Google ప్లే స్టోర్ నుండి Paytm app అవుట్!! కారణం ఇదే...

|

ప్రముఖ సెర్చ్ దిగ్గజం గూగుల్ Paytm మరియు Paytm ఫస్ట్ గేమ్ ఫాంటసీ వంటి యాప్ లను తన ప్లే స్టోర్ నుండి పూర్తిగా తొలగించింది. అయితే Paytm for Business, Paytm మాల్, Paytm మనీ వంటి మరికొన్ని యాప్ లు ఇప్పటికీ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఫోన్ లలో దీనిని కొత్తగా డౌన్‌లోడ్‌ చేయడానికి మరియు కొత్త అప్ డేట్ లను Google Play Store ద్వారా పొందడాన్ని ప్రస్తుతం తాత్కాలికంగా అందుబాటులో లేవు అని paytm సంస్థ వ్యాఖ్యానించింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Paytm యాప్ లభ్యత
 

Paytm యాప్ లభ్యత

Paytm యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అతి త్వరలో తిరిగి వస్తుంది అని కంపెనీ తెలుపుతోంది. ప్రస్తుతం మీ యొక్క అకౌంటులో ఉన్న డబ్బు అంతా పూర్తిగా సురక్షితం అలాగే మీ యొక్క Paytm యాప్ ను ముందుమాదిరిగానే మామూలుగా ఆనందంగా ఉపయోగించడం కొనసాగించవచ్చు అని Paytm తెలిపింది. ప్రస్తుతం ఈ రెండు యాప్ లు ఆపిల్ యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి.

Also Read: Flipkart New scam: డిస్నీ + హాట్‌స్టార్ చందా కేవలం రూ.99లకే!!! నమ్మారో అంతే సంగతులు

Paytm యాప్ డౌన్‌లోడ్ తొలగింపు

Paytm యాప్ డౌన్‌లోడ్ తొలగింపు

గూగుల్ ప్లే స్టోర్ జాబితాలో ప్రస్తుతం Paytm యాప్ డౌన్‌లోడ్‌ లో "మమ్మల్ని క్షమించండి, మీరు అభ్యర్థించిన URL ఈ సర్వర్‌లో కనుగొనబడలేదు అనే లోపం చూపిస్తోంది." దీని అర్థం ఆండ్రాయిడ్ వినియోగదారులు ఇకపై Paytm యాప్ ను డౌన్‌లోడ్ చేయలేరు. ఇప్పటికే మీ యొక్క ఫోన్ లో ఈ యాప్ ను ఇన్‌స్టాల్ చేసిన వినియోగదారులందరూ యాప్ యొక్క అన్ని సేవలను ఉపయోగించవచ్చు. గూగుల్ డిజిటల్ స్టోర్ చెల్లింపుల బెహెమోత్ పేటిఎమ్‌ను ప్లే స్టోర్ నుండి తొలగించడం ఇదే మొదటిసారి.

గూగుల్ ప్లే స్టోర్ లో paytm తొలగింపుకు కారణం

గూగుల్ ప్లే స్టోర్ లో paytm తొలగింపుకు కారణం

ఇండియాలో దాదాపు 50 మిలియన్ల మంది నెలవారీ క్రియాశీల వినియోగదారులు డౌన్‌లోడ్ చేసిన Paytm యాప్ ను తీసివేయడానికి గల కారణాన్ని గూగుల్ ప్రత్యేకంగా వెల్లడించలేదు. కానీ ఈ రోజు పోస్ట్ చేసిన బ్లాగులో టెక్ దిగ్గజం జూదంపై విధానాన్ని పేర్కొంది. డ్రీమ్ 11 వంటి ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్‌ను సులభతరం చేసే ఆన్‌లైన్ కాసినోలు మరియు ఇతర జూదం యాప్ లను గూగుల్ నిషేధిస్తుంది. దీనికి విరుద్ధంగా Paytm అప్లికేషన్‌లోని ఫాంటసీ స్పోర్ట్స్ సేవలను ప్రోత్సహిస్తుంది. అదే కారణంతో Paytm యొక్క ఫాంటసీ స్పోర్ట్స్ సర్వీస్ - Paytm ఫస్ట్ గేమ్స్ - ప్లే స్టోర్ నుండి కూడా తీసివేయబడింది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Paytm app Removed From Google Play Store: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X