Paytm Postpaid యూజర్లకు గొప్ప ఛాన్స్!! EMI సిస్టమ్‌లో తిరిగి చెల్లించే అవకాశం...

|

ఆన్‌లైన్ పేమెంట్ యాప్ లలో క్రెడిట్ సర్వీసులను అందించే పేటిఎమ్ ఇప్పుడు తన పోస్ట్‌పెయిడ్ వినియోగదారుల కోసం కొత్తగా మరొక సర్వీసును అందిస్తున్నది. ఇందులో భాగంగా పోస్ట్‌పెయిడ్ వినియోగదారులు తమ యొక్క బకాయిలను సాధారణ వాయిదాల పద్దతిలో తిరిగి చెల్లించడానికి అనుమతిస్తుంది. ఇప్పటి వరకు సంబంధిత వినియోగదారుడు చెల్లించాల్సిన మొత్తం డబ్బును పూర్తిగా ఒకే సారి తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండేది. పేటిఎమ్ తన క్రెడిట్ వినియోగదారులకు ఇటీవల ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ (EMI) లోని బకాయిలను తిరిగి చెల్లించటానికి అనుమతిస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Paytm పోస్ట్‌పెయిడ్ వినియోగదారులు EMI సిస్టమ్‌లో తిరిగి చెల్లించే విధానం

Paytm పోస్ట్‌పెయిడ్ వినియోగదారులు EMI సిస్టమ్‌లో తిరిగి చెల్లించే విధానం

Paytm యొక్క పోస్ట్‌పెయిడ్ వినియోగదారులు ఎటువంటి బడ్జెట్ పరిమితులు లేకుండా తమకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేయడానికి అనుమతిని ఇస్తుంది. అయితే సంస్థ ఇప్పుడు తమ బకాయిలను EMI పద్దతిలో తిరిగి చెల్లించడానికి అనుమతిస్తుంది. దేశంలో అన్ని షాపులు మరియు వెబ్‌సైట్‌లలో ఇప్పుడు Paytm ద్వారా 5 లక్షల వరకు కొనుగోలు చేయడానికి మరియు తరువాత EMI పద్దతిలో చెల్లించే సదుపాయాన్ని అందిస్తాయి.

 

Also Read: తాజాగా మరో 43 మొబైల్ యాప్‌లను బ్యాన్ చేసిన భారత ప్రభుత్వం...Also Read: తాజాగా మరో 43 మొబైల్ యాప్‌లను బ్యాన్ చేసిన భారత ప్రభుత్వం...

Paytm పోస్ట్‌పెయిడ్ EMI లో వడ్డీ మొత్తం

Paytm పోస్ట్‌పెయిడ్ EMI లో వడ్డీ మొత్తం

Paytm పోస్ట్‌పెయిడ్ ద్వారా పొందే రుణ మొత్తం ఖచ్చితంగా వడ్డీ లేనిది మాత్రం కాదు. దీని మీద నామమాత్రపు మినిమమ్ వడ్డీ వసూలు చేయబడుతుంది. దీనిని EMI చెల్లింపులకు జోడించబడుతుంది. వినియోగదారులు తమ యొక్క బిల్లును తిరిగి చెల్లించడానికి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ మరియు యుపిఐ వంటి అనేక పేమెంట్ మాధ్యమాలను ఎంచుకోవచ్చు.

Paytm పోస్ట్‌పెయిడ్ క్రెడిట్ లిమిట్

Paytm పోస్ట్‌పెయిడ్ క్రెడిట్ లిమిట్

Paytm వినియోగదారుల యొక్క కొనుగోళ్లను ట్రాక్ చేయడానికి మరియు మరింత ఖచ్చితంగా ఖర్చు చేయడానికి Paytm వినియోగదారులకు ఒకే ఒక నెలవారీ బిల్లును మాత్రమే అందిస్తుంది. ఇది వినియోగదారులు ఖర్చు చేసిన ప్రతిదాన్ని జాబితా చేస్తుంది. సంస్థ విడుదల చేసే డేటా ప్రకారం బిల్లు ఉత్పత్తి అయిన మొదటి 7 రోజుల్లో పోస్ట్‌పెయిడ్ బిల్లును సౌకర్యవంతమైన EMI లుగా మార్చడానికి అవకాశం ఉంటుంది. దీని అర్థం మొత్తం బిల్లు బకాయిలను ఒకే సారి పూర్తిగా చెల్లించవచ్చు లేదా 7 రోజుల లోపు మీరు దానిని సౌకర్యవంతమైన EMI పేమెంట్ వ్యవస్థగా మార్చవచ్చు. పేటీఎం పోస్ట్‌పెయిడ్‌తో యూజర్లు లక్ష రూపాయల వరకు క్రెడిట్ పొందవచ్చు సకాలంలో పేమెంట్ చేస్తే కనుక అది మరింత పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. Paytm తన పోస్ట్‌పెయిడ్ ప్లాట్‌ఫామ్ విజయవంతంగా 7 మిలియన్ల వినియోగదారులను నమోదు చేసినట్లు ఇటీవల ప్రకటించింది.

Best Mobiles in India

English summary
Paytm Postpaid Users Now Pay Their Shopping Bill Dues in EMI System

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X