కిరాణా స్టోర్లకు Paytm క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, ఓ లుక్కేసుకోండి

By Gizbot Bureau
|

ప్రముఖ మొబైల్ వ్యాలెట్ దిగ్గజం offline వ్యాపారులకు శుభవార్తను అందించింది. రిటైల్ కిరాణా స్టోర్ పేటీఎం మర్చంట్లకు పేటీఎం కొత్త క్యాష్ బ్యాక్ ఆఫర్లు అందిస్తోంది. వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడూ ఆఫర్లు ప్రకటిస్తున్న ఈ డిజిటల్ పేమెంట్ దిగ్గజం రిటైల్ కిరాణా స్టోర్లలో UPI లావాదేవీల నుంచి ఆఫ్ లైన్ మర్చంట్ పేమెంట్స్ వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్లు అందిస్తూ వస్తోంది.

 
కిరాణా స్టోర్లకు Paytm క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, ఓ లుక్కేసుకోండి

ఇందులో భాగంగానే 20 మిలియన్ల రిటైల్ కిరాణా స్టోర్ల మర్చంట్లను భాగస్వాములుగా చేసుకోవాలని కంపెనీ టార్గెట్ గా పెట్టుకుంది. రిటైల్ స్టోర్లలోని మర్చంట్ల అందరికి UPI సహా అన్ని డిజిటల్ పేమెంట్స్ మోడ్స్, వ్యాలెట్, కార్డులకు పేమెంట్స్ యాక్సస్ ఎనేబుల్ చేస్తోంది.

  వీలైనంత ఎక్కువ మంది సర్వీసులు వినియోగించుకునేందుకు

వీలైనంత ఎక్కువ మంది సర్వీసులు వినియోగించుకునేందుకు

పీర్ టూ పీర్ నెట్‌వర్క్ ట్రాన్సక్షన్స్ బదులుగా ఆఫ్ లైన్ మర్చంట్ మార్కెట్ ను విస్తరించే దిశగా పేటీఎం మనీ భారీగా ఇన్వెస్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. పేటీఎం వినియోగదారుల్లో వీలైనంత ఎక్కువ మంది సర్వీసులు వినియోగించుకునేందుకు హై ప్రీక్వెన్సీ యూసేజ్ ను క్రియేట్ చేసేలా ఆఫ్ లైన్ మర్చంట్లకు వెసులుబాటు కల్పించనున్నట్టు పేటీఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దీపక్ అబోట్ తెలిపారు.

 క్యాష్ బ్యాక్ రూపంలో..

క్యాష్ బ్యాక్ రూపంలో..

యూపీఐ P2P పేమెంట్స్ ద్వారా వినియోగదారులు క్యాష్ బ్యాక్ రూపంలో అదనంగా నగదును పొందవచ్చు. పేటీఎం యాప్ పై యూపీఐ యూజర్లు.. పేటీఎం సర్వీసులను ఎప్పటినుంచో వాడుతుండగా.. పేమెంట్స్ చేసేందుకు క్యాష్ బ్యాక్ అవసరం లేదన్నారు. మర్చంట్లకు పెట్టుబడితో పాటు ఫైనాన్షియల్ సెక్యూరిటీ అందించేందుకు పేటీఎం రుణాలు, ఇన్సూరెన్స్ పై ఇన్వెస్ట్ చేసే యోచనలో ఉన్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది.

ఎకో సిస్టమ్ ద్వారా నెట్ వర్క్
 

ఎకో సిస్టమ్ ద్వారా నెట్ వర్క్

2018-19 ఏడాదిలో 5 బిలియన్ల లావాదేవీలు చేసేందుకు పేటీఎం ఇప్పటికే పేమింట్ ఎకో సిస్టమ్ ద్వారా ఓ నెట్ వర్క్ ను క్రియేట్ చేసింది. పేటీఎం QR ద్వారా 12 మిలియన్ల మంది మర్చంట్స్ డిజిటల్ పేమెంట్ కేటగిరీల్లో UPI, వ్యాలెట్లు, కార్డులు, నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్స్ అనుమతించనుంది.

నిబంధనలను తగ్గించే దిశగా కేంద్రం అడుగులు

నిబంధనలను తగ్గించే దిశగా కేంద్రం అడుగులు

కేంద్ర ప్రభుత్వం కూడా చిన్న వ్యాపారులకు బాసటగా నిలిచేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే కిరాణా స్టోర్స్ ఏర్పాటు చేసుకునే విషయంలో ఇప్పటివరకూ ఉన్న నిబంధనలను సులభతరం చేయాలని కేంద్రం భావిస్తోంది. మన దేశంలో కిరాణా స్టోర్ ఏర్పాటు చేయాలంటే 28 రకాల అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. రెస్టారెంట్ ఏర్పాటు చేయాలంటే 17 రకాల అనుమతులు పొందాల్సి ఉంటుంది.

 సింగిల్ విండో విధానంలో అనుమతులు

సింగిల్ విండో విధానంలో అనుమతులు

ఇక నుంచి.. కిరాణా దుకాణం ఏర్పాటు చేసుకునేందుకు ఇప్పటివరకూ ఉన్న నిబంధనలను తగ్గించే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. చిన్న వ్యాపారాలను ప్రోత్సహించేందుకు నిబంధనలను తగ్గించి, సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇవ్వాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. లైసెన్స్ రీన్యూవల్ విధానానికి స్వస్తి పలకాలని డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్(డీపీఐఐటీ) భావిస్తోంది.

నాలుగు రకాల అనుమతులు

నాలుగు రకాల అనుమతులు

ఇప్పటికే చైనా, సింగపూర్ వంటి దేశాల్లో రెస్టారెంట్స్ ప్రారంభించాలంటే కేవలం నాలుగు రకాల అనుమతులు పొందితే చాలు. భారత్‌లో కూడా ఇక నుంచి ఈ తరహా విధానాన్నే అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.

Best Mobiles in India

English summary
Paytm brings cashback offers for offline merchants at Kirana stores

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X