Home
News

paytm యూజర్‌లకు గుడ్‌న్యూస్‌.. QR కోడ్‌ కోసం కొత్త ఫీచర్‌ విడుదల.. ఎలా యాక్టివేట్‌ చేసుకోవాలి..!

డిజిటల్‌ పేమెంట్స్‌ గణనీయంగా వృద్ధి చెందాయి. UPI యాప్‌ల మధ్య పోటీ నెలకొంటుంది. దీంతో వినియోగదారులను ఆకట్టుకొనే విధంగా అనేక ఫీచర్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. చిరు దుకాణాల నుంచి పెద్ద షాపింగ్‌ మాల్స్‌ వరకు డిజిటల్‌ పేమెంట్స్‌ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. UPI, QR కోడ్‌ల ద్వారా ప్రస్తుతం భారీగా ట్రాన్సాక్షన్‌లు జరుగుతున్నాయి. దుకాణాల్లో UPI, QR కోడ్‌ల ద్వారా జరిగే ట్రాన్సాక్షన్‌లు గురించే తెలిసేలా ఇప్పటికే స్మార్ట్‌ స్పీకర్‌లను కూడా కొన్ని సంస్థలు అందుబాటులోకి తీసుకొచ్చాయి.

జియో భారత్‌ ఫోన్‌లలో ఇటీవల ఇదే తరహా ఫీచర్‌ను తీసుకొచ్చింది. ట్రాన్సాక్షన్‌ల గురించి తెలిసేలా సౌండ్‌ అలెర్ట్‌ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే తాజాగా మరో ప్రముఖ UPI యాప్‌ పేటీఎం (Paytm).. యూజర్‌లకు ఉపయోగపడేలా కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది.

paytm

పేటీఎం తాజాగా Receive Money QR Widget పేరుతో ఆండ్రాయిడ్ యూజర్‌ల కోసం కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌ తో QR కోడ్‌ కోసం ప్రతిసారి యాప్‌ను ఓపెన్‌ చేయాల్సిన అవసరం లేకుండా.. నేరుగా హోం స్క్రీన్‌లోనే కోడ్ డిస్‌ప్లే కానుంది. దుకాణాలు సహా ఇతర షాపింగ్‌ మాల్స్‌లో ఈ ఫీచర్‌ బాగా ఉపయోగపడుతుంది.

అయితే ఇప్పటికే ఈ ఫీచర్‌ ఐఫోన్‌ యాజర్‌లకు అందుబాటులోకి వచ్చింది. దీంతోపాటు మరో ఫీచర్‌ను కూడా పేటీఎం తీసుకొచ్చింది. మీ ఖాతాలోకి నగదు ట్రాన్స్‌ఫర్‌ జరిగినప్పుడు మీకు వెంటనే తెలిసేలా Coin Drop సౌండ్‌ నోటిఫికేషన్‌ రూపంలో తెలుసుకోవచ్చు. ప్రస్తుతం QR కోడ్‌ల ద్వారా మోసాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఫీచర్‌ ద్వారా ట్రాన్సాక్షన్‌ వివరాలు తెలియనున్నాయి.

paytm

పేటీఎం తీసుకొచ్చిన కొత్త ఫీచర్‌లను ఎలా యాక్టివేట్‌ చేసుకోవాలి?
ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌లో పేటీఎం యాప్‌ ఓపెన్‌ చేయాలి. అనంతరం ప్రొఫైల్‌ ఐకాన్‌ పైన క్లిక్‌ చేయాలి. తర్వాత Flyout menu ను ఓపెన్‌ చేసి QR కోడ్‌ను హోం స్క్రీన్‌ను యాడ్‌ చేసుకోవాలి. చివరిగా మీ యాప్‌ను క్లోజ్‌ చేయాలి. ఇప్పుడు మీ స్మార్ట్‌ఫోన్‌ హోమ్‌ స్క్రీన్‌ను తనిఖీ చేస్తే పేటీఎం QR కోడ్‌ కనిపిస్తుంది.

* ఇటీవలే జియోభారత్‌ ఫోన్‌లలో జియో సౌండ్‌ పే సర్వీసులను ప్రారంభించింది. ఫలితంగా UPI పేమెంట్‌ల సమయంలో ఆ సమాచారం ఆడియో అలెర్ట్‌ రూపంలో యూజర్లకు తెలుస్తుంది. పేటీఎం, ఫోన్‌పే సంస్థలపై జియో సౌండ్‌ పే ఫీచర్‌.. ప్రభావం చూపే అవకాశం ఉంది.

అయితే జియో తీసుకొచ్చిన కొత్త సర్వీసులు ముఖ్యంగా చిన్న దుకాణాలు, వీధుల్లో దుకాణాలు నిర్వహించే యూజర్‌లకు ఉపయోగపడుతుంది. ప్రతి సంవత్సరం రూ.1500 వరకు ఆదా అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం పేమెంట్లు చేసిన తర్వాత వాటి సమాచారం తెలిసేలా అనేక మంది దుకాణాలు దారులు సౌండ్‌బాక్స్‌లను ఏర్పాటు చేసుకున్నారు.

ఆ బాక్స్‌ల కోసం ప్రతి నెలా రూ.125 వరకు అద్దె చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. జియో సౌండ్‌ పే సర్వీసులతో ఆ నగదు ఆదా కానుంది. ఎందుకంటే ఈ ఫీచర్‌ను ఉచితంగా అందిస్తోంది. అదే పేటీఎం, ఫోన్‌పే సౌండ్‌బాక్స్‌ల కోసం ఆయా సంస్థలు అద్దె వసూలు చేస్తున్నాయి. జియో నిర్ణయం వారిపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఈ కొత్త ఫీచర్ జియోభారత్‌ ఫోన్‌లలో సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్‌ల కోసం జియో ప్రత్యేకంగా రీఛార్జ్‌ ప్లాన్‌లను కూడా తీసుకొచ్చింది. కాలింగ్‌, SMS, డేటాతోపాటు జియో యాప్‌లను కూడా వినియోగించుకోవచ్చు. జియో భారత్‌ స్మార్ట్‌ఫోన్‌లో 455 లైవ్ టీవీ ఛానళ్లు, జియో సినిమా, జియో సావన్‌, జియో పే వంటి యాప్స్‌ను ఉపయోగించుకోవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
paytm Receive Money QR Widget and coin code notification features launched in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X