Just In
Don't Miss
- Sports
బౌండరీలు బాదాలనే ప్రణాళికతో బరిలోకి దిగాం: తొలి టీ20లో హాఫ్ సెంచరీపై కేఎల్ రాహుల్
- News
భార్య మీద అనుమానం, స్కూల్ ముందే చంపేసిన జులాయి భర్త, అజ్ఞాతంలోకి, లుకౌట్ నోటీసు !
- Lifestyle
ప్రతి రాత్రి నిద్రించే ముందు నిమ్మ మరియు తేనె మిశ్రమ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు!
- Movies
షాకింగ్: పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసిన పూనమ్ కౌర్.. సంచలన వ్యాఖ్యలతో ట్వీట్.!
- Finance
జీఎస్టీ స్లాబ్ 5 నుంచి 6 శాతానికి పెంచే ఛాన్స్, స్వల్పంగా పెరగనున్న ధరలు
- Automobiles
డస్టర్ మీద లక్షన్నర రూపాయల ధర తగ్గించిన రెనో
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
పేటీఎమ్ యూజర్లు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
భారతదేశపు ప్రముఖ డిజిటల్ చెల్లింపు ప్లాట్ ఫారం పేటీఎం తమ వినియోగదారుల కోసం సరికొత్త చెల్లింపు విధానాన్ని ప్రవేసపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఇతర డిజిటల్ వాల్లెట్లకు సవాల్ విసురుతూ దూసుకుపోతున్న ఈ దిగ్గజ యాప్ ని అందరూ తమ స్మార్ట్ ఫోన్లలో వాడుతున్నారు.
అయితే పేటీఎం వాడే వారికి కంపెనీ కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. పేటీఎం వాలెట్ ఉపయోగించేవారు కేవైసీ అప్డేట్ సమయంలో అప్రమత్తంగా ఉండాలని చెబుతోంది. లేదంటే ఆన్లైనర్ బ్యాంకింగ్ మోసాల బారినపడే అవకాశముందని పేర్కొంటోంది. ఇందులో భాగంగా పేటీఎం తన కస్టమర్లకు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది.

అకౌంట్లో సమస్యలు ఉన్నాయని చెబితే
మీరు ఒకవేళ మొబైల్ వ్యాలెట్‌కు బ్యాంక్ అకౌంట్ లింక్ చేసినట్టైతే ఏమరుపాటు అసలే వద్దు. కాస్త నిర్లక్ష్యంగా ఉన్నా మీ అకౌంట్లో డబ్బులు మాయమవుతాయని హెచ్చరిస్తోంది. ఎవరైనా మీకు ఫోన్ చేసి మీ పేటీఎం కేవైసీ ప్రాసెస్ పూర్తి చేస్తామని, అకౌంట్లో సమస్యలు ఉన్నాయని చెబితే అస్సలు నమ్మకండి. అలాగే ఎనీ డెస్క్, క్విక్స్ పోర్ట్ వంటి యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకోవద్దని హెచ్చరించింది.

మాల్వేర్ అటాక్స్
కేవైసీ వివరాల అప్డేట్ సమయంలో ఇలాంటి యాప్స్‌ను ఉపయోగించొద్దని సూచించింది. బ్యాంక్ ఫ్రాడ్, ఫిషింగ్ లేదా మాల్వేర్ అటాక్స్ బారినపడొద్దని హెచ్చరిస్తోంది. ఆన్లైన్లో కంపెనీ ఎగ్జిక్యూటివ్‌తో కనెక్ట్ అయిన తర్వాతనే కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని పేర్కొంది.

స్క్రీన్ షేరింగ్ యాప్స్
మీ ఫోన్లో ఇలాంటి స్క్రీన్ షేరింగ్ యాప్స్ ఇన్స్టాల్ చేసి నేరగాళ్లు సులువుగా డబ్బు కాజేస్తారు. Any Desk లాంటి స్క్రీన్ షేరింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసి ఇతరులకు యాక్సెస్ ఇచ్చారంటే మీ స్మార్ట్‌ఫోన్‌ను వాళ్ల చేతికి ఇచ్చినట్టే. మీ వ్యాలెట్, బ్యాంక్ అకౌంట్ల నుంచి సైబర్ నేరగాళ్లు క్షణాల్లో డబ్బులు మాయం చేస్తారని కంపెనీ చెబుతోంది.

రిమోట్ యాప్స్‌కు సంబంధించి..
ఈ ఏడాది ఆరంభంలోనే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రిమోట్ యాప్స్‌కు సంబంధించిన నిబంధలను జారీ చేసింది. వీటి సాయంతో మోసగాళ్లు మీ ఫోన్ లేదా కంప్యూటర్ను వారి ఆధీనంలోకి తెచ్చుకుంటారు. దీంతో మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, పిన్, పాస్వర్డ్ వంటి వివరాలను తెలుసుకుంటారు. ఈ వివరాలతో మోసగాళ్లు మీ అకౌంట్ నుంచి డబ్బులు కొట్టేస్తారు.

Fraud కాల్స్ చేస్తే రెస్పాండ్ కావొద్దు
బ్యాంకులు, యూపీఐ ప్లాట్‌ఫామ్స్ కూడా యూజర్లను అప్రమత్తం చేస్తున్నాయి. ఎనీడెస్క్ లాంటి స్క్రీన్ షేరింగ్ యాప్స్ అస్సలు ఇన్స్టాల్ చేయొద్దని సూచిస్తున్నాయి.ఇలాంటి మోసాలు మాల్వేర్ ఫిషింగ్ అటాక్స్ కిందకు వస్తాయని ఢిల్లీకి చెందిన సైబర్ క్రైమ్ నిపుణుడు పవన్ దుగ్గాల్ తెలిపారు. బ్యాంకర్లు ఎవరైనా ఇలాంటి యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకోమని అడగరని ఆయన పేర్కొన్నారు. ఎవరైనా ఇలాంటి కాల్స్ చేస్తే రెస్పాండ్ కావొద్దని, పోలీసులకు వివరాలు అందించాలని తెలిపారు
-
29,999
-
14,999
-
28,999
-
34,999
-
1,09,894
-
15,999
-
36,990
-
79,999
-
71,990
-
49,999
-
14,999
-
9,999
-
64,900
-
34,999
-
15,999
-
25,999
-
46,354
-
19,999
-
17,999
-
9,999
-
18,200
-
18,270
-
22,300
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790
-
7,090
-
17,090