ తమ స్మార్ట్ ఫోన్లలో వాడుతున్నారు.

పేటీఎమ్ యూజర్లు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

 

అయితే పేటీఎం వాడే వారికి కంపెనీ కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. పేటీఎం వాలెట్ ఉపయోగించేవారు కేవైసీ అప్‌డేట్ సమయంలో అప్రమత్తంగా ఉండాలని చెబుతోంది. లేదంటే ఆన్‌లైనర్ బ్యాంకింగ్ మోసాల బారినపడే అవకాశముందని పేర్కొంటోంది. ఇందులో భాగంగా పేటీఎం తన కస్టమర్లకు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది.

 అకౌంట్‌లో సమస్యలు ఉన్నాయని చెబితే

అకౌంట్‌లో సమస్యలు ఉన్నాయని చెబితే

మీరు ఒకవేళ మొబైల్ వ్యాలెట్‌కు బ్యాంక్ అకౌంట్ లింక్ చేసినట్టైతే ఏమరుపాటు అసలే వద్దు. కాస్త నిర్లక్ష్యంగా ఉన్నా మీ అకౌంట్‌లో డబ్బులు మాయమవుతాయని హెచ్చరిస్తోంది. ఎవరైనా మీకు ఫోన్ చేసి మీ పేటీఎం కేవైసీ ప్రాసెస్ పూర్తి చేస్తామని, అకౌంట్‌లో సమస్యలు ఉన్నాయని చెబితే అస్సలు నమ్మకండి. అలాగే ఎనీ డెస్క్, క్విక్స్ పోర్ట్ వంటి యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవద్దని హెచ్చరించింది.

మాల్వేర్ అటాక్స్

మాల్వేర్ అటాక్స్

కేవైసీ వివరాల అప్‌డేట్ సమయంలో ఇలాంటి యాప్స్‌ను ఉపయోగించొద్దని సూచించింది. బ్యాంక్ ఫ్రాడ్, ఫిషింగ్ లేదా మాల్వేర్ అటాక్స్ బారినపడొద్దని హెచ్చరిస్తోంది. ఆన్‌లైన్‌లో కంపెనీ ఎగ్జిక్యూటివ్‌తో కనెక్ట్ అయిన తర్వాతనే కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని పేర్కొంది.

 స్క్రీన్ షేరింగ్ యాప్స్
 

స్క్రీన్ షేరింగ్ యాప్స్

మీ ఫోన్‌లో ఇలాంటి స్క్రీన్ షేరింగ్ యాప్స్ ఇన్‌స్టాల్ చేసి నేరగాళ్లు సులువుగా డబ్బు కాజేస్తారు. Any Desk లాంటి స్క్రీన్ షేరింగ్ యాప్స్ డౌన్‌లోడ్ చేసి ఇతరులకు యాక్సెస్ ఇచ్చారంటే మీ స్మార్ట్‌ఫోన్‌ను వాళ్ల చేతికి ఇచ్చినట్టే. మీ వ్యాలెట్, బ్యాంక్ అకౌంట్ల నుంచి సైబర్ నేరగాళ్లు క్షణాల్లో డబ్బులు మాయం చేస్తారని కంపెనీ చెబుతోంది.

రిమోట్ యాప్స్‌కు సంబంధించి..

రిమోట్ యాప్స్‌కు సంబంధించి..

ఈ ఏడాది ఆరంభంలోనే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రిమోట్ యాప్స్‌కు సంబంధించిన నిబంధలను జారీ చేసింది. వీటి సాయంతో మోసగాళ్లు మీ ఫోన్ లేదా కంప్యూటర్‌ను వారి ఆధీనంలోకి తెచ్చుకుంటారు. దీంతో మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, పిన్, పాస్‌వర్డ్ వంటి వివరాలను తెలుసుకుంటారు. ఈ వివరాలతో మోసగాళ్లు మీ అకౌంట్ నుంచి డబ్బులు కొట్టేస్తారు.

Fraud కాల్స్ చేస్తే రెస్పాండ్ కావొద్దు

Fraud కాల్స్ చేస్తే రెస్పాండ్ కావొద్దు

బ్యాంకులు, యూపీఐ ప్లాట్‌ఫామ్స్ కూడా యూజర్లను అప్రమత్తం చేస్తున్నాయి. ఎనీడెస్క్ లాంటి స్క్రీన్ షేరింగ్ యాప్స్ అస్సలు ఇన్‌స్టాల్ చేయొద్దని సూచిస్తున్నాయి.ఇలాంటి మోసాలు మాల్వేర్ ఫిషింగ్ అటాక్స్ కిందకు వస్తాయని ఢిల్లీకి చెందిన సైబర్ క్రైమ్ నిపుణుడు పవన్ దుగ్గాల్ తెలిపారు. బ్యాంకర్లు ఎవరైనా ఇలాంటి యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోమని అడగరని ఆయన పేర్కొన్నారు. ఎవరైనా ఇలాంటి కాల్స్ చేస్తే రెస్పాండ్ కావొద్దని, పోలీసులకు వివరాలు అందించాలని తెలిపారు

Most Read Articles
Best Mobiles in India

English summary
Paytm account holder? Alert! Do not download these Remote Apps, your bank account details may get leaked

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X