పేటీఎమ్ Pre-GST సేల్, ఆఫర్లే ఆఫర్లు

పేటీఎమ్ మాల్ వేదికగా మూడు రోజులు Pre-GST సేల్ మంగళవారం ప్రారంభమైంది. గురువారం వరకు జరిగే ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్‌టాప్స్, టెలివిజన్స్ ఇంకా డీఎస్ఎల్ఆర్ కెమెరాల పై రూ.20,000 వరకు క్యాష్‌బ్యాక్‌ను పేటీఎమ్ ఆఫర్ చేస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఏసీల పై కూడా భారీ డిస్కౌంట్లు...

ఈ జీఎస్టీ క్లియరెన్స్ సేల్ భాగంగా ఏసీలతో పాటు రిఫ్రీజరేటర్లు పై కూడా పేటీఎమ్ భారీ డిస్కౌంట్లను సిద్ధంగా ఉంచింది. ప్రీ-జీఎస్టీ సేల్‌లో భాగంగా వివిధ ప్రొడక్ట్స్ పై పేటీఎమ్ అందిస్తోన్న ఆఫర్ల వివరాలను ఇప్పుడు చూద్దాం..

మొబైల్ ఆఫర్స్ ఇవే..

యాపిల్ ఐఫోన్ మోడల్స్ పై రూ.10,000 వరకు క్యాష్‌బ్యాక్.
వివో, ఒప్పో స్మార్ట్‌ఫోన్‌ల పై రూ.10,000 వరకు క్యాష్‌బ్యాక్.
లైఫ్, ఇంటెక్స్ స్మార్ట్‌ఫోన్‌ల పై 15% వరకు క్యాష్‌బ్యాక్.
3000ఎమ్ఏహెచ్ కంటే ఎక్కువ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉన్న మైక్రోమాక్స్, జియోనీ స్మార్ట్‌ఫోన్‌ల పై 15% వరకు క్యాష్‌బ్యాక్.
12 మెగా పిక్సల్ కంటే ఎక్కువ కెమెరాను కలిగి ఉన్న వివో, ఒప్పో స్మార్ట్‌ఫోన్‌ల పై 15% వరకు క్యాష్‌బ్యాక్.

ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, స్మార్ట్‌టీవీల పై భారీ క్యాష్‌బ్యాక్ ఆఫర్స్..

లెనోవో, హెచ్‌పి, యాపిల్ ల్యాప్‌టాప్‌ల పై రూ.20,000 వరకు క్యాష్‌బ్యాక్. యాక్సెసరీస్ పై 50% వరకు డిస్కౌంట్. సామ్‌సంగ్, ఎల్‌జీ, సోనీ స్మార్ట్‌టీవీల పై రూ.20,000 వరకు క్యాష్‌బ్యాక్. బ్రాండెడ్ ఎల్ఈడి టీవీల పై రూ.20,000 వరకు క్యాష్‌బ్యాక్. వోల్టాస్, హిటాచీ, డైకిన్ ఎయిర్ కండీషనర్స్ పై రూ.5,000 వరకు క్యాష్‌బ్యాక్.

6000 రిటైలర్లు, 500 బ్రాండ్‌లు..

మూడు రోజులు పాటు జరుగుతోన్న ఈ పేటీఎమ్ పీ-జీఎస్టీ సేల్‌లో భాగంగా 500 బ్రాండ్‌లకు సంబంధించి 6000 రిటైలర్లు పాలుపంచుకుంటున్నట్లు తెలుస్తోంది.

జూలై 1 నుంచి కొత్త పన్ను విధానం..

జూలై 1 నుంచి కొత్త పన్ను విధానం అమల్లోకి వస్తోన్న నేపథ్యంలో ఎలక్ట్రానిక్ ఉపకరణాల విక్రయదారులు తమ వద్ద ఉన్న సరుకును జూలై 1 నాటికి క్లియర్ చేసుకోవాలని చూస్తున్నారు. స్టాక్ ను క్లియర్ చేసుకునే సమయంలో భారీ డిస్కౌంట్లను ఎరవేస్తున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

 

English summary
Paytm Pre-GST Sale Kicks Off With Offers on Mobiles, Laptops, and More. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot