Home
News

Paytm డిజిలాకర్ మినీ యాప్ గురించి మీకు తెలియని విషయాలు!!

ఇండియా యొక్క స్వదేశీ డిజిటల్ పేమెంట్ కంపెనీ Paytm తన యాప్‌లో డిజిలాకర్ కార్యాచరణను అనుసంధానం చేసింది. ఈ ఇంటిగ్రేషన్‌తో ఇది ఇప్పుడు Paytm లో DigiLocker Mini App ద్వారా అన్ని ప్రభుత్వ రికార్డులను యాక్సెస్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఈ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించి వినియోగదారులు ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, వెహికల్ ఆర్‌సి, కోవిడ్ -19 వ్యాక్సిన్ సర్టిఫికేట్ వంటి ముఖ్యమైన డాక్యుమెంట్‌లను జోడించవచ్చు మరియు తిరిగి పొందవచ్చు. ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మద్దతుతో ఈ క్లౌడ్ ఆధారిత సర్వీస్ రన్ అవుతుంది. ఇది సంబంధిత ప్రభుత్వ సర్టిఫికెట్‌లను డిజిటల్ ఫార్మాట్‌లో స్టోర్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. IT (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) చట్టం 2000 ప్రకారం ఒరిజినల్ డాక్యుమెంట్‌లతో సమానంగా డిజిలాకర్ డాక్యుమెంట్‌లు చట్టపరంగా గుర్తించబడతాయి.

Paytm

ఇంటిగ్రేషన్ విషయానికొస్తే Paytm దాని బ్యాక్ ఎండ్‌లో డాక్యుమెంట్-సంబంధిత సమాచారాన్ని స్టోర్ చేయదు లేదా పంపదు. అలాగే యూజర్ల డేటా స్థానికంగా వారి డివైజ్‌లో ఉండిపోతుంది కాబట్టి డివైజ్ ఆఫ్‌లైన్ లేదా తక్కువ కనెక్టివిటీలో ఉంటే సులభంగా యాక్సెస్ చేయవచ్చు. ఇంకా Paytm యాప్ ద్వారా కోవిడ్ -19 వ్యాక్సిన్‌లను బుక్ చేసుకున్న వారు తమ వ్యాక్సిన్ సర్టిఫికెట్‌లను ఒకే క్లిక్‌తో డిజిలాకర్‌కు జోడించవచ్చు.

DigiLocker

"డిటిలాకర్ కార్యాచరణను Paytm యాప్‌కు తీసుకురావడానికి మేము సంతోషిస్తున్నాము. వ్యాక్సిన్ బుకింగ్, ట్రావెల్, ఫాస్ట్ ట్యాగ్, ఇన్సూరెన్స్, KYC మరియు అనేక ఇతర అవసరాల కోసం Paytm యాప్‌ని తెరిచిన మిలియన్ల మంది వినియోగదారులు ముఖ్యమైన డాక్యుమెంట్‌లకు సౌలభ్యం మరియు సులభంగా యాక్సెస్ చేయడానికి వీలు కల్పించే DigiLocker ఫంక్షనాలిటీకి హర్షం వ్యక్తం చేస్తారు "అని Paytm ప్రతినిధి తెలిపారు. ఒకవేళ Paytm ఉపయోగిస్తుంటే మరియు మీ డిజిలాకర్ పత్రాలను చూడాలనుకుంటే కొన్ని సాధారణ గైడ్లను ఉపయోగించి సులభంగా చూడవచ్చు.

