భారీ ఆఫర్లకు సై అంటున్న Paytm, రిపబ్లిక్ డే ఆఫర్స్‌తో ఎంట్రీ

Written By:

దాదాపుగా అన్ని ఈ-కామర్స్ సంస్థలు ఇప్పుడు రిపబ్లిక్ డే సేల్‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇదే జాబితాలోకి ఇప్పుడు పేటీఎం మాల్ వచ్చి చేరింది. ఆ సైట్‌లో రిపబ్లిక్ డే సేల్ ప్రారంభమైంది. ఈ నెల 28వ తేదీ వరకు ఈ సేల్ కొనసాగనుండగా ఇందులో వినియోగదారులకు ఆకర్షణీయమైన ఆఫర్లు, డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఈ కొత్త సేల్‌లో భాగంగా పేటీఎం స్మార్ట్‌ఫోన్లపై 10వేల రూపాయల వరకు క్యాష్‌బ్యాక్‌ను‌, ల్యాప్‌టాప్‌లు, కెమెరాలపై 20వేల రూపాయల వరకు క్యాష్‌బ్యాక్‌ను, ఎలక్ట్రిక్‌ అప్లియెన్స్‌పై 20వేల రూపాయల వరకు క్యాష్‌బ్యాక్‌ను ప్రకటించింది.

జియో కాయిన్ పేరుతో వెబ్‌సైట్, వెళ్లే ముందు ఇవి తెలుసుకోండి !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఐఫోన్‌ ఎక్స్‌(64జీబీ

పేటీఎం మాల్‌ ఐఫోన్‌ ఎక్స్‌(64జీబీ)ను 83,899 రూపాయలకు లిస్ట్‌ చేసింది. దీని అసలు ధర రూ.89వేలు.

ఎక్స్‌(256జీబీ)

ఐఫోన్‌ ఎక్స్‌(256జీబీ)ను 98వేల రూపాయలకే కొనుగోలు చేసుకోవచ్చని ప్రకటించింది. దీని అసలు ధర లక్షకు పైన రూ.1,02,000గా ఉంది.

ఐఫోన్‌ 8(64జీబీ)

అంతమొత్తంలో వెచ్చించలేని వారి కోసం ఐఫోన్‌ 8(64జీబీ)ను రూ.52,706కు లిస్టు చేసింది. ఈ ఫోన్ అసలు ధర 64వేల రూపాయలు.

ఐఫోన్‌ 8 ప్లస్‌(64జీబీ)

అదేవిధంగా 73వేల రూపాయలుగా ఉన్న ఐఫోన్‌ 8 ప్లస్‌(64జీబీ)ను కూడా రూ.63,470కు అందిస్తోంది. క్యాష్‌బ్యాక్‌ మొత్తాలను పొందడానికి యూజర్లు స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేసేటప్పుడు ప్రోమో కోడ్‌లను వాడాల్సి ఉంటుంది.

వివో

వివో వీ5ఎస్‌, వివో వై55ఎస్‌, వివో వై69 వంటి 4జీ స్మార్ట్‌ఫోన్లపై పేటీఎం మాల్‌ 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. మోటో ఈ4 ప్లస్‌, లెనోవో కే6 నోట్‌, లెనోవో కే6 వపర్‌ హ్యాండ్‌సెట్లపై రూ.8000 వరకు క్యాష్‌బ్యాక్‌ను ప్రకటించింది.

శాంసంగ్‌

శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్ల విషయానికి వస్తే, క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లతో అంత ప్రముఖ హ్యాండ్‌సెట్లు లేనప్పటికీ, ఫ్లాట్‌ డిస్కౌంట్లను ప్రవేశపెట్టింది. శాంసంగ్‌ గెలాక్సీ జే3 ప్రో ధర రూ.8800 నుంచి రూ.7990కు తగ్గించింది.

గెలాక్సీ జే2

గెలాక్సీ జే2 ధరను రూ.6990కు లిస్ట్‌ చేసింది. షియోమి స్మార్ట్‌ఫోన్లపై కూడా ఫ్లాట్‌ డిస్కౌంట్లను మాత్రమే ప్రవేశపెట్టింది. పాపులర్‌ టాబ్లెట్లను కూడా పేటీఎం మాల్‌ ఈ సేల్‌లో లిస్ట్‌ చేసింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Paytm Mall Republic Day Sale Offers Cashbacks and Discounts on Smartphones, Laptops, and More News At Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot