పేటీఎంను నిలువునా ముంచిన ఉద్యోగులు, రూ. 10 కోట్ల మేర మోసం

ఈ కామర్స్ మార్కెట్లోనూ, డిజిటల్ వ్యాలెట్ యాప్ లోనూ దూసుకుపోతున్న పేటీఎంకు ఉద్యోగుల నుంచి అనుకోని షాక్ తగిలింది. ఈ దేశీ దిగ్గజానికి ఉద్యోగులే కన్నం వేశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 10 కోట్ల మేర మ

|

ఈ కామర్స్ మార్కెట్లోనూ, డిజిటల్ వ్యాలెట్ యాప్ లోనూ దూసుకుపోతున్న పేటీఎంకు ఉద్యోగుల నుంచి అనుకోని షాక్ తగిలింది. ఈ దేశీ దిగ్గజానికి ఉద్యోగులే కన్నం వేశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 10 కోట్ల మేర మోసం చేశారు. క్యాష్‌బ్యాక్స్ రూపంలో ఏకంగా రూ.5-10 కోట్ల మోసం జరిగినట్లు కంపెనీ వెల్లడించింది.

పేటీఎంను నిలువునా ముంచిన ఉద్యోగులు, రూ. 10 కోట్ల మేర మోసం

గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెసర్ సంస్థ ఈవై (ఎర్నెస్ట్ అండ్ యంగ్) రూపొందించిన ప్రత్యేకమైన టూల్ సాయంతో ఈ మోసాన్ని గుర్తించినట్లు కంపెనీ పేర్కొంది. ఉద్యోగులు, వ్యాపారులు కలిసి కుమ్మక్కై చేసిన క్యాష్‌బ్యాక్‌ మోసం పరిమాణం దాదాపు రూ. 10 కోట్లు ఉంటుందని పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్‌ శేఖర్‌ శర్మ తెలిపారు.

ఎలా గుర్తించారంటే..

ఎలా గుర్తించారంటే..

ప్లాట్‌ఫామ్‌లోకి కొందరు చిన్న సెల్లర్లకు భారీగా క్యాష్‌బ్యాక్ లభిస్తున్న విషయాన్ని గుర్తించాం. దీని మీద మేము అంతర్గత విచారణ నిర్వహించాం. ఇందులో దాదాపు రూ.10 కోట్ల మోసం బయటపడిందని పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్‌ శేఖర్‌ శర్మ తెలిపారు.

ఉద్యోగులు, సెల్లర్లు

ఉద్యోగులు, సెల్లర్లు

కాగా ఉద్యోగులు, సెల్లర్లు కలిసి కుమ్మక్కై ఈ క్యాష్‌బ్యాక్‌ మోసానికి పాల్పడ్డారని పేటీఎం మాల్ పేర్కొంది. ఈ మోసం బయటపడిన నేపథ్యంలో వంద మంది విక్రేతలను తమ ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించామని, అలాగే కొందరు ఉద్యోగులను తీసేశామని తెలిపింది.

 ఈవై నిర్వహించిన ఆడిట్‌లో

ఈవై నిర్వహించిన ఆడిట్‌లో

ప్రముఖ ఆడిటింగ్‌ సంస్థ ఈవై నిర్వహించిన ఆడిట్‌లో కొందరు జూనియర్‌ స్థాయి ఉద్యోగులు, సంస్థలు కుమ్మక్కై ఈ క్యాష్‌బ్యాక్‌ కుంభకోణానికి తెరతీసినట్లు వెల్లడైందని విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. ఉద్యోగులు వెండర్లతో కలిసి ఫేక్ ఆర్డర్లను క్రియేట్ చేసి క్యాష్‌బ్యాక్స్‌ను సొంత బ్యాంక్ అకౌంట్లలోకి మళ్లించారని పేర్కొన్నారు.

కొంత మంది విక్రేతలకు

కొంత మంది విక్రేతలకు

దీపావళి తర్వాత కొంత మంది విక్రేతలకు పెద్ద ఎత్తున క్యాష్‌బ్యాక్‌ లభిస్తుండటాన్ని మా టీమ్‌ గుర్తించింది. దీన్ని మరింత లోతుగా పరిశీలించాలని మా ఆడిటర్లను కోరామని విజయ్‌ శేఖర్‌ శర్మ చెప్పారు. ఆడిటింగ్‌ సంస్థ ఈవై నిర్వహించిన ఆడిట్‌లో కొందరు జూనియర్‌ స్థాయి ఉద్యోగులు, సంస్థలు కుమ్మక్కై ఈ క్యాష్‌బ్యాక్‌ కుంభకోణానికి తెరతీసినట్లు వెల్లడైందని ఆయన వివరించారు.