Paytm యాప్‌లో ఆధార్, కోవిడ్ -19 వ్యాక్సిన్ సర్టిఫికెట్‌లను స్టోర్ చేసే విధానం

Paytm యాప్‌లో ఆధార్, కోవిడ్ -19 వ్యాక్సిన్ సర్టిఫికెట్‌లను స్టోర్ చేసే విధానం

వినియోగదారులు రిజిస్టర్డ్ సంస్థల నుండి నేరుగా వ్యక్తిగత లాకర్లలోకి డిజిటల్ ఫార్మాట్‌లో ధృవీకరించబడిన పత్రాలను తిరిగి పొందడానికి, జోడించడానికి, స్టోర్ చేయడానికి మరియు స్వీకరించడానికి Paytm యాప్‌లో తమ DigiLocker ని యాక్సెస్ చేయవచ్చు. మీరు మీ అన్ని సంబంధిత డాక్యుమెంట్‌లను డిజిలాకర్‌తో ఆన్‌లైన్‌లో లింక్ చేసినట్లయితే పేటిఎమ్‌లో మీరు డాక్యుమెంట్‌లను సులభంగా యాక్సెస్ చేయవచ్చు.

స్టెప్ 1: ముందుగా మీ పరికరంలో యాప్‌ని ఇంస్టాల్ చేయండి. ఆపై ఎగువ భాగంలో ఎడమవైపు మూలలో మీ ప్రొఫైల్‌ మీద నొక్కండి.

స్టెప్ 2: అందులోని ఎంపికలలో మీరు 'డిజిలాకర్' ను కనుగొంటారు.

స్టెప్ 3: దానిపై క్లిక్ చేయడం ద్వారా మీరు డిజిలాకర్ మినీ యాప్‌కు నావిగేట్ చేయబడతారు. దాని కింద మీరు వివిధ కేటగిరీలను చూస్తారు.

స్టెప్ 4: Paytm యాప్‌లోని ప్రొఫైల్ కింద ఉన్న‘యువర్స్ డాక్యుమెంట్స్' విభాగానికి యూజర్లు వెళ్లి డాక్యుమెంట్‌లను వీక్షించవచ్చు మరియు యాక్సెస్ చేయవచ్చు.

ముందుగా చెప్పినట్లుగా Paytm లోని DigiLocker లో ఒకసారి జోడించిన పత్రాలను మీరు ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పుడు లేదా తక్కువ కనెక్టివిటీ జోన్లలో ఉన్నప్పుడు కూడా యాక్సెస్ చేయవచ్చు.

 

Paytm క్యాష్‌బ్యాక్ డీల్

Paytm తన ప్లాట్‌ఫారమ్ లో గత సంవత్సరం వినియోగదారుల కోసం LPG గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకోవడానికి ఒక ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా LPG సిలిండర్ బుకింగ్‌పై వినియోగదారులకు రూ .2,700 వరకు క్యాష్‌బ్యాక్ అందించే "3 pe 2700 క్యాష్‌బ్యాక్" ఆఫర్‌ను కంపెనీ ఇప్పుడు కొత్తగా ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ కొన్ని షరతులతో వస్తుంది. LGP సిలిండర్ బుకింగ్ ఆఫర్ కొత్త Paytm వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది అయితే ఇప్పటికే ఉన్న వారికి ఈ ఆఫర్ వర్తించదు. ఈ ఆఫర్ వినియోగదారులకు మొదటి మూడు నెలలు రూ.900 వరకు క్యాష్‌బ్యాక్‌ను అందిస్తుంది. Paytm ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవడానికి వినియోగదారులు కేవలం ‘బుక్ గ్యాస్ సిలిండర్' ఆప్షన్‌కు వెళ్లి గ్యాస్ ప్రొవైడర్‌ను ఎంచుకోవచ్చు. తరువాత మొబైల్ నంబర్/LPG ID/వినియోగదారు నెంబరు నమోదు చేయండి. తరువాత వినియోగదారులు Paytm Wallet, Paytm UPI, కార్డులు మరియు నెట్ బ్యాంకింగ్ వంటి పేమెంట్ పద్ధతిని ఉపయోగించి పేమెంట్ చేయవచ్చు.

Best Mobiles in India

English summary
Paytm DigiLocker Mini App Allows Users to Access Aadhaar, COVID-19 Certificates
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X