లావాదేవీల్లో పేటిఎం రికార్డు, రూ.10 కోట్లు గెలుచుకునే అవకాశం
Digital payments platformలో దూసుకుపోతున్న పేటీఎం సంచలనం సృష్టించింది. జూన్ 2019 నెలలో మొత్తం 70 crore transactionsను రిజిస్టర్ అయినట్లుగా తెలిపింది.UPI-based payment applications అన్నింటిలో ఇదే అత్యధికం. Amazon Pay, Google Pay, Whatsapp Pay, and Phonepe వీటన్నింటిని వెనక్కి నెట్టివేసి పేటీఎం ఈ ఘనతను సాధించింది.

జూన్ నెల కాలంలో పేటీఎం 700 million digital transactions మైలురాయిని సాధించిందని Paytm Senior Vice President దీపక్ అబ్బోట్ తెలిపారు. peer-to-peer (P2P) లో గ్రోత్ చాలా బాగా ఉందని తద్వారానే ఆశించిన ఫలితాలు రాబట్టామని ఆయన హర్షం వ్యక్తం చేశారు. దీంతో పాటుగా cash-back మీద మరింతగా ఫోకస్ పెట్టామని తెలిపారు. ఈ సంధర్భంగా రూ.10 కోట్లు గెలుచుకునే అవకాశాన్ని పేటీఎం కల్పిస్తోంది.

పేటీఎం ఫస్ట్ గేమ్స్ యాప్ డౌన్‌లోడ్
పేటీఎం అదిరిపోయే ఆఫర్ అందిస్తోంది. ఏకంగా రూ.10 కోట్లు గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది. పేటీఎం ఫస్ట్ గేమ్స్ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని గేమ్స్ అడుతూ డబ్బు సంపాదించుకోవచ్చు. ఇది పేటీఎం క్యాష్ రూపంలో పొందొచ్చు. రూ.10 కోట్లు గెలుచుకోవాలంటే ముందుగా ఒక టీమ్‌ను ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది.

పేటీఎం అకౌంట్‌తో యాప్‌లోకి లాగిన్
పేటీఎం ఫస్ట్ గేమ్స్ అనేది ఆన్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాట్‌ఫామ్. ఇందులో చాలా గేమ్స్ ఉంటాయి. క్విజ్‌లు కూడా ఉంటాయి. వీటి రూపంలో ప్రతి రోజూ ప్రైజ్‌లు గెలుచుకోవచ్చు' అని పేటీఎం పేర్కొంది. గేమ్స్ ఆడాలంటే పేటీఎం అకౌంట్‌తో యాప్‌లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. దీని కన్నా ముందు పేటీఎం గేమ్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. పేటీఎం వెబ్‌సైట్‌లో ఒక పేటీఎం ఫస్ట్ గేమ్స్‌కు సంబంధించి ఒక విడ్జ్ కనిపిస్తుంది.

మొబైల్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా
దీనిపై క్లిక్ చేసి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా మీ ఫోన్‌కు యాప్ డౌన్ లోడ్ లింక్ వస్తుంది. దీనిపై క్లిక్ చేసి యాప్ డౌన్‌లోడ్ చేుసుకోవచ్చు. కొన్ని క్రోమ్ వంటి బ్రౌజర్లలో యాప్ లింక్ ఓపెన్ కావడం లేదు. ఇలాంటప్పుడు ఇతర బ్రౌజర్లను ఉపయోగించండి. యాప్‌లోని లాగిన్ అయిన తర్వాత టీమ్ క్రియేట్ చేసుకొని గేమ్ ఆడండి. అలాగే మీకు నచ్చిన గేమ్స్ ఆడుకోవచ్చు.

అదనపు ఛార్జీలు వసూలు
ఇదిలా ఉంటే డిజిటల్ లావాదేవీలపై పేటిఎం అదనపు ఛార్జీలు వసూలు చేయనుందనే పుకార్లు షికారు చేస్తున్న నేపథ్యంలో కంపెనీ ఆ పుకార్లను ఖండించింది. తాము ఎటువంటి ఛార్జీలను వసూలు చేయబోమని స్పష్టం చేసింది. పేటిఎం గేట్‌వే, పేటిఎం యాప్ ద్వారా కార్డులు, యూపిఐ, నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్‌లో ఏ రూపంలో వినియోగదారులు లావాదేవీలు జరిపినా ఎలాంటి ఛార్జీలు వసూలు చేయబోమని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. క్రెడిట్ కార్టు లావాదేవీలపై 1 శాతం, డెబిట్ కార్డులపై 0.9 శాతం, నెట్‌బ్యాంకింగ్, యూపిఐ లావాదేవీలపై రూ.12 నుంచి 15 వసూలు చేసేందుకు పేటియం సిద్దమవుతుందని వార్తలు వచ్చిన నేపథ్యంలో పేటియం ఈ విధంగా స్పందించింది.


Click it and Unblock the Notifications








