300 మిల్లియన్ రిజిస్ట్రర్‌ యూజర్ల డేటా లీక్, Paytm స్పందన ఇదే !

|

ప్రపంచం వ్యాప్తంగా సోషల్ మీడియా ద్వారా యూజర్ల డేటా లీక్ అవుతుండటం అందర్నీ అయోమయానికి గురిచేస్తోంది. మొన్న ఫేస్‌బుక్, నిన్నవాట్సప్, ట్విట్టర్ లాంటి దిగ్గజాల డేటా లీక్ అయ్యాయనే వార్తలు మరచిపోకముందే ఇప్పుడు పేటీఎమ్ లీక్ వార్తలు ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. పేటీఎమ్ యూజర్ల డేటా లీకయిదంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ వీడియోపై డిజిటల్‌ వాలెట్‌ దిగ్గజ పేమెంట్‌ కంపెనీ పేటీఎం మండిపడింది.

 

యూట్యూబ్ Offline వీడియోలను డిలీట్ చేయటం ఎలా..?యూట్యూబ్ Offline వీడియోలను డిలీట్ చేయటం ఎలా..?

00 మిలియన్‌ రిజిస్ట్రర్‌ యూజర్ల డేటా..

00 మిలియన్‌ రిజిస్ట్రర్‌ యూజర్ల డేటా..

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియోలో చెప్పినట్టు తాము యూజర్ల డేటాను థర్డ్‌ పార్టీలకు షేర్‌ చేయడం లేదని పేటీఎం స్పష్టం చేసింది. భారత్‌లోని తమ 300 మిలియన్‌ రిజిస్ట్రర్‌ యూజర్ల డేటా భద్రంగా ఉందని పేటీఎం పేర్కొంది.

తన బ్లాగ్‌ పోస్టులో..

సోషల్‌ మీడియా వ్యాప్తంగా ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. థర్డ్‌ పార్టీలకు కొంత డేటా షేర్‌ చేస్తున్నట్టు చెబుతున్న ఆ వీడియోలో ఎలాంటి వాస్తవం లేదు' అని కంపెనీ తన బ్లాగ్‌ పోస్టులో పేర్కొంది. విజ్ఞప్తి మేరకు లా ఎన్‌ఫోర్స్‌మెంట్ సంస్థలకు తప్ప ఎవరికీ యూజర్ల డేటాను ఇవ్వలేదని పేర్కొంటూ ట్వీట్ చేసింది.

మీ డేటా మీదే
 

మీ డేటా మీదే

పేటీఎంలో మీ డేటా మీదే.అది ఎప్పటికీ మాది కాదు, థర్డ్‌ పార్టీది కాదు లేదా ప్రభుత్వానిది కాదు' అని క్లారిటీ ఇచ్చింది. 

యూజర్లు అనుమతి ఇవ్వకపోతే..

యూజర్లు అనుమతి ఇవ్వకపోతే..

యూజర్లు అనుమతి ఇవ్వకపోతే, తాము ఎలాంటి డేటాను ఎవరికీ షేర్‌ చేయమని, ఇది యూజర్లకు, కంపెనీకి మధ్య ఉండే ఒక నమ్మకమని చెప్పింది. తమ వినియోగదారుల సమాచారం వంద శాతం సురక్షితంగా ఉందని పేర్కొంది.

డిజిటల్‌ లావాదేవీల్లో

డిజిటల్‌ లావాదేవీల్లో

డిజిటల్‌ లావాదేవీల్లో పేటీఎం దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల డేటా షేరింగ్‌పై పెద్ద ఎత్తున్న ఆందోళనలు రేకెత్తడంతో, పేటీఎం కూడా థర్డ్‌ పార్టీలకు యూజర్ల డేటా షేర్‌ చేస్తుందని ఆరోపణలు వస్తున్నాయి.

స్టింగ్‌ ఆపరేషన్‌లో ..

స్టింగ్‌ ఆపరేషన్‌లో ..

అంతేకాక వినియోగదారుల సమాచారం కావాలంటూ ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్‌ వచ్చిందని పేటీఎం సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కోబ్రాపోస్ట్ ఛానల్‌ చేసిన స్టింగ్‌ ఆపరేషన్‌లో వెల్లడించారు.

సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలో

సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలో

దీంతో ఈ వివాదం పెద్ద ఎత్తున చెలరేగింది.కాగా Cobrapost స్టింగ్‌ ఆపరేషన్‌ను పేటీఎం ఖండించింది. సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలో అసలేమాత్రం నిజాలు లేవని, అన్నీ అబద్ధాలేనని స్పష్టంచేసింది.

Best Mobiles in India

English summary
Paytm Says Never Shared Indian Users' Data With Third Parties More news at GizbotTelugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X