Paytm క్యాష్‌బ్యాక్ స్కామ్: నకిలీ నోటిఫికేషన్‌ను నమ్మారో మీ డబ్బు గల్లంతే

|

గడిచిన రోజులతో పోలిస్తే ఆన్‌లైన్ మోసాలు మరింత పెరుగుతున్నాయి. ప్రతి రోజు ఎదో ఒక కొత్త స్కామ్ వెలుగులోకి వస్తోంది. మోసగాళ్లు ప్రజలను మోసం చేయడం కోసం అనేక మార్గాలను ఎంచుకుంటున్నారు. క్రొత్తగా వెలుగులోకి వచ్చిన Paytm స్కామ్‌లో భాగంగా మోసగాళ్ళు క్యాష్‌బ్యాక్ బహుమతిని గెలుచుకున్నట్లు వినియోగదారులకు నోటిఫికేషన్ పంపుతున్నారు. దురదృష్టవశాత్తు ఈ కొత్త ఆన్‌లైన్ స్కామ్‌లో చాలా మంది ఇరుకొని తమ యొక్క డబ్బులను కోల్పోయారు. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Paytm ఆన్‌లైన్ స్కామ్‌

తాజా Paytm ఆన్‌లైన్ స్కామ్‌లో స్కామర్‌లు వినియోగదారులకు "అభినందనలు! మీరు Paytm స్క్రాచ్ కార్డ్‌ను గెలుచుకున్నారు. " అంటూ యాదృచ్ఛిక Chrome నోటిఫికేషన్‌ను పంపుతున్నారు. ప్రస్తుత సమయంలో "మీరు క్యాష్‌బ్యాక్ గెలిచారు" అని చెప్పుకునే అటువంటి నోటిఫికేషన్‌ను తీవ్రంగా పరిగణించకూడదు. ఈ స్కామ్ సందర్భాల్లో ఇవి వినియోగదారులను మోసగించడానికి మరియు వారు కష్టపడి సంపాదించిన డబ్బు మరియు కార్డు వివరాలు, బ్యాక్ అకౌంట్ నంబర్ వంటి మరెన్నో వ్యక్తిగత వివరాలను దొంగిలించడానికి మార్గంగా ఉంటుంది.

కొత్త Paytm క్యాష్‌బ్యాక్ స్కామ్?

కొత్త Paytm క్యాష్‌బ్యాక్ స్కామ్?

"పెద్ద క్యాష్‌బ్యాక్ స్క్రాచ్ కార్డ్‌ను గెలుచుకున్నారు" అంటూ లభించే నోటిఫికేషన్ మీద ఆశపడి క్లెయిమ్ మొత్తాన్ని పొందాలనుకునే వినియోగదారులు నోటిఫికేషన్‌ మీద క్లిక్ చేసినప్పుడు ఇది అధికారిక Paytm వెబ్‌సైట్‌కు కాకుండా paytm-cashoffer.com అనే నకిలీ సైట్‌కు మళ్ళించబడుతుంది. ఇది పూర్తిగా మోసపూరిత సైట్ అని స్పష్టంగా రుజువు చేస్తుంది. అయితే చాలా మంది ఈ నకిలీ వెబ్‌సైట్‌ను అధికారిక పేటీఎం వెబ్‌సైట్ లాగా గుర్తించలేరు. అయితే మీరు url ను చూస్తే కనుక ఇది అధికారిక వెబ్‌సైట్ కు భిన్నంగా ఉంటుంది.

స్కామర్‌లు

స్కామర్‌లు పంపే ఈ నకిలీ క్యాష్‌బ్యాక్ ఆఫర్ క్లెయిమ్‌లలో మీరు రూ.2,647 గెలుచుకున్నారు అని చూపుతూ ఉంటుంది. ఇది మీ Paytm అకౌంటుకు రివార్డులను పంపమని అడుగుతుంది. 'సెండ్' బటన్‌ను క్లిక్ చేసినప్పుడు మీరు అసలైన Paytm యాప్ కి మళ్ళించబడతారు. అక్కడ మీరు అదే మొత్తాన్ని "చెల్లించమని" అడుగుతారు. దురదృష్టవశాత్తు ఇది "పే" బటన్ అని అందరూ గమనించలేరు మరియు క్లెయిమ్ చేసిన "క్యాష్‌బ్యాక్ రివార్డులు" పేటిఎం అకౌంటుకు పంపేది కాదు. కాబట్టి అక్కడ పే బటన్‌పై క్లిక్ చేయకపోవడమే మంచిది. లేకపోతే మీ పేటిఎం వాలెట్ / బ్యాంక్ ఖాతా నుండి రూ.2,647 తీసివేయబడుతుంది.

ఆన్‌లైన్ స్కామ్

ఇలాంటి ఆన్‌లైన్ స్కామ్ తో వినియోగదారులను మోసగించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి అనేక సంఘటనలు జరిగాయి. అలాంటి మోసాలను మొదటి స్థానంలోనే గుర్తించేంత స్మార్ట్ గా ఉండాలి కానీ దాని యొక్క ఉచ్చులో పడకూడదు. "పెద్ద క్యాష్‌బ్యాక్ లేదా రివార్డులు" అని చెప్పుకునే ఏదైనా మెసేజ్ లేదా నోటిఫికేషన్ చాలా సందర్భాలలో నకిలీదని మరియు వాటిని తీవ్రంగా పరిగణించరాదని గమనించాలి.

Best Mobiles in India

English summary
Paytm Cashback Scam: Alert! If You Believe Fake Notification You Lose Money

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X