వాట్సప్‌ రాకను

వాట్సప్‌ రాకను

మరోవైపు, ఇప్పటిదాకా పేమెంట్స్‌ వ్యవస్థలోకి మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ రాకను తీవ్రంగా వ్యతిరేకించిన విజయ్‌ శేఖర్‌ శర్మ తాజాగా స్వరం మార్చారు. వాట్సప్‌ లాంటి సంస్థల రాక స్వాగతించదగ్గ పరిణామమేనన్నారు. భారతీయ చట్టాలను పాటించడానికి సిద్ధంగా లేని సంస్థలను మాత్రమే తాను వ్యతిరేకించానని ఆయన చెప్పారు.

క్యాష్‌బ్యాక్‌లిచ్చినా ఫర్వాలేదు

క్యాష్‌బ్యాక్‌లిచ్చినా ఫర్వాలేదు

క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లతో వ్యాపారం లాభసాటిగా ఉండదన్న ఆరోపణలపై స్పందిస్తూ.. ఇలాంటివి ఇచ్చినా వ్యాపారం నిలదొక్కుకోగలదని శర్మ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం మరింత మంది యూజర్లు, వ్యాపారులకు చేరువయ్యేందుకు భారీగా వ్యయాలు చేస్తున్నందున లాభాల్లోకి మళ్లేందుకు మరికాస్త సమయం పట్టవచ్చన్నారు. యూజర్ల సంఖ్య 30 నుంచి 50 కోట్ల దాకా, వ్యాపార సంస్థల సంఖ్య ప్రస్తుతమున్న 1.2 కోట్ల నుంచి 4 కోట్లకు పెరిగేదాకా లాభాలు నమోదు కాకపోవచ్చని విజయ్‌ శేఖర్‌ శర్మ పేర్కొన్నారు.

రూ.50వేల‌కు పైగా వాడుకుంటే

రూ.50వేల‌కు పైగా వాడుకుంటే

ఈ న్యూస్ ఇలా ఉండగానే పేటీఎం సంస్థ తమ కస్టమర్ల కోసం క్రెడిట్ కార్డున ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కార్డును ఉప‌యోగించి ఏడాదికి రూ.50వేల‌కు పైగా వాడుకుంటే వార్షిక ఫీజు రూ.500 ల‌ను ర‌ద్దు చేస్తారు. ఈ కార్డుతో క‌స్ట‌మ‌ర్లు ప‌లు వ‌స్తువుల‌ను ఈఎంఐ విధానంలోనూ కొనుగోలు చేసే అవ‌కాశం క‌ల్పిస్తున్నారు. ఇక ఈ కార్డు కావాలంటే పేటీఎం క‌స్ట‌మ‌ర్లు పేటీఎం యాప్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది.

 దేశంలో, విదేశాల్లోనూ..

దేశంలో, విదేశాల్లోనూ..

పేటీఎం క్రెడిట్ కార్డుతో ప్రతి లావాదేవీపై ఒక శాతం క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. దీనికి ఎలాంటి పరిమితులు విధించలేదు. ప్రతి నెల ఈ క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డు అకౌంట్‌లో ఆటోమేటిక్‌గా జమ అవుతుంది. ఈ క్రెడిట్ కార్డును వినియోగదారులు దేశంలోనూ, విదేశాల్లోనూ ఉపయోగించుకోవచ్చు పేటీఎం యాప్ ద్వారా వినియోగదారులు పేటీఎం ఫస్ట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కంపెనీ స్పష్టం చేసింది. క్రెడిట్ కార్డు యూజర్లు డైనింగ్, షాపింగ్, ట్రావెల్ వంటి వాటికి సంబంధించి ఎక్స్‌క్లూజివ్ ఆఫర్లు కూడా పొందొచ్చు.

పేటీఎం ప్రోమో కోడ్స్‌

పేటీఎం ప్రోమో కోడ్స్‌

క్రెడిట్ కార్డు యూజర్లు తొలి నాలుగు నెలల కాలంలో కార్డు ద్వారా కనీసం రూ.10,000 ఖర్చు చేస్తే రూ.10,000 విలువైన పేటీఎం ప్రోమో కోడ్స్‌‌ను పొందొచ్చు. పేటీఎం ఫస్ట్ కార్డులో లావాదేవీల వివరాలు మాత్రమే కాకుండా పేటీఎం, సిటీ బ్యాంక్ ఎక్స్‌క్లూజివ్ ఆఫర్లు కూడా చూడొచ్చు.

Best Mobiles in India

English summary
Paytm cashback audit unearths 10 cr fraud, says Vijay Shekhar Sharma

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X