పేటీఎం నుంచి రూ. 20 వేలకు పైగా క్యాష్‌బ్యాక్ ఆఫర్లు
ఈ-కామర్స్ కంపెనీలన్నీ వరుసగా స్వాతంత్య్ర దినోత్సవ సేల్స్‌ను ప్రకటిస్తున్నాయి.
ఈ-కామర్స్ కంపెనీలన్నీ వరుసగా స్వాతంత్య్ర దినోత్సవ సేల్స్‌ను ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగా దిగ్గజాలు అమెజాన్ నేటి నుంచి తన 'ఫ్రీడం సేల్'ను ప్రారంభించగా.. ఫ్లిప్‌కార్ట్ 'ది బిగ్ ఫ్రీడం సేల్'ను రేపటి నుంచి నిర్వహించబోతుంది. ఈ దిగ్గజాలకు పోటీగా పేటీఎం మాల్ కూడా 'ఫ్రీడం క్యాష్‌బ్యాక్' సేల్ పేరిట తన కస్టమర్ల కోసం భారీ ఆఫర్లకు తెరలేపిందది.పేటీఎం మాల్ సేల్ ఆగస్టు 8 నుంచి ప్రారంభమై 15 వరకు సాగనుంది. ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్లు, ల్యాపీలపై భారీ క్యాష్‌బ్యాక్ ఆఫర్లను ప్రకటించింది.

ల్యాప్‌టాప్ కొనుగోలు చేసేవారికి ..
కొత్తగా ల్యాప్‌టాప్ కొనుగోలు చేసేవారికి పేటీఎం మాల్ ఏకంగా 20 వేల రూపాయల వరకు తగ్గింపు ధరను అందిస్తోంది.

లెనోవో ఐడియాప్యాడ్ 320
ఇంటెల్ కోర్ ఐ3, 4జీబీ ర్యామ్, 1టీబీ స్టోరేజ్ స్పేస్, ఏడాది పాటు యాక్సిడెంటల్ డ్యామేజ్ ప్రొటెక్షన్ కలిగిన లెనోవో ఐడియాప్యాడ్ 320 ధర పేటీఎం మాల్‌లో రూ.22,490కు తగ్గింది.

డెల్ వోస్ట్రో 3578 ల్యాప్‌టాప్
ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 1టీబీ స్టోరేజ్ స్పేస్ కలిగిన డెల్ వోస్ట్రో 3578 ల్యాప్‌టాప్‌పై ఫ్లాట్ 6000 వేల రూపాయల వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తోంది.

MSI GL63 8RE-455IN gaming laptop
ఎంఎస్‌ఐ జీఎల్63 8ఆర్‌ఈ-455ఐఎన్ గేమింగ్ ల్యాప్‌టాప్‌పై రూ.20వేల క్యాష్‌బ్యాక్‌ను పేటీఎం మాల్ తన కస్టమర్లకు ఆఫర్ చేస్తోంది.

ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్
13 శాతం తగ్గింపు, 11000 రూపాయల క్యాష్‌బ్యాక్ ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ ఎంక్యూడీ42హెచ్‌ఎన్/ ల్యాప్‌టాప్‌పై కస్టమర్లకు అందుతుంది.

సర్‌ఫేస్ ప్రొ కోర్ ఐ5 ల్యాప్‌టాప్
మైక్రోసాఫ్ట్ సర్‌ఫేస్ ప్రొ కోర్ ఐ5 ల్యాప్‌టాప్‌పై 10 వేల రూపాయల క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంది. అంతేకాక, ఆపిల్, హెచ్‌పీ, ఏసర్ వంటి పలు ప్రముఖ బ్రాండ్లపై కూడా డిస్కౌంట్లు ఉన్నాయి.

మిడ్‌నైట్ సూపర్ డీల్స్
పైన పేర్కొన్న ఆఫర్లతో పాటు మిడ్‌నైట్ సూపర్ డీల్స్‌ను రాత్రి 10 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు పేటీఎం మాల్ ఆఫర్ చేస్తోంది.

రెండు గంటలకు ఒకసారి ఫ్లాష్ సేల్స్
ప్రతి రెండు గంటలకు ఒకసారి కూడా ఫ్లాష్ సేల్స్, ఆకట్టుకునే డీల్స్ తమ కస్టమర్లకు అందుబాటులో ఉంటాయని పేటీఎం తెలిపింది.

5 శాతం క్యాష్‌బ్యాక్
ఐసీఐసీఐ క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా పేమెంట్లు జరిపేవారికి అదనంగా 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నట్టు పేటీఎం మాల్ తెలిపింది.


Click it and Unblock the Notifications








