Home
News

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌లో మరో కీలక పరిణామం.. ఎక్స్ఛేంజీలకు సమాచారం!

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పేటీఎం సంస్థ ఛైర్మన్‌ విజయ్‌ శేఖర్‌ శర్మ రాజీనామా చేశారు. బోర్డు సభ్యత్వం, ఛైర్మన్‌ పదవిని వదులుకున్నారు. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌పై ఆర్‌బీఐ తీసుకున్న చర్యల నుంచి నేటి వరకు అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. అయితే బోర్డు పునర్నిర్మాణం పూర్తయిందని, కొత్త ఛైర్మన్‌ ప్రక్రియపై త్వరలో ప్రకటన చేస్తామని వెల్లడించింది.

సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మాజీ ఛైర్మన్‌ శ్రీనివాసన్‌ శ్రీధర్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా మాజీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అశోక్‌ కుమార్‌ గార్గ్‌, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి దేవేంద్రనాథ్‌ సారంగి, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి రజ్నీ సెఖ్రి సిబాల్‌ను బోర్డు డైరెక్టర్‌లుగా నియమించినట్లు పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ (Paytm Payments Bank) ఎక్స్చేంజీలకు సమాచారం ఇచ్చింది.

vijay shekhar sharma

మానిటరీ పాలసీలు, ఇతర నిబంధనలు, మార్గదర్శకాలను పాటించని కారణంగా డిపాజిట్లు తీసుకోవడం, క్రెడిట్‌ లావాదేవీలు చేపట్టకూడదని పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ను రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ఆదేశించింది. ఆర్‌బీఐ ఆదేశాలతో పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌లో ఫిబ్రవరి 29 తర్వాత వాలెట్స్‌, ప్రీపెయిడ్‌ ట్రాన్సాక్షన్లు, టాప్‌-అప్‌లు నిలిచిపోనున్నాయి. అయితే ఈ గడువును మార్చి 15 వరకు పొడిగించింది.

ఆడిట్‌ నివేదికల ఆధారంగా బ్యాంకులో ఉల్లంఘనలను గుర్తించామని ఈ కారణంగానే పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌పై చర్యలు తీసుకున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. పేటీఎం మాతృ సంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ లిమిటిడ్‌, పేటీఎం పేమెంట్స్ బ్యాంకు లిమిటెడ్‌ నోడల్‌ అకౌంట్లను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. 2022 సంవత్సరంలోనూ పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకు లిమిటెడ్‌పై RBI చర్యలు తీసుకుంది. కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే.

vijay shekhar sharma

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ యూజర్లు అకౌంట్లలోని నగదును వినియోగించుకొనేందుకు ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేసింది. అంటే పేమెంట్స్‌ బ్యాంకులోని కరెంట్‌ అకౌంట్‌, సేవింగ్స్‌ అకౌంట్‌, ప్రీపెయిడ్‌ ఇన్‌స్ట్రుమెంట్‌, నేషనల్‌ మొబిలిటీ కార్టు, ఇతర నగదును విత్‌డ్రా సహా వినియోగించుకోవడంపై ఎలాంటి ఆంక్షలు లేవని వెల్లడించింది. దీంతోపాటు రిఫండ్లు, క్యాష్‌బ్యాక్‌, వడ్డీపై ఆంక్షలు లేవని పేర్కొంది.

ఆర్‌బీఐ నిర్ణయం అనంతరం ఫాస్టాగ్‌ జారీ చేసే బ్యాంకుల జాబితా నుంచి పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకును తొలగించింది. నేషనల్‌ హైవే అథారిటికి చెందిన రహదారుల నిర్వహణ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. తమ జాబితాలోని బ్యాంకుల నుంచి మాత్రమే ఫాస్టాగ్‌ను కొనుగోలు చేయాలని వాహనాదారులకు సూచించింది.

పంజాబ్‌ నేషనల్ బ్యాంక్‌, అలహాబాద్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ సహా మొత్తం 32 బ్యాంకుల్లో మాత్రమే ఫాస్టాగ్‌ను కొనుగోలు చేయాలని సూచించింది. ఇప్పటికే రిజర్వ్ బ్యాంకు ఆఫ్‌ చర్యలతో సతమతం అవుతున్న పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌కు ఈ నిర్ణయంతో మరో షాక్‌ తగిలినట్లు అయింది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
paytm payments bank Chairman vijay shekhar sharma resigned
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X