పేటీఎం సీఈఓను బ్లాక్‌మెయిల్‌ చేసిన పర్సనల్ సెక్రెటరీ

సొంత కంపెనీలో డాటా బ్రీచ్‌కు పాల్పడింది పేటీఎం చీఫ్‌ విజయ్‌ శేఖర్‌ శర్మ వ్యక్తిగత కార్యదర్శి సోనియా ధావన్‌.

|

సొంత కంపెనీలో డాటా బ్రీచ్‌కు పాల్పడింది పేటీఎం చీఫ్‌ విజయ్‌ శేఖర్‌ శర్మ వ్యక్తిగత కార్యదర్శి సోనియా ధావన్‌. రూ.20 కోట్లు ఇవ్వకపోతే వ్యక్తిగత డేటా, రహస్య సమచారాన్ని లీక్ చేస్తామని బ్లాక్‌మెయిల్‌ చేసింది. ఈ నేపథ్యంలో సొంత ఉద్యోగులే రూ.20 కోట్లు ఇవ్వకపోతే డేటా లీక్ చేస్తామని బెదిరిస్తున్నారని విజయ్ శేఖర్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ మహిళతో సహా ముగ్గుర్ని అరెస్ట్ చేశారు. పలు కేసులు నమోదు చేశారు.ఈ సంఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే...

అ అంటే 'అమ్మ' నుంచి .... అ అంటే 'అమెరికా' అనే స్థాయిలో తెలుగు వృద్ధిఅ అంటే 'అమ్మ' నుంచి .... అ అంటే 'అమెరికా' అనే స్థాయిలో తెలుగు వృద్ధి

పేటీఎం స్థాపించిన నాటి నుంచి సోనియా...

పేటీఎం స్థాపించిన నాటి నుంచి సోనియా...

పేటీఎం స్థాపించిన నాటి నుంచి సోనియా ఆ సంస్థలోనే పనిచేస్తోంది. విజయ్‌ శేఖర్‌ వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన సమయంలో ఆయన లాప్‌టాప్‌, మొబైల్‌, ఆఫీస్‌ కంప్యూటర్లను వినియోగించేది.

కంపెనీతో పాటు విజయ్‌ వ్యక్తిగత సమాచారాన్ని కూడా...

కంపెనీతో పాటు విజయ్‌ వ్యక్తిగత సమాచారాన్ని కూడా...

ఈ క్రమంలోనే కంపెనీతో పాటు విజయ్‌ వ్యక్తిగత సమాచారాన్ని కూడా ఆమె దొంగిలించినట్లు తెలుస్తోంది. ఇలా సేకరించిన డేటా మొత్తాన్ని రోహిత్‌ కోమల్‌ అనే వ్యక్తికి చేరవేసింది.

20 కోట్ల రూపాయలు ఇవ్వకపోతే డేటాను బహిర్గతం చేసి...
 

20 కోట్ల రూపాయలు ఇవ్వకపోతే డేటాను బహిర్గతం చేసి...

ఈ నేపథ్యంలో అతడు విజయ్‌ సోదరుడు, పేటీఎం వైస్ ప్రెసిడెంట్‌ అజయ్‌ శేఖర్‌ శర్మకు ఫోన్‌ చేశాడు. 20 కోట్ల రూపాయలు ఇవ్వకపోతే డేటాను బహిర్గతం చేసి ప్రజల్లో పేటీఎంకు ఉన్న నమ్మకాన్ని సన్నగిల్లేలా చేస్తామంటూ' బెదిరింపులకు గురిచేశాడు.

ఈ విషయాన్ని అజయ్‌ పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు....

ఈ విషయాన్ని అజయ్‌ పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు....

ఈ విషయాన్ని అజయ్‌ పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. కాగా సోనియా సహా ఆమెకు సహకరించిన వ్యక్తులపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు.ఈ కేసుతో సంబంధం ఉన్న మరొకర్ని అరెస్ట్ చేయాల్సి ఉంది. ఈ కేసుకు సంబంధించి మరిన్ని విషయాలు బయటపడాల్సి ఉంది.

Best Mobiles in India

English summary
Paytm founder Vijay Shekhar Sharma's secretary, 2 more held for Rs 20 crore blackmail in Noida.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X